మూడవసారి ప్రధాని పదవి... మోడీ క్లారిటీ ఇచ్చేశారా...!?
అదేంటి అంటే కాంగ్రెసేతర ప్రధానులలో సుదీర్ఘ కాలం ఆ పదవిని నిర్వహించిన నేతగా ఉండడం.
By: Tupaki Desk | 17 Jan 2024 3:15 AM GMTనరేంద్ర మోడీ లాంటి పవర్ ఫుల్ లీడర్ ని దేశం పదేళ్ళ క్రితం చూసింది. ఒక విధంగా చెప్పాలంటే నెహ్రూ ఇందిరాగాంధీ తరువాత అంతటి పవర్ ఫుల్ ప్రధానిగా మోడీ చరిత్ర సృష్టించారు. మోడీ మరో చరిత్రను సృష్టించేందుకు రెడీ అవుతున్నారు.
అదేంటి అంటే కాంగ్రెసేతర ప్రధానులలో సుదీర్ఘ కాలం ఆ పదవిని నిర్వహించిన నేతగా ఉండడం. అంతే కాదు ప్రధానిగా ఇందిరాగాంధీ రికార్డుని సమం చేయడమో లేక అధిగమించడమో కూడా మోడీ చేయాలని ఆయన అభిమానులు గట్టిగా కోరుకుంటున్నారు. ఇవన్నీ జరగాలంటే 2024 ఎన్నికల్లో మోడీ బంపర్ మెజారిటీతో బీజేపీని అధికారంలోకి తేవాల్సి ఉంది.
బీజేపీకి పూర్తి మెజారిటీ వస్తే నరేంద్ర మోడీ హ్యాట్రిక్ పీఎం అవుతారు. ఒకవేళ మెజారిటీ రాకపోతే ఎన్డీయే మిత్రుల అవసరం పడుతుంది. అలా ఎన్డీయేకు కూడా మెజారిటీ రాకపోతే ఏమవుతుంది అంటే విపక్షాల నుంచి మద్దతు తీసుకోవాల్సి ఉంటుంది. దీని మీదనే కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ ఎన్డీయేకు ఈసారి మెజారిటీ రాదు అని అంటున్నారు
ఇదిలా ఉంటే ఏపీలోని అనంతపురం జిల్లాలో జరిగిన సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధర్మంగా నాకు అధికారం దక్కితే నేను స్వీకరించను అని ప్రధాని మోదీ అనడం విశేషం. అక్రమంగా దక్కే అధికారాన్ని స్వీకరించవద్దని రాముడు చెప్పారు అని మోదీ ఇదే సభలో చెప్పారు.
ఈ రోజున దేశమంతా ఇప్పుడు రామమయం అయిందని మోడీ అన్నారు. పరిపాలన దక్షతకు రాముడు మారుపేరు అని ఆయన వెల్లడించారు రాముడు దేశ ప్రజలందరికీ ప్రేరణ అని మోదీ అంటూ
రామరాజ్యం మన అందరికీ ఆదర్శప్రాయం అని చెప్పుకొచ్చారు. ఇవన్నీ అలా ఉంటే అధర్మంగా అధికారం తనకు వద్దు అని మోడీ అనడం పట్ల చర్చ సాగుతోంది. అది ఎలా జరుగుతుంది అన్నది ఆయన వివరించకపోయినా ధర్మంగా తనకు అధికారం కావాలని కోరారు.
ధర్మంగా అంటే ప్రజలు బీజేపీని బంపర్ మెజారిటీతో మూడవసారి దేశంలో గెలిపించాల్సి ఉంది. అంతే కాదు బీజేపీకి తిరుగులేని మెజారిటీ కట్టబెడితేనే మోడీ మూడవసారి ప్రధానిగా మరిన్ని విప్లవాత్మకమైన నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంది అని అంటున్నారు. ఏది ఏమైనా ధర్మంగా అధికారం అంటూ మోడీ చెప్పడం వెనక వ్యూహం ఏంటి అన్నది మాత్రం రాజకీయంగా చర్చకు వస్తోంది.
ఇక బీజేపీకి మెజారిటీ దక్కకపోతే మోడీ మూడవసారి ప్రధాని పదవిని స్వీకరించరా అన్న చర్చ కూడా సాగుతోంది. మొత్తానికి చూస్తే బీజేపీని అధికారంలోకి తీసుకుని రావాల్సిన బాధ్యత ప్రజల మీద ఉందనే మోడీ చెప్పకనే చెప్పారని అంటున్నారు.