Begin typing your search above and press return to search.

ప్రశాంత్ కిశోర్ కి ఎమ్మెల్యేగా గెలిచే సత్తా ఉందా. ?

శకునాలు చెప్పే బల్లి కుడితెలో పడిందని ఒక ముతక సామెత.

By:  Tupaki Desk   |   28 Feb 2025 10:59 AM GMT
ప్రశాంత్ కిశోర్ కి ఎమ్మెల్యేగా గెలిచే సత్తా ఉందా. ?
X

శకునాలు చెప్పే బల్లి కుడితెలో పడిందని ఒక ముతక సామెత. ఎన్నికల వ్యూహకర్త రాజకీయ పార్టీ అధినేతగా కొత్త అవతారం ఎత్తిన ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే పరిస్థితి కూడా అలాగే ఉందా అన్న దాని మీద పొలిటికల్ గా సెటైర్లు పడుతున్నాయి.

పీకే జన సూరజ్ అని ఒక పార్టీ పెట్టారు. ఆ పార్టీ బీహార్ లో ఏమీ పెద్దగా రాజకీయ ప్రదర్శన చేసింది లేదు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనాలు సృష్టిస్తామని చెబుతోంది. అంతే కాదు బీహార్ సీఎం నితీష్ కుమార్ ని మాజీ సీఎం అవుతారని పీకే జోస్యం చెబుతున్నారు.

నిజానికి చూస్తే బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ చాలా కాలంగా పాలిస్తున్నారు. ఆయన 2005 నుంచి మధ్యలో కొద్ది నెలలు తప్పించి మొత్తంగా బీహార్ కి సీఎంగా పాలిస్తున్నారు. ఇంతలా సుదీర్ఘంగా బీహార్ ని పాలించిన నేత మరొకరు లేరు.

ఏడున్నర పదుల వయసుకు చేరువ అవుతున్న నితీష్ ఈసారి కూడా గెలిస్తే మళ్ళీ సీఎం అవుతారని ఆయన పార్టీ జేడీయూ నేతలు చెబుతూంటారు. అయితే నితీష్ 1977 ఎమర్జెన్సీ నుంచి విద్యార్ధి రాజకీయాల్లో మొదలెట్టి ఈ ఈ రోజు దాకా కొనసాగుతున్నారు.

దాంతో ఆయన రాజకీయంగా విశ్రాంతి తీసుకుని కుమారుడిని వారసుడిగా ముందుకు తెస్తారు అన్న టాక్ ఒక వైపు ఉంది. మరో వైపు ఆయన కేంద్రంలోకి వెళ్తారని కూడా ఉంది. అవేవీ లేదు ఆయనే మళ్ళీ సీఎం అని జేడీయూ నేతలు బల్ల గుద్దుతున్నారు. ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ వయోభారంతో ఉన్నారని ఆయన సీఎం సీటు ఎక్కేందుకు ఫిట్ గా లేరని ఒక బాంబు పేల్చారు జన సూరజ్ పార్టీ అధినేత ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే.

ఆయన తాజాగా నితీష్ కుమార్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నితీష్ కుమార్ శారీరకంగానే కాదు మానసికంగా పూర్తిగా అలసిపోయారు అని అని అంటున్నారు. పైగా ఆయన రిటైర్ అయిపోయారు అని కూడా పీకే స్టేట్మెంట్ ఇచ్చేశారు.

నితీష్ రాజకీయ పలుకుబడి మీద బలం మీద కూడా పీకే సెటైర్లు వేశారు. నితీష్ పార్టీకి ఎపుడూ బీహార్ గద్దెని ఏలేందుకు పూర్తి మెజారిటీ రాలేఅని అయిత్గే ఆయన పొత్తులతోనే సీఎం గా అలా కంటిన్యూ అయ్యారని నిందించారు.

ఇలా రెండు దశాబ్దాలుగా బీహార్ ని ఎదురులేకుండా పాలించిన నితీష్ కుమార్ రాజకీయ జీవితం ఈ ఏడాది అక్టోబర్ లో జరిగే ఎన్నికలతో ముగియబోతోంది అని పీకే జోస్యం చెప్పేశారు. ఆయన మాజీ సీఎం కాబోతున్నారు అని కూడా సంచలన ప్రకటన చేశారు.

బీహార్ ఎన్నికల్లో జేడీయో ఓటమి ఖాయమని పీకే బల్ల గుద్దుతున్నారు. అంతే కాదు పీకే సొంత పార్టీ జనసూరజ్ వచ్చే ఎన్నికల్లో సంచలనం సృష్టిస్తుందని కూడా ఆయన చెప్పుకుంటున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ లో జనసూరజ్ పార్టీ భారీ ఎత్తున ర్యాలీ చేపడుతుందని ఆయన చెప్పారు.

ఒకనాడు నితీష్ కి ప్రియ మిత్రుడిగా ఎన్నికల సలహాలు ఇచ్చిన వ్యూహకర్తగా ఆంతరంగికుడిగా మెలిగిన పీకే ఇపుడు నితీష్ కుమార్ ని మాజీ సీఎం కాబోతున్నారని చెబుతున్నారు. అంతే కాదు నితీష్ కుమార్ ఇప్పటికే రిటైర్ అయిపోయారని అంటున్నారు. మరి ఇది నిజమా గ్రౌండ్ లెవెల్ రియాలిటీ అలాగే ఉందా లేక పీకే సొంతంగా చేసిన సర్వేలో తేలిందా లేక పీకే ప్రత్యర్ధి పార్టీ కాబట్టి ఇలా నిప్పులు చెరుగుతున్నారా అంటే ఆలోచించాల్సిందే అని అంటున్నారు.

ఇవన్నీ అలా ఉంచితే పీకేకి ఎమ్మెల్యేగా తానుగా గెలిచి అసెంబ్లీకి వెళ్ళే సత్తా ఉందా అన్న చర్చ సాగుతోంది. పీకే రాజకీయ సర్వేలు జోస్యాలు ఆయనకు ఏ మాత్రం సరిపడవని ఆయనను అందలం ఎక్కించలేవని అంటున్నారు. అంతే కాదు పీకే పొలిటికల్ లీడర్ మెటీరియల్ కాదని కూడా ప్రత్యర్ధులు అంటూంటారు. ఆయన గెలిచే పార్టీల తరఫున వకాల్తా పుచ్చుకుని వారిని గెలిపించిన క్రెడిట్ ని తన ఖాతాలో వేసుకుంటూంటారు అన్న విమర్శలు ఉన్నాయి.

పీకే బిగ్ పొలిటికల్ లీడర్ ఇమేజ్ ని తానుగా క్రియేట్ చేసుకున్నారు తప్ప నిజానికి ఆయనకు అంత సీన్ ఉందా అన్నది పెద్ద ప్రశ్న. బీహార్ లో ఆయన పార్టీ ఈసారి ఎన్ని చోట్ల డిపాజిట్లు సాధిస్తుంది అన్నది కూడా మరో ప్రశ్న. ఇంతకీ పీకే ఒకే ఒక్కడుగా అయినా నెగ్గి అసెంబ్లీకి వస్తే ఆయన పార్టీ అక్కడికి సంచలనాలు సృష్టించినట్లే అని అంటున్నారు. నితీష్ కుమార్ వంటి వరిష్ట నేత మీద విమర్శలు చేసే ముందు పీకే తన రాజకీయ స్థాయి చూసుకోవాలి కదా అని జేడీయూ నేతలతో పాటు అంతా అంటున్నారు అంటే పీకే పొలిటికల్ గా చాలా నేర్చాల్సి ఉంది మరి.