జగన్ గుట్టు తెలిసిన పీకే లోకేష్ కి చెప్పిందేంటి ?
జగన్ ఆయనను ఆప్యాయంగా పలకరించడమే కాకుండా మన కుటుంబ సభ్యుడు అని బాగా క్యాడర్ కి లీడర్ కి ప్రాజెక్ట్ చేశారు.
By: Tupaki Desk | 5 Feb 2025 9:09 AM GMTప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకేని ఏపీ రాజకీయాలకు పరిచయం చేసిన ఘనత వైసీపీ అధినేత జగన్ కే దక్కుతుంది. 2017లో జరిగిన ఆ పార్టీ ప్లీనరీ వేదిక మీద పీకే ప్రత్యక్షం అయ్యారు. జగన్ ఆయనను ఆప్యాయంగా పలకరించడమే కాకుండా మన కుటుంబ సభ్యుడు అని బాగా క్యాడర్ కి లీడర్ కి ప్రాజెక్ట్ చేశారు.
ఆ తరువాత పీకే దూకుడు మామూలుగా లేదు. వైసీపీలో ఆయనే సర్వాధికారి అయ్యారు. జగన్ 2017 నవంబర్ 6 నుంచి ప్రారంభించిన పాదయాత్రకు కర్త కర్మ క్రియ పీకే అన్నది తెలిసిందే. జగన్ ఏమి మాట్లాడాలి, ఏ రకమైన హామీ ఇవ్వాలి జనాలకు ఎలా ఎట్రాక్ట్ చేయాలి అధికార పార్టీ మీద ఏ రకమైన విమర్శలు చేస్తే జనాలకు ఎక్కుతాయి ఇవన్నీ పీకే పొలిటికల్ స్ట్రాటజిస్టుగా వైసీపీకి చెప్పి చేయించారు. ఎన్నో రకాలైన కార్యక్రమాలను ఆ విధంగా డిజైన్ చేయించారు.
మొత్తానికి చూస్తే పీకే వైసీపీని 151 సీట్లతో అధికారం దక్కేలా చూశారు. ఉచిత హామీలు ఏపీకి పెను భారమని తెలిసినా పీకే సలహాలతో వైసీపీ ఇచ్చింది. ఆ మీదట వాటిని తప్పనిసరిగా అమలు చేయాలని భావించి అప్పులు చేస్తూ పోయింది సంక్షేమం గట్టెక్కి స్తుందని నని అభివృద్ధిని మరచింది. మొత్తానికి చూస్తే 2024 ఎన్నికల్లో రిజల్ట్ తేడా కొట్టింది.
ఇవన్నీ పక్కన పెడితే పార్టీ అధికారంలోకి వచ్చాక పీకేకి వైసీపీ అధినాయకత్వానికి చెడిందని చెబుతారు. ఆ తరువాత పీకే సేవలు అందించలేదు. ఆయన శిష్యుడు అయిన రిషి ఐప్యాక్ టీం ద్వారా సేవలు అందించారు కానీ వైసీపీకి ఆయన బృందం ఇచ్చిన సలహాలు నిలువునా ముంచేశాయి.
ఇదిలా ఉంటే జగన్ గురించి పీకేకి ఆ కొన్ని ఏళ్ళ సాన్నిహిత్యం వల్ల చాలానే తెలుసు అని అంటున్నారు జగన్ స్వభావం ఆయన దూకుడు ఆయనకు అవకాశం అంటూ దక్కితే ఎలా దూసుకుని పోతారో ఇవన్నీ దగ్గరుండి చూసిన వారు పీకే. అందుకే ఆయన ఢిల్లీలో లోకేష్ తో భేటీ అయినపుడు జగన్ తో జర జాగ్రత్త అని ఒక రకమైన హెచ్చరికతో కూడిన సూచననే చేశారు అని ప్రచారం సాగుతోంది.
ఏ మాత్రం చాన్స్ కూటమి ప్రభుత్వం ఇచ్చినా జగన్ మళ్ళీ పుంజుకుంటారని పీకే చెప్పినట్లుగా ప్రచారం అవుతోంది. జగన్ ని తక్కువ అంచనా వేయవద్దు అని ఆయన చెప్పారని అంటున్నారు. గత ఎనిమిది నెలల కూటమి పాలన మీద పీకే స్వయంగా తయారు చేసిన ఒక నివేదికను కూడా లోకేష్ కి ఇచ్చారని అంటున్నారు.
ఇక ముందు ఉన్న నాలుగేళ్ళ నాలుగు నెలల పాలనా కాలంలో ఏమి చేయాలన్నది కూడా ఆయన సలహాలు సూచనల రూపంలో వివరించారని అంటున్నారు. ఏపీలో టీడీపీ కూటమికి రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న వైసీపీ బలాలు బలహీనతలు కూడా పీకే చెప్పినట్లుగా భోగట్టా.
ఏ మాత్రం చాన్స్ దొరికినా జగన్ రాజకీయంగా బలం పెంచుకుంటారు అన్నది పీకే మార్క్ విశ్లేషణగా చెబుతున్నారు. ఆయన ఎనిమిది నెలల కూటమి పాలనలో కొన్ని లోపాలను కూడా ప్రస్తావించారు అని అంటున్నారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం పట్ల జనంలో కొంత వ్యతిరేకత అయితే ఇప్పటికే మొదలైందని దానిని గుర్తించి ఇప్పట్లోనే సర్దుకోవాలని లేకపోతే ఇబ్బంది అని పీకే చెప్పినట్లుగా తెలుస్తోంది.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం ద్వారానే కూటమి గట్టిగా నిలబడగలదు అన్నది తన వ్యక్తిగత అభిప్రాయంగా పీకే పంచుకున్నట్లుగా చెబుతున్నారు. అంతే కాదు కొన్ని రకాల వ్యూహాలతో వైసీపీని రాజకీయంగా పూర్తిగా కట్టడి చేయవచ్చు అని పీకే తన నివేదికలో ఆ వ్యూహాలను కూడా వివరించారని అంటున్నారు. మొత్తానికి చూస్తే పీకే కూటమికి బహు చక్కని సలహాలను సూచనలకు అందిస్తూ చేయాల్సిన చోట అప్రమత్తం చేశారని అంటున్నారు. జగన్ ని మాత్రం లైట్ తీసుకోవద్దు అన్నదే పీకే నివేదికలో అండర్ లైన్ గా పెట్టుకోవాలని అంటున్నారు.