వాదనల మధ్యలో జడ్జిపై నిందితుడి దాడి..విధించిన శిక్షేమిటో తెలుసా?
అయితే, అమెరికాలో తాజాగా జరిగిన ఓ ఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది.
By: Tupaki Desk | 11 Dec 2024 6:30 PM GMTఏ దేశంలోనైనా న్యాయ వ్యవస్థ అత్యున్నతమైనది.. వివిధ దేశాల్లో ఇది వివిధ పద్ధతుల్లో నడుస్తూ ఉంటుంది. ఉక్రెయిన్, రష్యాలలో పోలీసుల కంటే న్యాయ వ్యవస్థ అంటేనే ప్రజలు బాగా భయపడతారట.. యూరప్ లో ప్రజల స్వేచ్ఛకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఇక అమెరికాలో చట్టం అంటే చట్టమే. ప్రజలు కూడా అంతే గౌరవంగా వాటిని ఫాలో అవుతుంటారు. అయితే, అమెరికాలో తాజాగా జరిగిన ఓ ఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది.
వ్యక్తిపై దాడి చేసి..
లాస్ వెగాస్ కు చెందిన డియోబ్రా రెడెన్.. ఓ కేసులో అరెస్టయ్యాడు. దీనికిగాను కేసు నమోదవగా లాస్ వెగాస్ కౌంటీ డిస్ట్రిక్ట్ లో మహిళా జడ్జి మేరీ కే హోల్థస్ ఎదుట విచారణకు వచ్చింది. దీంతో డియోబ్రా ఆమెపై దాడికి దిగాడు. కోర్టు సిబ్బంది దీనిని అడ్డుకున్నారు. కానీ, అప్పటికే రికార్డయింది. వైరల్ గానూ మారింది. ఇది జనవరిలో జరగ్గా.. ఈ డిసెంబరులో నిందితుడికి కఠిన శిక్ష పడింది.
‘మానసిక సమస్యలు’ చెప్పినా..
తాను చేసిన తప్పును డియోబ్రా అంగీకరించాడు. తనపై ఉన్న కేసుల కారణంగా మానసిక అనారోగ్యానికి గురయ్యాడని, వాదనల సమయంలో ఔషదాలు వేసుకోలేదని అతడి తరఫు న్యాయవాదులు చెప్పారు. కానీ, కోర్టు దీనిని పరిగణనలోకి తీసుకోలేదు.
దాడి కారణంగా భయభ్రాంతులకు గురయ్యానని జడ్జి హోల్థస్ తెలిపారు. మహిళా న్యాయమూర్తితో సహా కోర్టు సిబ్బందికి గాయాలైనట్లు ప్రతివాదులు పేర్కొన్నారు. దీంతో డియోబ్ రాను 65 ఏళ్లు జైలులోనే గడపాలని న్యాయస్థానం ఆదేశించింది.