ప్రశాంత్ కిశోర్ బాగా పుంజుకున్నారా....ఎమ్మెల్యేగా గెలవలేరా ?
ఇక లేటెస్ట్ గా చూస్తే కనుక ఒక సర్వే బీహార్ లో రాజకీయ పరిస్థితిని అద్దం పట్టేలా ఉంది. ఈ సర్వేలో విశేషం ఏంటి అంటే కొత్త పార్టీగా ఉన్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పార్టీ పుంజుకుంటోబంది అని తెలుస్తోంది.
By: Tupaki Desk | 15 March 2025 7:56 PM ISTబీహార్ రాజకీయానికి రంగం సిద్ధం అవుతోంది. ఈ ఏడాది అక్టోబర్ నవంబర్ నెలలలో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి ఎన్నికలు రాజకీయంగా అతి పెద్ద సమరానికి వేదిక కానున్నాయి. బీహార్ లో అయిదేళ్ల పాటు అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమి మళ్ళీ గెలవాలని చూస్తోంది.
అయితే యాంటీ ఇంకెంబెన్సీ కూటమిని ఇబ్బంది పెడుతోంది. ఇక విపక్షంలో ఉన్న ఆర్జేడీ ఈ అవకాశాన్ని సొంతం చేసుకోవాలని చూస్తోంది. ఇండియా కూటమిగా రంగంలోకి దిగబోతున్న ఆర్జేడీ నాయకత్వంలోని కూటమి ఈసారి గెలుపు తమదే అంటోంది. ఈ రెండు పార్టీల మధ్య కొత్త పార్టీగా రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిశోర్ పార్టీ కూడా రేసులో ఉంది. జన సురాజ్ పేరుతో ఆయన రెండేళ్ళ ముందే పార్టీ పెట్టి రాజకీయ అరంగేట్రం చేశారు. తొలిసారి ఆయన ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
ఇక లేటెస్ట్ గా చూస్తే కనుక ఒక సర్వే బీహార్ లో రాజకీయ పరిస్థితిని అద్దం పట్టేలా ఉంది. ఈ సర్వేలో విశేషం ఏంటి అంటే కొత్త పార్టీగా ఉన్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పార్టీ పుంజుకుంటోబంది అని తెలుస్తోంది. ప్రశాంత్ కిశోర్ పార్టీకి ఏకంగా ఆరేడు శాతం ఓట్ షేర్ దక్కుతుందని ఈ సర్వే తేల్చింది. అయితే సీట్లు మాత్రం ఏవీ రావని ఈ సర్వే చెప్పడం విశేషం.
ఇక ప్రశాంత్ కిశోర్ పార్టీ పోటీ వల్ల ఎవరికి నష్టం అంటే ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఓట్లనే ఆయన లాగుతున్నారని అంటున్నారు. అదే సమయంలో బీజేపీకి పడాల్సిన కొన్ని అగ్ర కుల ఓట్లను కూడా ప్రశాంత్ కిశోర్ లాగుతున్నారని అంటున్నారు.
ఈ సర్వే ప్రకారం చూస్తే విపఖ ఆర్జేడీ నాయాకత్వంలోని ఇండియా కూటమికి చాన్స్ ఉందని అంటున్నారు. అయితే పొత్తు పేరుతో కాంగ్రెస్ కి ఎక్కువ సీట్లు ఇవ్వకుండా ఆర్జేడీ తాను అధిక సీట్లు తీసుకుని పోటీకి దిగితే మాత్రం ఆర్జేడీ కూటమి అధికారంలోకి రావడం పక్కా అని అంటున్నారు.
అదే సమయంలో కాంగ్రెస్ కి ఎక్కువ సీట్లు ఇస్తే కనుక ఆ సీట్లలో కాంగ్రెస్ ఓటమి పాలు అవుతుందని దాని వల్ల ఎన్డీయే కూటమికే లాభం అని అంటున్నారు. ఇక పీకే అలియాస్ ప్రశాంత్ కిశోర్ విషయం తీసుకుంటే ఆయన ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన చోట చాలా పార్టీలను గెలిపించారు. ఎందరో సీఎంలు అయ్యారు. అలా అందరికీ గెలిపించిన పీకే తాను మాత్రం ఎమ్మెల్యేగా కూడా గెలవరా అంటే ఈ సర్వే ఫలితాలు చూస్తే అలాగే ఉన్నాయని అంటున్నారు.
పీకే టీం అంటేనే గెలుపు గుర్రం అని చెబుతారు. అనేక రాష్ట్రాలలో పీకే టీం గ్రాస్ రూట్ లెవెల్ నుంచి పనిచేసి అనేక పార్టీలను గెలుపించింది. కానీ అదే పీకే టీం సొంత రాష్ట్రం బీహార్ లో మాత్రం గెలుపునకు దూరంగా ఉండిపోతోంది అని అంటున్నారు. దీని వెనక మతలబు ఏమిటో తెలియదు కానీ పీకే అంటే ఓన్లీ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అనే అంటున్నారు. ఆయన పాలిటిక్స్ లో మాత్రం లీడర్ గా ఎస్టాబ్లిష్ అవుతారా అంటే ఈ సర్వేని బట్టి చూస్తే డౌటే అంటున్నారు.
పీకే ఓట్లు మాత్రమే సాధిస్తున్నారు కానీ సీట్లు ఒకటి రావని ఆయన కూడా ఓటమి పాలు అవుతారని ఈ సర్వే నిఖార్సుగా తేల్చిన విషయంగా ఉంది. బీహార్ పీకే సొంత స్టేట్. కానీ అక్కడ పీకేకి మాత్రం ఉనికి పొలిటికల్ గా లేనే లేదని అంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలీ అంటే పొలిటికల్ గా పీకేకు సీన్ లేదని అంటున్నారు.
అవును మరి ఏవరు ఏ పని చేయాలో ఆ పని చేయాలని అంటున్నారు. పీకే తెర వెనక వ్యూహాలను రచించగలరు కానీ తానే తెర మీదకు వస్తే ఓట్లు రాలుతాయా అని అంటున్నారు. రాజకీయంగా రాణించాలీ అంటే దానికి తగిన లెక్కలు చాలా ఉంటాయి. పీకేకు ఈ విషయాలు అన్నీ తెలుసు. కానీ ఆయన మాత్రం తాను రాజకీయంగా అధికం అని భావనతో బీహార్ బరిలో దిగుతున్నారు. ఫలితాల తరువాత అయినా పీకేకు వాస్తవాలు ఏంటో బోధపడతాయని అంటున్నారు.