Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ ఎఫెక్ట్‌: కుల‌గ‌ణ‌న‌కు కూడా మోడీ ఓకే?

ఎన్నిక‌ల ఎఫెక్ట్‌.. అంత‌కుమించిన కాంగ్రెస్ ఎఫెక్ట్‌.. వెర‌సి కేంద్రంలోని నరేంద్ర మోడీ స‌ర్కారు

By:  Tupaki Desk   |   5 Nov 2023 3:30 PM GMT
కాంగ్రెస్ ఎఫెక్ట్‌:  కుల‌గ‌ణ‌న‌కు కూడా మోడీ ఓకే?
X

ఎన్నిక‌ల ఎఫెక్ట్‌.. అంత‌కుమించిన కాంగ్రెస్ ఎఫెక్ట్‌.. వెర‌సి కేంద్రంలోని నరేంద్ర మోడీ స‌ర్కారు.. నిన్న మొ న్నటి వ‌ర‌కు కాద‌న్న ప‌నుల‌కు కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేందుకు రెడీ అయింది. ఇప్ప‌టికి వ‌రుస‌గా రెండు సార్లు కేంద్రంలో విజ‌యం ద‌క్కించుకున్న మోడీ.. వ‌చ్చే 2024 ఎన్నిక‌ల్లోనూ విజ‌యం సాధించాల ని నిర్ణ యించుకున్నారు. అయితే.. మ‌రోవైపు కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. దేశంలో విస్తృత ప‌ర్య‌ట నలు చేయ‌డంతోపాటు.. కీల‌క‌మైన కుల‌గ‌ణ‌న‌కు కాంగ్రెస్ ప‌ట్టుబ‌డుతోంది.

వాస్త‌వానికి కుల‌గ‌ణ‌న విష‌యం ఈ రోజుది కాదు. గ‌తంలో నుంచే అనేక పార్టీలు దీనికి ప‌ట్టుబడుతున్నా యి. ఇప్ప‌టికే బీహార్‌లో కుల గ‌ణ‌న పూర్త‌యింది. దీని ఫ‌లితం కూడా వ‌చ్చింది. ముందు అనేక మంది వ్య‌తిరే కించినా.. సీఎం నితీశ్ కుమార్ ఈ ఫ‌లితాన్ని వెల్ల‌డించిన త‌ర్వాత అన్ని పార్టీలు కూడా దీనికి మ‌ద్ద‌తు ప్ర‌క టించాయి. ఇక‌, ఈ క్ర‌మంలోనే దేశంలోనూ కుల గ‌ణ‌న చేప‌ట్టాల‌నేది కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఓబీసీ గురించి గొప్ప‌గా చెప్పుకొనే మోడీ.. కుల‌గ‌ణ‌న‌కు ఎందుకు భ‌య‌ప‌డుతున్నార‌ని కాంగ్రె స్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ ప్ర‌శ్నిస్తున్నారు.

అంతేకాదు.. తాము కేంద్రంలో అధికారంలోకి రాగానే తాము కుల‌గ‌ణ‌న చేసి తీరుతామ‌ని కూడా రాహుల్ హామీ ఇస్తున్నారు. ఇక‌, ప్ర‌స్తుతం అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతున్న ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో కుల‌గ‌ణన‌కు ఇక్క‌డి అధికార పార్టీ కాంగ్రెస్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఈ ప‌రిణామానికి తోడు.. కేంద్రంలో బీజేపీకి మ‌ద్ద‌తుగా ఉన్న అవామీ మోర్చా, అప్నాద‌ళ్ వంటి పార్టీలు కూడా కుల‌గ‌ణ‌న‌కు ప‌ట్టుబడుతున్నాయి. కుల గ‌ణ‌న‌తో అస‌లు ఏయే సామాజిక వ‌ర్గాలు అభివృద్ధి చెందాయో తేలుతుంద‌ని వారు చెబుతున్నారు.

ఇలా.. అన్ని వైపుల నుంచి వ‌స్తున్న ఒత్తిళ్ల‌తో మోడీ స‌ర్కారు ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఈ క్ర‌మంలో నిన్న మొన్న‌టి వ‌ర‌కు కుల‌గ‌ణ‌న‌కు తీవ్రంగా అడ్డు చెప్పిన బీజేపీ స‌ర్కారు ఇప్పుడు యూట‌ర్న్ తీసుకుంది. కుల గ‌ణ‌న‌కు తాము వ్య‌తిరేకం కాదని.. దీనిపై విస్తృత అధ్య‌య‌నం చేశాక‌.. ఆమోదించేందుకు రెడీనేన‌ని కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించ‌డం.. గ‌మ‌నార్హం. ఇక‌, ప్ర‌ధాని మోడీ కూడా ఇదే వ్యూహంతో ఉన్నార‌ని తెలుస్తోంది. వ‌చ్చే 2024 నాటికి ఈ వ్యూహం అమ‌లు చేయ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది.