Begin typing your search above and press return to search.

ప్రగతి భవన్ అడ్డుగోడలు తీసేస్తున్నారా ?

రోడ్డుపై ట్రాఫిక్ సమస్యలు తెలిసినా పోలీసు అధికారులు ఏమీ మాట్లాడేవారు కాదు. మంత్రులు, ఎంఎల్ఏలనే ప్రగతిభవన్లోకి కేసీయార్ రానిచ్చేవారు కాదు.

By:  Tupaki Desk   |   6 Dec 2023 7:24 AM GMT
ప్రగతి భవన్ అడ్డుగోడలు తీసేస్తున్నారా ?
X

ఇంతకాలం జనాలకు అడ్డుగా రోడ్డుపై నిలిచిన గోడలను తొలగించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్ కు ముందు అంటే రోడ్డును ఆక్రమించుకుని సుమారు 13 అడుగుల ఎత్తుగోడ ఒకటుండేది. రోడ్డు డివైడర్ను ఆక్రమించేసిన కేసీయార్ ఐరన్ రాడ్లతో ముళ్ళకంచె లాంటి గోడను ఏర్పాటు చేసుకున్నారు. దీన్ని దాటి జనాలెవరు ప్రగతిభవన్లోకి వచ్చేందుకు లేదు. రోడ్డుమీద ఉన్న డివైడర్ను ఆక్రమించి కట్టిన గోడవల్ల ట్రాఫిక్ కు కూడా చాలా ఇబ్బందిగా ఉండేది.

రోడ్డుపై ట్రాఫిక్ సమస్యలు తెలిసినా పోలీసు అధికారులు ఏమీ మాట్లాడేవారు కాదు. మంత్రులు, ఎంఎల్ఏలనే ప్రగతిభవన్లోకి కేసీయార్ రానిచ్చేవారు కాదు. అలాంటిది ఇక మామూలు జనాలను ఎలాగ రానిస్తారు. అయినా సరే ఎవరూ లోపలకు రాకుండా అంతపెద్ద గోడలాంటి కంచెను ఏర్పాటు చేసుకున్నారు. ఇపుడా కంచె లాంటి గోడను అడ్డుతీసేయాలని రేవంత్ రెడ్డి డిసైడ్ చేశారట. ఎందుకంటే మొదటికారణం ట్రాపిక్ సమస్యలను తొలగించటం. రెండోది జనాలను ప్రతిరోజు కలవాలని డిసైడ్ అవ్వటమే.

ఒకపుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రతిరోజు ఉదయం ప్రజాదర్బార్ పేరుతో ఉదయం పూట జనాలను కలిసేవారు. తక్కువలో తక్కువ ప్రతిరోజు వైఎస్సార్ 4 వేలమందిని కలిసేవారు. అనేక సమస్యలతో వచ్చే జనాలను కలిసి వాళ్ళ బాధలు విని అప్పటికప్పుడే సంబంధిత అధికారులకు పంపేవారు. ఆరోగ్య శ్రీ పథకంలో సాయం అందాల్సిన బాధితులకు ప్రత్యేకించి కౌంటర్ కూడా వైఎస్సార్ ఏర్పాటు చేశారు. కేసీయార్ సీఎం అయినకొత్తలో కొద్దిరోజులు ఆరోగ్యశ్రీ పథకం కోసం జనాలను కలిసారు కానీ తర్వాత ఎవరినీ రానీయలేదు.

ఇపుడు కేసీయార్ పద్దతికి స్వస్తిచెప్పి మళ్ళీ వైఎస్సార్ పద్దతినే పునరుద్దరించాలని రేవంత్ డిసైడ్ అయ్యారు. అందుకనే ముందుగా అడ్డుగోడను తొలగించాలని అనుకున్నారు. అలాగే ప్రతిరోజు సమస్యలు చెప్పుకునేందుకు వచ్చే బాధితులను కలవాలని కూడా నిర్ణయించారు. దీనివల్ల జనాలతో కనెక్షన్ ఏర్పడుతుందన్నది రేవంత్ ఆలోచన. జనాలకు కేసీయార్ దూరమైపోయింది ఇక్కడే. అందుకనే ప్రభుత్వానికి జనాలకు అడ్డుగా ఉన్న గోడలను బద్దలు కొట్టాలని రేవంత్ డిసైడ్ అయ్యారు.