Begin typing your search above and press return to search.

రోహిత్ కోసం లైఫ్ ను బెట్ గా వేస్తా.. వైరల్ గా ప్రీతీ నోటి మాట!

అందం చాలా మందికి ఉంటుంది. కానీ.. కొందరు అందగత్తెలకు మాత్రమే మెదడులో గుజ్జు ఉంటుంది

By:  Tupaki Desk   |   15 April 2024 4:05 AM GMT
రోహిత్ కోసం లైఫ్ ను బెట్ గా వేస్తా.. వైరల్ గా ప్రీతీ నోటి మాట!
X

అందం చాలా మందికి ఉంటుంది. కానీ.. కొందరు అందగత్తెలకు మాత్రమే మెదడులో గుజ్జు ఉంటుంది. సినీ నటి.. ఐపీఎల్ ఫ్రాంఛైజీ ఓనర్ గా సుపరిచితురాలైన ప్రీతీ జింటా మాత్రం బ్యూటీ విత్ బ్రెయిన్ గా అభివర్ణిస్తారు. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్య వైరల్ గా మారటమే కాదు.. ఆమె మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. పంజాబ్ కింగ్స్ అధినేత్రిగా సుపరిచితురాలైన ప్రీతీ.. తాజాగా ముంబయి ఇండియన్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మపై ఆసక్తికర వ్యాఖ్య చేశారు.

హిట్ మ్యాన్ కోసం తన లైఫ్ ను బెట్ గా వేస్తానని.. మెగా వేలంలో ఆయన్ను దక్కించుకోవటానికి ఎంతైనా ఖర్చు చేయటానికి వెనుకాడనని స్పష్టం చేశారు. తాజా మాటతో అందరి చూపు తన మీద పడేలా చేసుకున్న ప్రీతీ నోటి నుంచి ఈ వ్యాఖ్యలు రాజస్థాన్ రాయల్స్ చేతిలో తన జట్టు ఓడిన క్రమంలో చేయటం గమనార్హం. రోహిత్ శర్మ 2025 మెగా వేలంలోకి అందుబాటులోకి వస్తే.. అతడ్ని దక్కించుకోవటానికి తన లైఫ్ ను బెట్ గా వేస్తానని వెల్లడించారు. జట్టులో నిలకడతో పాటు ఛాంపియన్ మైండ్ సెట్ ఉన్న కెప్టెన్ ను తాము చాలా మిస్ అవుతున్నట్లుగా ఆమె పేర్కొన్నారు.

మరోవైపు రోహిత్ శర్మ విషయానికి వస్తే.. 2013లోముంబయి ఇండియన్స్ కెప్టెన్ గా నియమితులైన ఇతను.. అదే ఏడాది ముంబయి ఇండియన్స్ కు తొలి టైటిల్ ను అందించటం తెలిసిందే. ఆ తర్వాత 2015, 2017, 2019, 2020 సీజన్లలో ముంబయి జట్టును ఛాంపియన్ గా నిలిపిన రోహిత్.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా నిలిచారు. ఐపీఎల్ లో అత్యధిక విజయాలు అందించిన జట్టు కెప్టెన్ గా తొలి స్థానంలో ధోనీ నిలిస్తే.. తర్వాతి స్థానంలో రోహిత్ నిలుస్తారు. మొత్తం 158 మ్యాచ్ లకు 87 మ్యాచ్ లలో నెగ్గాడు.

ఈ ఏడాది సీజన్ లో ముంబయి ఫ్రాంఛైజీ కెప్టెన్ గా రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యాను నియమించటంపై రోహిత్ అభిమానులు భగ్గుమనటంతెలిసిందే. దీంతో సోషల్ మీడియాలో ముంబయి ఇండియన్స్ జట్టుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇలాంటివేళ.. వచ్చే ఏడాది జరిగే మెగా వేలంలో రోహిత్ బయటకు వచ్చేస్తే.. ఆయన్ను దక్కించుకోవటానికి పలు ఫ్రాంఛైజీలు సిద్ధమవుతున్నాయి. ఇలాంటి వేళ.. మిగిలిన వారికి మించిన ఒక అడుగు ముందుకు వేసిన ప్రీతీ జింటా తన నోటి మాటతో సంచలనంగా మారారు.

స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడిన సందర్భంగా రోహిత్ ను దక్కించుకోవటానికి తన లైఫ్ ను బెట్ గా వేస్తానని పేర్కొనటం ద్వారా తన ఫ్యూచర్ ప్లాన్ ను చెప్పకనే చెప్పేసిందని చెప్పాలి. ప్రస్తుత ఐపీఎల్ లో ఇప్పటివరకు మొత్తం ఐదు మ్యాచ్ లు ఆడిన రోహిత్ శర్మ 167.74 స్ట్రైక్ రేట్ తో 156 పరుగులు చేశారు. ఇందులో 17 ఫోర్లు.. పది సిక్సులు ఉన్నాయి. అంటే.. మొత్తంగా చేసిన 156 పరుగుల్లో సిక్సులు.. ఫోర్లతోనే 128 పరుగులు సాధించటం గమనార్హం.