Begin typing your search above and press return to search.

ప్రగతి భవన్ ఎదుట బారికేడ్లు తొలగింపు

తెలంగాణలో అధికార మార్పిడి జరిగింది. బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో కొనసాగింది

By:  Tupaki Desk   |   7 Dec 2023 8:38 AM GMT
ప్రగతి భవన్ ఎదుట బారికేడ్లు తొలగింపు
X

తెలంగాణలో అధికార మార్పిడి జరిగింది. బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో కొనసాగింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. దీంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రెండుసార్లు అధికారం చేపట్టిన బీఆర్ఎస్ పార్టీకి ఓటర్లు చరమగీతం పాడారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి 64 సీట్లతో స్పష్టమైన మెజార్టీ సాధించడం గమనార్హం.

ప్రగతి భవన్ చుట్టు బారికేడ్లు, గ్రిల్ ఏర్పాటు చేసుకున్నారు బీఆర్ఎస్ నాయకులు. లోపలకు ఎవరు కూడా అంత తేలిగ్గా రాకుండా భద్రత ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో వాటిని తొలగిస్తున్నారు. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రగతి భవన్ చుట్టు ఉన్న బారికేడ్లు, గ్రిల్ గ్యాస్ కట్టర్లతో తీసేస్తున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నారు.

నగరంలోని ప్రగతి భవన్ ముందు గత ప్రభుత్వం బారికేడ్లు పెట్టించింది. నూతన ప్రభుత్వం కొలువుదీరుతున్న నేపథ్యంలో వాటిని తొలగించేందుకు నిర్ణయించింది. దీంతో వాటిని తీసేయాలని ఆదేశించింది. ఈ మేరకు కార్మికులు వాటిని తొలగిస్తున్నారు. కొత్త ప్రభుత్వం వాటిని తీసేసేందుకే ఆదేశాలు ఇవ్వడంతో పనులు జరుగుతున్నాయి.

బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయాలను కొత్త ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతోనే వాటిని తొలగించి ఎలాంటి అడ్డంకులు లేకుండా చేయాలని భావిస్తోంది. ఈనేపథ్యంలో బారికేడ్లు, గ్రిల్స్ ను తొలగిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా ఉంచుకోవాలనే చూస్తోంది. బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన బారికేడ్లతో ఇబ్బందులొస్తాయని గుర్తించింది. అందుకే వాటిని తొలగించాలని భావించింది.

పరిపాలనలో కొత్త మార్గదర్శకాలను తీసుకురానుంది. బీఆర్ఎస్ పార్టీకి భిన్నంగా తమ పాలన ఉండాలని చూస్తోంది. దీని కోసమే పలు నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రజలకు మెరుగైన పాలన అందించడానికే మొగ్గు చూపుతోంది. దీని కోసమే తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటోంది. దీనికి గాను తన మార్కును చూపించడానికి చొరవ తీసుకుంటోంది.