క్యాన్సర్ నుంచి బయటపడ్డట్లు ప్రకటించిన యువరాణి!
ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కేట్ మిడిల్టన్.. తాను ఇబ్బంది పడిన సమయంలో వారి నుంచి తనకు అందిన సహాయ సహకారాలు అమూల్యమైనవి, అసాధారణమైనవని తెలిపారు.
By: Tupaki Desk | 15 Jan 2025 9:38 AM GMTక్యాన్సర్ బారిన పడి బయటపడటం ఓ భారీ యుద్ధం చేసినదానితో సమానమని.. ఈ పోరాటంలో ఎంతో మానసిక, శరీరక ఒత్తిడి ఉంటుందని అంటారు. ఈ సమయంలో బ్రిటన్ యువరాజు విలియమ్ సతీమణి, ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కేట్ మిడిల్టన్ ఓ కీలక ప్రకటన చేశారు. ఇందులో భాగంగా.. తాను క్యాన్సర్ నుంచి బయటపడినట్లు తెలిపారు.
అవును... గత ఏడాది మార్చిలో తాను క్యాన్సర్ బారిన పడినట్లు ప్రకటించారు కేట్. అప్పటి నుంచి ఆమె ప్రజా జీవితానికి దూరంగా ఉంటూ ఆస్పత్రిలో పలు దశల వారీగా కీమోథెరపీ చేయించుకున్నారు. ఈ సమయంలో తాను క్యాన్సర్ నుంచి బయటపడ్డట్లు ఆమె తెలిపారు. ఈ మేరకు ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. వివరాలు వెల్లడించారు.
ఇందులో భాగంగా... గత ఏడాది తాను చికిత్స తీసుకుంటున్న సమయంలో ఆస్పత్రి సిబ్బంది తనను చాలా బాగా చూసుకున్నారని చెబుతూ.. వారందరికీ ధన్యవాదాలు తెలిపిన ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కేట్ మిడిల్టన్.. తాను ఇబ్బంది పడిన సమయంలో వారి నుంచి తనకు అందిన సహాయ సహకారాలు అమూల్యమైనవి, అసాధారణమైనవని తెలిపారు.
ఈ సందర్భంగా... రాయల్ మార్స్ డెన్ ఆసుపత్రి సంయుక్త పోషకురాలిగా కొత్త పాత్రలోకి మారినట్లు తెలిపిన ఆమె... ఆస్పత్రి పరిశోధనలకు మద్దతు ఇవ్వడంతోపాటు రోగి, వారి కుటుంబ శ్రేయస్సును ప్రోత్సహించడం.. ఎక్కువమంది ప్రాణాలను నిలబెట్టడం, క్యాన్సర్ బారిన పడిన వారందరిని అభిప్రాయాలను మారుస్తాను అన్న నమ్మకం ఉందని వెల్లడించారు.
ఈ సమయంలో.. క్యాన్సర్ నుంచి బయటపడినందుకు తనకు ఎంతో ఉపశమనంగా ఉందని చెప్పిన కేట్.. ఇకపై పూర్తిగా కోలుకోవడ్దంపైనే దృష్టి సారిస్తానని అన్నారు. అయితే.. మునుపటిలా సాధారణ స్థితికి రావడానికి కొంచేం సమయం పడుతుందని అన్నారు. ఇక నుంచి కొత్త ఏడాదిలో చేయాల్సిన పనులపై దృష్టి సారిస్తానని అన్నారు.
ఈ నేపథ్యంలోనే... ఇన్ని రోజులు తనకు మద్దతుగా ఉన్న ప్రతిఒక్కరిగా ధన్యవాదాలు తెలిపారు కేట్ మిడిల్టన్. కాగా... కేట్ చికిత్స పొందిన రాయల్ మర్స్ డెన్ ఆస్పత్రికి విలియమ్ దంపతులు దాతలుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే విలియమ్ దంపతులు ఆస్పత్రికి వెళ్లి, చికిత్స తీసుకుంటున్న రోగులను పరామర్శించారు.