Begin typing your search above and press return to search.

219 ఆలయాలు కూలిస్తే మాట రాదేం? జస్ట్ ఆస్కింగ్ ప్రకాశ్ రాజ్

ఎవరు ఎవరినైనా అడగొచ్చు. అదేం తప్పు కాదు. కాకుంటే ఏ విషయాన్ని అయినా సూటిగా.. సుత్తి లేకుండా అడిగేస్తానన్న కలరింగ్ ఇవ్వటంతోనే చిక్కు

By:  Tupaki Desk   |   2 Oct 2024 4:34 AM GMT
219 ఆలయాలు కూలిస్తే మాట రాదేం? జస్ట్ ఆస్కింగ్ ప్రకాశ్ రాజ్
X

ఎవరు ఎవరినైనా అడగొచ్చు. అదేం తప్పు కాదు. కాకుంటే ఏ విషయాన్ని అయినా సూటిగా.. సుత్తి లేకుండా అడిగేస్తానన్న కలరింగ్ ఇవ్వటంతోనే చిక్కు. జస్ట్ అస్కింగ్ పేరుతో ఎవరు ఎవరినైనా అడిగితే తప్పు లేదు. అందునా రాజకీయ నేతల్ని ప్రశ్నించటం తప్పేం కాదు. ఎందుకంటే.. వారు ఉండేదే ప్రజలకు సేవ చేయటానికి. అయితే.. చిక్కు అంతా కూడా జస్ట్ అస్కింగ్ పేరుతో ఆన్ లైన్ లో అడిగేసే ప్రకాశ్ రాజ్.. అందరిని కాకుండా కొందరినే ఎందుకు అడుగుతారు? అది కూడా హిందువుల దేవుళ్ల గురించి.. సనాతన ధర్మం గురించి మాట్లాడితే పూనకం వచ్చినట్లుగా ఎందుకు ఊగిపోతారు? వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేస్తూ.. విషయాన్ని ఎందుకు వక్రీకరిస్తారు?

తిరుమల లడ్డూ ఇష్యూలో పవన్ మాటల్ని జస్ట్ ఆస్కింగ్ పేరుతో ప్రశ్నించిన ప్రకాశ్ రాజ్ కు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న వేళలో తీసుకున్న ఎన్నో నిర్ణయాల మీద ఎప్పుడు కూడా జస్ట్ ఆస్కింగ్ అని ప్రశ్నించలేదు? ఎందుకంటే.. ఆయన ఆస్తులు తెలంగాణలో ఉండటమేనా? కేసీఆర్ లాంటి అధినేతతో పెట్టుకుంటే పర్యవసానాలు ఎలా ఉంటాయో తెలుసు కాబట్టి.. ఆ టైంలో మాట్లాడకుండా మౌనంగా ఉంటారా?

మోడీనే జస్ట్ ఆస్కింగ్ అంటూ టీజ్ చేసే ప్రకాశ్ రాజ్ కు.. కేసీఆర్ ను లెక్క చేస్తారా ఏంది? అని లా పాయింట్ తీయొచ్చు. మోడీకి.. కేసీఆర్ కు మధ్యనున్న వ్యత్యాసం మిగిలిన వారి కంటే కూడా ప్రకాశ్ రాజ్ కే ఎక్కువ తెలుసు. అందుకే ఆయన మోడీని ఒంటికాలి మీద లేచేందుకు సాహసిస్తారు కానీ.. కేసీఆర్ మీద మాట అనేందుకు ఇష్టపడరు. అయినా.. ఇప్పుడు అధికారంలో లేని కేసీఆర్ ను ఆడిపోసుకుంటారు ఎందుకు? అని మరో ప్రశ్నను పంచ్ రూపంలో వేయొచ్చు.

నిజమే.. ఇలాంటి ప్రశ్నల్లోనూ ధర్మం ఉంటుంది. కాకుంటే.. ప్రకాశ్ రాజ్ లాంటి జస్ట్ ఆస్కింగ్ వారి పరిధి ఎంత పరిమితంగా ఉంటుందో చెప్పేందుకు ఉదాహరణ అవసరం కదా? అందుకే.. కేసీఆర్ ను ప్రస్తావించాల్సి వచ్చింది. గడిచిన ఐదేళ్లలో ఏపీలో చాలానే ఉదంతాలు చోటు చేసుకున్నాయి. ఏ రోజున ప్రకాశ్ రాజ్ కు జస్ట్ ఆస్కింగ్ అని అడగాలని అనిపించలేదు. రథాన్ని తగలబెట్టేసిన ఉదంతంలోనూ.. శ్రీరాముడి తల నరికేసిన ఉదంతంలోనూ.. 219 దేవాలయాల్ని ధ్వంసం చేసిన ఇష్యూలోనూ జస్ట్ ఆస్కింగ్ అన్నది ప్రకాశ్ రాజ్ లాంటి వారికి గుర్తుకు రాదు.

అంతేనా.. ట్రిపుల్ తలాక్ మీద కావొచ్చు.. బంగ్లాదేశీయులు అక్రమంగా దేశంలోకి చొచ్చుకు వస్తున్నా.. చూసి చూడనట్లుగా ఉండే ప్రభుత్వాలను జస్ట్ ఆస్కింగ్ అనేందుకు ప్రకాశ్ రాజ్ కు మనసొప్పదు. మాట అన్నంతనే.. చచ్చేంతవరకు గుర్తుకు పెట్టుకొని సాధించే వారి జోలికి వెళ్లేందుకు జస్ట్ ఆస్కింగ్ బ్రాండ్ అంబాసిడర్ ఇష్టపడరు. దేశ ప్రయోజనాల్ని దెబ్బ తీసే వారి గురించి అడగాలన్న సోయి ఉండదు. జస్ట్ ఆస్కింగ్ గురి మొత్తం సాఫ్ట్ టార్గెట్ ల మీదనే తప్పించి.. వేలెత్తి చూపించినంతనే వేలు లేకుండా చేసే వారి విషయంలో మాత్రం జస్ట్ ఆస్కింగ్ లాంటివి ఎందుకు ఉండవన్న విషయాన్ని జస్ట్ ఆస్కింగ్ మాత్రమే ప్రకాశ్ రాజ్.