Begin typing your search above and press return to search.

వివాదంపై ప్రణీత్ హనుమంత్ సోదరుడు... వీడియో విడుదల!

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రణీత్ హనుమంత్ అనే పేరు తీవ్ర వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   11 July 2024 8:29 AM GMT
వివాదంపై ప్రణీత్ హనుమంత్ సోదరుడు... వీడియో విడుదల!
X

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రణీత్ హనుమంత్ అనే పేరు తీవ్ర వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. డార్క్ కామెడీ ముసుగులో చిన్నపిల్లపై అసభ్యకరమైన కామెంట్స్ చేసిన ఈ యూట్యూబర్ వివాదం తీవ్ర దుమారం రేపి అరెస్టుల వరకూ వెళ్లింది. ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు ప్రణీత్ హనుమంత్ ను బెంగళూరులో అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో అతడి సోదరుడు ‘ఏజూడ్’ స్పందించాడు.

అవును... సోషల్ మీడియాలో తండ్రీ కూతుళ్ల బంధంపైనా అసభ్యకర వీడియోలు చేసి అభాసుపాలైన ప్రముఖ యూట్యూబర్‌ ప్రణీత్‌ హనుమంతును ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం బెంగళూరులో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకొన్నారు. ఈ నేపథ్యంలో అజయ్ హనుమంతు (ఏజూడ్) స్పందించారు.

ఇందులో భాగంగా... తప్పు ఎవరు చేసినా తప్పేనని.. అది తమ్ముడైనా సరే శిక్ష పడాల్సిందేనని అన్నారు. ఈ సందర్భంగా ఒక వీడియో విడుదల చేశారు. ఇందులో... తన పెళ్లి విషయం సంతోషకరమైన సమయంలో చెప్పాలను అనుకున్నా కానీ.. ఇలాంటి సమయంలో చెప్పాల్సి వస్తుందని తాను ఊహించలేదని.. కానీ తప్పడం లేదని.. తనకు పెళ్లై ఆరేల్లు పూర్తయ్యిందని అన్నాడు.

ఇంజినీరింగ్ పూర్తయిన వెంటనే ప్రేమ వివాహం చేసుకుని, ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు వచ్చేసినట్లు తెలిపాడు. అయితే... అప్పటి పరిస్థితులు వేరని, లైఫ్‌ లో తాను చాలాసార్లు ఫెయిలయినట్లు.. జీవనోపాధి లేక కష్టాలు పడినట్లు చెప్పుకొచ్చారు. ఇదే క్రమంలో ఓ ఐఏఎస్‌ ఆఫీసర్‌ కుమారుడినైనప్పటికీ రోడ్‌ మీద నుంచే జీవితాన్ని ప్రారంభించినట్లు వెల్లడించారు.

ఇదే సమయంలో... అడల్డ్ కామెడీని పర్సనల్‌ గా తాను ప్రోత్సహించనని.. అలాంటివి చూడను కూడా చూడనని.. అది ఎవరు చేసిన తప్పే అని.. ఈ విషయంలో మీరు ఎంత దూరంగా ఉన్నారో.. తాను కూడా అంతే అని అజయ్ హనుమంతు తెలిపారు. ప్రస్తుతం అతని వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.