మోడీకి రష్యాలో చక్-చక్, కొరోవై... ఏమిటి వీటి ప్రత్యేకత?
అవును.. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు రష్యాలోని కజాన్ కు మంగళవారం చేరుకున్నారు ప్రధాని మోడీ. ఈ సందర్భంగా రష్యా సంప్రదాయ వంటకాలతో ఆయనకు వెల్ కం చెప్పారు!
By: Tupaki Desk | 23 Oct 2024 3:58 AM GMTకజాన్ లో జరుగుతోన్న 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు రష్యా వెళ్లిన ప్రధాని మోడీకి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా... రష్యా సంప్రదాయ వంటకాలతోనూ ఆయనకు వెల్ కం చెప్పారు. ఈ నేపథ్యంలో మోడీకి ఆఫర్ చేసిన వంటకాలు చక్-చక్, కొరోవై అని చెబుతున్నారు. వాటికి ఉన్న ప్రత్యేకతలేమిటో ఇప్పుడు చూద్దాం...!
అవును.. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు రష్యాలోని కజాన్ కు మంగళవారం చేరుకున్నారు ప్రధాని మోడీ. ఈ సందర్భంగా రష్యా సంప్రదాయ వంటకాలతో ఆయనకు వెల్ కం చెప్పారు! అత్యంత ఆకర్షణీయమైన టాటర్ దుస్తులు ధరించి, భారతదేశ ప్రధానికి స్వాగతం పలికేందుకు స్థానిక మహిళలు చక్-చక్, కొరోవై రొట్టెలు పట్టుకున్నారు.
వీటిలో చక్ చక్ అనేది రత్లామీ సెవ్ (కారపుస) ఆకారంలో ఉండే వేయించిన గోదుమ పిండి ముక్కలతో చేసిన స్వీట్. దీన్ని రౌండ్ గా లేదా క్యూబికల్ గా చేస్తారు. అయితే... తాజాగా మోడీకి వడ్డించినవి మాత్రం రౌండ్ గా ఉన్నాయి. ఇవి చూడటానికి తెలుగు రాష్ట్రాల్లోని మరమరాల లడ్డులా.. బీహార్ కు చెందిన ముర్హి-కా-లై లాగా ఉన్నాయి.
ఈ చక్-చక్ స్వీట్ రోజువారీ మీటింగ్స్ లో ప్రత్యేకమైనదే కాదు.. వివాహాలతో సహా సంప్రదాయ వేడుకలలోనూ ముఖ్యపాత్ర పోషిస్తూ స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటుందని చెబుతారు.
ఇక కొరోవై గోదుమ పిండితో చేసి, పూల నమూనాలతో అలకంరించబడి గుండ్రటి కేకులా ఉంటుంది. ఈ ప్రాంతంలో గొప్ప సాంస్కృతిక ప్రాముఖ్యతతో వివాహలలో తప్పనిసరిగా ఉండే వంటకంలో ఇది ఒకటి. దీన్ని తుర్పు స్లావిక్ ల్యాండ్ లోని ఓ ఫేమస్ బేకరీ ప్రొడక్ట్ అని చెబుతున్నారు. సూర్య భగవానుడికి గుర్తుగా ఆ ఆకారంలో దీన్ని తయారుచేస్తారు!