Begin typing your search above and press return to search.

డెస్టినేషన్ వెడ్డింగ్ డ్రీం ల్యాండ్ ఈ నగరం..

పెళ్లికి ముందుగానే వధూవరులకు ప్రీ వెడ్డింగ్ షూట్ చేయించడం ఒక ట్రెండ్ గా కొనసాగుతోంది.

By:  Tupaki Desk   |   24 Jun 2024 9:30 AM GMT
డెస్టినేషన్ వెడ్డింగ్ డ్రీం ల్యాండ్ ఈ నగరం..
X

పెళ్లి అనేది ప్రతి ఒక్కరికి ఓ మధుర స్మృతి. చిరకాలం గుర్తుండి పోవాలి అనుకుని ఓ జ్ఞాపకం లాంటి పెళ్లిని మన సంప్రదాయం, సంస్కృతి సమ్మేళనంగా జరుపుకుంటాం. అయితే గత కొద్ది కాలంగా డెస్టినేషన్ వెడ్డింగ్స్ పరంపర ఎక్కువగా కనిపిస్తోంది. మన సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ఎంతో ఘనంగా పెళ్లిళ్లు జరిపించడం.. ప్రీ వెడ్డింగ్స్, డెస్టినేషన్ వెడ్డింగ్ అంటూ సందడి చేయడం ఇప్పటి పెళ్లిళ్ల స్పెషాలిటీ.

పెళ్లికి ముందుగానే వధూవరులకు ప్రీ వెడ్డింగ్ షూట్ చేయించడం ఒక ట్రెండ్ గా కొనసాగుతోంది. మొదట్లో కేవలం సెలబ్రిటీలు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఇటువంటి ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకునేవారు. ఇందుకోసం వారు వివిధ దేశాలలోని అందమైన ప్రదేశాలకు వెళ్లి మరి ఫోటోషూట్ తీసుకునేవారు. ఈ కల్చర్ క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరించింది. ఎవరి తాహతకు తగినట్లుగా వారు ఈ ప్రీ వెడ్డింగ్ షూట్స్, డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసుకుంటున్నారు.

ఈ ట్రెండ్ బాగా పెరిగిపోవడంతో అందరూ తమకు తగినట్టుగా.. బడ్జెట్లో ఫ్రీ వెడ్డింగ్ షూట్స్‎ చేసుకోవడం మొదలు పెట్టేశారు. ఒకప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్ తీసుకోవాలంటే ఉదయపూర్, జోద్పూర్ ప్యాలెస్ లతో పాటు గోవా లాంటి ప్రదేశాలకు వెళ్లాల్సి వచ్చేది. అయితే ఈ ట్రెండ్ నానాటికి పెరగడంతో పాటు ఇందులో మంచి సంపాదన అయితే ఈ ట్రెండ్ నానాటికి పెరగడంతో పాటు ఇందులో మంచి ఎర్నింగ్స్ కూడా ఉండడంతో చాలామంది ప్రత్యేకంగా ప్రీ వెడ్డింగ్ షూట్స్ కోసం డెస్టినేషన్స్ రెడీ చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో ఇలా ప్రీ వెడ్డింగ్ షూట్స్ తీసుకోవడానికి ప్రత్యేకమైన స్పాట్స్ ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ కూడా ప్రీ వెడ్డింగ్ షూట్ తీసుకోవాలి అనుకునే వధూవరుల కోసం కొన్ని సౌకర్యాలను కల్పించే దిశగా ప్రణాళికలు చేస్తోంది. తారామతి,అనంతగిరి హిల్స్‎లో ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్..రాణి మహల్‎లో పెళ్లిళ్లు.. ఎక్కువగా జరుగుతుండడంతో ఈ ప్రాంతాలు బాగా రద్దీగా మారాయి. వీటితో పాటుగా లక్కవరం, సోమశిలలో సైతం

ఫ్రీ వెడ్డింగ్ షూట్స్ తీసుకోవడానికి యువత ఆసక్తి చూపిస్తున్నారు.

హైదరాబాదులోని చారిత్రాత్మక కట్టడాలుగా.. అద్భుతమైన కళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ అందరిని ఆకట్టుకుంటున్న తారామతి, బారామతి మహల్స్ ప్రస్తుతం వెడ్డింగ్ డెస్టినేషన్స్ కి అడ్డగా మారాయి. అంటే ఇందుకోసం ప్రత్యేకమైన రుసుం వసూలు చేయడం జరుగుతుంది. తారామతి మహల్ లో ఐదు గంటల పాటు ఫోటోషూట్ జరుపుకోవడానికి ఉదయం వేళ అయితే రూ. 8,000 వరకు తీసుకుంటారు.. అదే సాయంత్రం పూట ఫోటోషాప్ తీసుకోవాలి అంటే రూ. 10,000 ఛార్జ్ చేస్తారు. రిసెప్షన్, పెళ్లిళ్లు లాంటి ఫంక్షన్ చేసుకోవాలి అంటే ఈ మహల్ ఓపెన్ ఏరియా కోసం 70 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది.