కెనడాకు ఫ్లైట్ టికెట్ ధర ఎంత పెరిగిందంటే?
చిన్నపాటి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నంతనే తొలుత పెరిగేది ఫ్లైట్ టికెట్టే. సెన్సెక్స్ సూచీ మాదిరే సున్నితంగా మారిపోయాయి ఫ్లైట్ టికెట్ ఛార్జీలు.
By: Tupaki Desk | 23 Sep 2023 3:53 AM GMTచిన్నపాటి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నంతనే తొలుత పెరిగేది ఫ్లైట్ టికెట్టే. సెన్సెక్స్ సూచీ మాదిరే సున్నితంగా మారిపోయాయి ఫ్లైట్ టికెట్ ఛార్జీలు. ఇటీవల కాలంలో భారత్ - కెనడాల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్ నుంచి కెనడాలోని ఏ నగరానికి వెళ్లాలన్నా ఫ్లైట్ టికెట్ల ఛార్జీలు చుక్కల్ని టచ్ చేస్తున్నాయి. సాధారణం కంటే డబుల్ ఛార్జీలు ఇప్పుడు ఉన్నట్లుగా ట్రావెల్ ఏజెన్సీలు పేర్కొంటున్నాయి.
సాధారణంగా సెప్టెంబరు చివరి వారంలో కెనడాలోని వివిధ నగరాల్లోని విద్యాసంస్థల ఆడ్మిషన్లు షురూ అవుతాయి. ఇలాంటి వేళలో విమాన ఛార్జీలు ఎక్కువగా ఉండటం మామూలే. విడి రోజుల్లో హైదరాబాద్ నుంచి కెనడాలోని మూడు నగరాల (టొరంటో, మాంట్రియల్, ఒట్టావా)కు ఫ్లైట్ ఛార్జీలు రూ.55 వేల నుంచి రూ.65 వేల మధ్యలో ఉంటాయి. విద్యా సంవత్సరం ఆరంభంలో వీటి ధరలు రూ.1.10 లక్షలకు చేరుకుంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం టికెట్ ఛార్జీలు రూ.1.35 లక్షల నుంచి రూ.1.50 లక్షలకు చేరుకున్నట్లుగా చెబుతున్నారు.
ఇప్పుడున్న పరిస్థితులు ఇలానే సాగినా.. ఫ్లైట్ ఛార్జీల ధరలు మరింతగా పెరగటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. విద్యా.. వాణిజ్య పరంగా రెండు దేశాల మధ్య రాకపోకలు ఎక్కువగానే ఉంటాయి. రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఫార్మా.. మిషనరీ.. ఆభరణాల వ్యాపారులు రెండు దేశాల మధ్య రాకపోకలు ఎక్కువే. ఇరు దేశాల మధ్య చోటు చేసుకున్న పరిణామాలతోనే విమాన టికెట్ ఛార్జీలకు రెక్కలు వచ్చాయే తప్పించి.. మరో కారణం లేదంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.