జూన్ 4న నీళ్ల బాటిల్ దగ్గర పెట్టుకోండి: ప్రశాంత్ కిషోర్
గతంలో ప్రశాంత్ కిషోర్ వేసిన అంచనాలు విఫలమయ్యాయని.. వాటిని ఎలా చూడాలని కిరణ్ థాపర్ ప్రశ్నించారు.
By: Tupaki Desk | 24 May 2024 4:03 AM GMTతన రాజకీయ అంచనాలను వ్యతిరేకించేవారు.. తన రాజకీయ అంచనాలపై సెటైర్లు వేసే వారు.. జూన్ 4న నీళ్ల బాటిళ్లను దగ్గర పెట్టుకోవాలని ప్రముఖ వ్యూహకర్త.. ప్రశాంత్ కిషోర్ ఘాటుగా వ్యాఖ్యానించారు. తాజాగా ఆయన ప్రముఖ జర్నలిస్టు కిరణ్ థాపర్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఒకింత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు. గతంలో ప్రశాంత్ కిషోర్ వేసిన అంచనాలు విఫలమయ్యాయని.. వాటిని ఎలా చూడాలని కిరణ్ థాపర్ ప్రశ్నించారు.
అయితే.. దీనికి ఆధారాలు చూపాలంటూ.. ప్రశాంత్ కిషోర్ ఎదురు దాడిచేశారు. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందన్న వ్యాఖ్యలకు సంబంధించి రికార్డులు చూపించాలని అన్నారు. దీనిపై పెద్ద దుమారమే రేగింది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకున్న ఈ వీడియోను చూసిన ఓ నెటిజన్.. ``ప్రశాంత్ కిషోర్‌కు తిక్క కుదిరింది. కిరణ్ థాపర్.. మంచినీళ్లు తాగించాడు`` అని ఒకరిద్దరు నెటిజన్లు.. కామెంట్లు చేశారు. వీటిపై ప్రశాంత్‌కిషోర్ మరింత ఫైరయ్యారు.
``నా ఎన్నికల అంచనాల నేపథ్యంలో, ఫలితాలు ఎలా వస్తాయోనని గిజగిజలాడుతున్న వారు జూన్ 4న తాగేందుకు మంచినీళ్ళ బాటిళ్లు సమృద్ధిగా అందుబాటులో ఉంచుకోవాలి`` అని వ్యంగ్యాస్త్రాలు సంధిం చారు. అంతేకాదు.. 2021 మే 2న పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఏం జరిగిందో ఓసారి గుర్తు చేసుకోవాలని కూ డా పీకే సూచించడం గమనార్హం. అయితే.. గత ఏడాది తెలంగాణలో జరిగిన ఎన్నికల్లోనూ మరోసారి ముచ్చటగా బీఆర్ ఎస్ ప్రభుత్వం వస్తుందని పీకే చెప్పారు. కానీ, ఈ ప్రిడిక్షన్ విఫలమైన విషయం తెలిసిందే.