ఏపీ గురుంచి ప్రశాంత్ కిషోర్ మాటలు కాంట్రోవర్సియల్!
ఈ సందర్భంగా దేశంలో సంపద సృష్టి, అవకాశాలు, నిరుద్యోగం, పేదరికం, ఉచిత పథకాలు, నగదు పంపిణీ వంటి కీలక అంశాలను ప్రస్తావించారు
By: Tupaki Desk | 30 Oct 2023 3:52 AM GMTఏ ప్రభుత్వమైనా సంపద సృష్టించాలని.. సమాజంలో ఉపాధి కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని.. అప్పుడే సంపద సృష్టి జరుగుతుందని ప్రముఖ విశ్లేషకులు, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అన్నారు. 2019 ఎన్నికల సమయంలో జగన్ నేతృత్వంలోని వైసీపీకి ఆయన రాజకీయ వ్యూహకర్తగా పనిచేసిన విషయం తెలిసిందే. అయితే.. తర్వాత ఆ పార్టీ నుంచి దూరంగా ఉన్నారు. తాజాగా ఆయన 'బ్రాండ్ అవతార్' సంస్థ నిర్వహించిన సదస్సులో పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా దేశంలో సంపద సృష్టి, అవకాశాలు, నిరుద్యోగం, పేదరికం, ఉచిత పథకాలు, నగదు పంపిణీ వంటి కీలక అంశాలను ప్రస్తావించారు. సమాజంలో అభివృద్ది కనిపించాలంటే.. ఖచ్చితంగా సంపద సృష్టి ఉండాలని ప్రశాంత్ కిశోర్ చెప్పారు. సంపద సృష్టి లేని ప్రభుత్వాలతో రాష్ట్రాలు వెనుకబడి పోతాయని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన సీఎం జగన్ నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్‌ను ఉదహరించారు.
''ఉదాహరణకు ఏపీని తీసుకుంటే.. అక్కడ సంపద సృష్టి నామమాత్రం(లిటిల్ బిట్ సోఫార్). ఉచితా పంపిణీ, నగదు పంపిణీతో రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది. ఇలా ఉన్న సమాజం ఎప్పటికీ అభివృద్ది చెందే పరిస్థితి లేదు. ఆ రాష్ట్రం వెనుకబడి పోతుంది.అదేవిధంగా పేదరిక నిర్మూలన, నిరుద్యోగంపై పోరు నిరంతరాయంగా సాగాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందుతుంది'' అని ప్రశాంత్ కిశోర్ చెప్పారు. అయితే, ప్రశాంత్ కిశోర్ తన వ్యాఖ్యల్లో ఏపీని, అక్కడి ప్రభుత్వాన్ని ఉదాహరణగా తీసుకోవడం ఆసక్తిగా మారింది.