Begin typing your search above and press return to search.

అంతా అమృతనే చేసింది.. మా నాన్నకు ఎందుకీ శిక్ష?

శ్రవణ్ కుటుంబ సభ్యులు ఈ తీర్పును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. "అమృత వల్లనే ఇదంతా జరిగిందని" వారు ఆరోపిస్తున్నారు.

By:  Tupaki Desk   |   10 March 2025 5:46 PM IST
అంతా అమృతనే చేసింది.. మా నాన్నకు ఎందుకీ శిక్ష?
X

ప్రణయ్ హత్య కేసులో నిందితులుగా ఉన్నవారికి న్యాయస్థానం శిక్షలు విధించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న అమృత బాబాయ్ శ్రవణ్ కు న్యాయస్థానం జీవితఖైదును విధించింది. శ్రవణ్ కు జీవిత ఖైదు పడడంతో ఆయన కుటుంబ సభ్యులు నల్గొండ కోర్టు వద్ద ఆందోళనకు దిగారు.

శ్రవణ్ కుటుంబ సభ్యులు ఈ తీర్పును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. "అమృత వల్లనే ఇదంతా జరిగిందని" వారు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రవణ్ కుటుంబ సభ్యులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తీర్పు వెలువడిన వెంటనే కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.

మారుతీరావు సోదరుడు శ్రవణ్ కూతురు, భార్య కోర్టు వద్ద పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ‘మా నాన్న తప్పు చేయలేదు. కనీసం ఒక్క ఫ్రూఫ్ చూపించండి.. మీరు చూపించింది తప్పు.. ఒక వైట్ పేపర్ పై సంతకాలు తీసుకున్నారు. మానాన్న తప్పు చేయలేదు. అంతా అమృతనే చేసింది’ అంటూ శ్రవణ్ కూతురు బోరున ఏడుస్తూ వాపోయింది.

ప్రణయ్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రణయ్ పై జరిగిన దాడి హత్యగా నిర్ధారించబడడంతో ఈ కేసులో సంబంధిత నిందితులపై కోర్టు కఠిన చర్యలు తీసుకుంది. ప్రధాన నిందితుడికి ఉరిశిక్ష విధించింది. మారుతీరావు సోదరుడు శ్రవణ్ కు జీవితఖైదు విధించింది. దీనిపై శ్రవణ్ కుటుంబ సభ్యులు కోర్టు తీర్పుపై నిరసన తెలియజేస్తూనే, తమ ఆవేదనను వ్యక్తం చేశారు.

కోర్టు తీర్పును అంగీకరించలేమని కుటుంబ సభ్యులు కోర్టు వద్ద వాపోయారు. తదుపరి లీగల్ ఆప్షన్ల గురించి చర్చిస్తున్నామన్నారు.. ప్రణయ్ కుటుంబం మాత్రం ఈ తీర్పుపై సంతృప్తి వ్యక్తం చేసింది. న్యాయస్థానం ఇచ్చిన శిక్షతో తమకు న్యాయం జరిగిందని వారు పేర్కొన్నారు. ఈ కేసు సమాజంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.