Begin typing your search above and press return to search.

ఎక్స్ రే తీస్తే కనిపించింది... జైల్లో ఖైదీ ఫోన్ ఎక్కడ దాచుకున్నాడో తెలుసా?

ఈ సమయంలో ఓ ఖైదీ దగ్గర మొబైల్ ఉండటం ఒకెత్తు అయితే.. అది దాచిన చోటు మరొకెత్తు అన్నట్లుగా ఉంది!

By:  Tupaki Desk   |   8 Dec 2024 5:49 AM GMT
ఎక్స్  రే తీస్తే  కనిపించింది... జైల్లో ఖైదీ ఫోన్  ఎక్కడ దాచుకున్నాడో  తెలుసా?
X

కోర్టు శిక్ష విధించినా, రిమాండ్ కు పంపినా జైల్లోకి ఎంటరవ్వగానే 'మొత్తం' చెక్ చేస్తారు! సదరు వ్యక్తి వద్ధ ఒంటిపై దుస్తులు తప్ప మరేమీ ఉండే అవకాశం ఇవ్వరు! అనంతరం లోపల కట్టుదిట్టమైన భద్రత, పూర్తి స్థాయి నిఘా ఉంటుంది. ఈ సమయంలో ఓ ఖైదీ దగ్గర మొబైల్ ఉండటం ఒకెత్తు అయితే.. అది దాచిన చోటు మరొకెత్తు అన్నట్లుగా ఉంది!

అవును... జైల్లో ఎంత కఠినమైన నిబంధనలు ఉంటాయనేది తెలిసిన విషయమే. జైల్లో ఉన్న వ్యక్తులు తమ వారు ఎవరితోనైనా మాట్లాడుకోవాలంటే ముందుగా దరఖాస్తు చేసుకోవాలి! అలాంటి జైల్లో ఒక వ్యక్తి సెల్ లో మొబైల్ ఛార్జర్ కనిపించింది. దీంతో... పోలీసులు సెర్చింగ్ మొదలుపెట్టారు. ఎక్కడ వెతికినా, ఎలా వెతికినా ఆ సెల్ ఫోన్ ఎక్కడుందో కనిపించలేదు.

వివరాళ్లోకి వెళ్తే... గుజరాత్ లోని భావ్ నగర్ జైల్లో రవి బరయ్య (33) అనే ఖైదీ పోక్సో కేసులో అరెస్టై.. ఈ ఏడ్దాది అక్టోబర్ 19 నుంచి లోపలే ఉంటున్నాడు. ఈ క్రమంలో తాజాగా జైల్లో తనిఖీలు చేపట్టగా.. అక్కడ మొబైల్ ఫోన్ ఛార్జర్ కనిపించింది. దీంతో.. అధికారులకు సందేహం వచ్చి వెతుకులాట ప్రారంభించారు.

వారు ఎంత వెతికినా ఫోన్ దొరకలేదు. అయితే... రవి బరయ్యపై అనుమానంతో అతడిని పూర్తిగా పరిశీలించారూ పోలీసులు. అయినప్పటికీ అతడి వద్ద సెల్ ఫోన్ దొరకలేదు! అయినప్పటికీ జైలు అధికారులకు సందేహం తీరలేదు.. ఇంకా అతడిని అనుమానిస్తూనే ఉన్నారు. ఈ సమయంలో అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లి ఎక్స్ రే తీయించారు.

ఆ ఎక్స్ రే రిపోర్ట్ చూసి అధికారులు నివ్వెరపోయారు. ఒక్కసారిగా షాకైపోయారు. సదరు ఖైదీ సెల్ ఫోన్ ను మలద్వారంలో దాచినట్లు గుర్తించారు. దీంతో అతడిపై బీ.ఎన్.ఎస్. 223, ఖైదీల చట్టంలోని సెక్షన్ 42, 43, 45 (12)ల కింద కేసు నమోదు చేశారు. మరోపక్క ఇతడి వద్దకు సెల్ ఫోన్ ఎలా వచ్చిందనే విషయంపైనా ఆరాతీస్తున్నారు.