Begin typing your search above and press return to search.

నటి బ్యాక్ టచ్ చేసిన ఆరోపణ... ప్రసాద్ బెహరా అరెస్ట్, రిమాండ్!

వివరాల్లోకి వెళ్తే... ప్రసాద్ బెహరా నటించిన ఓ వెబ్ సిరీస్ లో తనను అసభ్యంగా తాకాడని చెబుతూ పోలీసులకు ఓ నటి ఫిర్యాదు చేసింది.

By:  Tupaki Desk   |   18 Dec 2024 1:48 PM GMT
నటి బ్యాక్  టచ్  చేసిన ఆరోపణ... ప్రసాద్  బెహరా అరెస్ట్, రిమాండ్!
X

ఇటీవల కాలంలో యూట్యూబ్ లో బాగా ఫేమస్ అయిన నటుడు, రచయిత ప్రసాద్ బెహరాను పోలీసులు అరెస్ట్ చేశారు! 'మా విడాకులు', 'పెళ్లివారమండి' లాంటి వెబ్ సిరీస్ లతో గుర్తింపు తెచ్చుకున్న ప్రసాద్ బెహరా 'కమిటీ కుర్రాళ్లు' లాంటి సినిమాతో వెండితెర మీద కూడా రాణించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సమయంలో అనూహ్య పరిణామం తెరపైకి వచ్చింది.

అవును... యూట్యూబ్ లో కామెడీ, సెంటిమెంట్, ఎమోషన్ల్ డ్రామాతో నడిచిన వెబ్ సిరీస్ లతో ఫేమస్ అయిన ప్రసాద్ బెహరా అరెస్టయ్యారని తెలుస్తోంది. అతడిని పోలీసులు కోర్టులో హాజరుపరచడంతో 14 రోజుల రిమాండ్ కూడా విధిచారని అంటున్నారు. ఈ వార్త ఒక్కసారిగా షాకింగ్ గా మారింది!

వివరాల్లోకి వెళ్తే... ప్రసాద్ బెహరా నటించిన ఓ వెబ్ సిరీస్ లో తనను అసభ్యంగా తాకాడని చెబుతూ పోలీసులకు ఓ నటి ఫిర్యాదు చేసింది. ఈ ఘటన పెళ్లివారమండి వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలో జరిగిందని అంటున్నారు. ఆ సమయంలో... తనను అసభ్యంగా తాకాడని.. ఆమె వెబ్ సిరీస్ చేయనని చెప్పి వెళ్లిపోయినట్లు ఫిర్యాదులో పేర్కొందని అంటున్నారు!

తర్వాత సారీ చెప్పడంతో కాస్త గ్యాప్ తీసుకుని తాజా వెబ్ సిరీస్ "మెకానిక్" లోనూ తిరిగి ప్రసాద్ తో కలిసి నటించడం మొదలుపెట్టినట్లు చెబుతున్నారు. అయితే... అతని ప్రవర్తన మళ్లీ మొదటికి వచ్చిందని.. లొకేషన్ లో అందరి ముందూ ఆమె పై పడే ప్రాయత్నం చేస్తున్నాడని ఆమె పేర్కొన్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో ఈ నెల 11న మధ్యాహ్నం సమయంలో అందరి ముందూ తన వెనుక అసభ్యకరంగా తాకాడని పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రశ్నిస్తే... సరైన సమాధానం చెప్పలేదని.. సెట్లో అంతా అది చూసి జోక్ అనుకుని నవ్వేశారని ఆమె చెప్పుకొచ్చిందని అంటున్నారు. దీంతో... విసిగిపోయిన ఆమె జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని అంటున్నారు!

దీనికి సంబంధించిన ఫిర్యాదు 14వ తేదీన అందడంతో.. అదే రోజు ప్రసాద్ బెహరాను అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టగా.. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించిందని తెలుస్తోంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషయం సంచలనంగా మారిందని అంటున్నారు!