జగన్ 'హిస్టారికల్ పేజీల్లో' మరొకటి మాయం.. !
అయితే.. ఇలా ప్రభుత్వ మద్యం దుకాణాలు మూసేసి.. ప్రైవేటుకు అప్పగించడాన్ని కూటమి పెద్దలు సమర్థించుకుంటున్నారు.
By: Tupaki Desk | 16 Oct 2024 7:30 AM GMTప్రభుత్వ మద్యం దుకాణాలు నిన్నటితో(మంగళవారం) ముగియనున్నాయి. కూటమి సర్కారు తీసుకువచ్చి న నూతన మద్యం పాలసీ మేరకు(వాస్తవానికి 2014-19మధ్య అమలైన విధానం) ప్రభుత్వం మద్యం వ్యా పారం నుంచి తప్పుకొంది. దీంతో బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు మద్యం దుకాణాలు ప్రారం భం కానున్నాయి. అయితే.. ఇలా ప్రభుత్వ మద్యం దుకాణాలు మూసేసి.. ప్రైవేటుకు అప్పగించడాన్ని కూటమి పెద్దలు సమర్థించుకుంటున్నారు.
ఇదిలావుంటే.. 2019లో జగన్ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన తర్వాత.. అప్పటి వరకు ఉన్న ప్రైవేటు మ ద్యం వ్యాపారాన్ని రద్దు చేశారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ మద్యం దుకాణాలను తీసుకువచ్చారు. దీనివల్ల మరింత ఆదాయం ప్రభుత్వానికి సమకూరుతుందన్న ఉద్దేశం ఒకటైతే.. మందుబాబులకు నిర్ణీత ధరలకే మద్యం అందించేందుకు అవకాశం ఉంటుందని.. దళారుల ప్రమేయం అరికట్టవచ్చన్నది మరో ఉద్దేశం. మొత్తానికి 2019లో జగన్ మద్యాన్ని ప్రభుత్వం పరిధిలోకి తీసుకువచ్చారు.
అయితే.. దీనిపై అనేక ఆరోపణలు వచ్చాయి. నేరుగా నగదు తీసుకోవడం, ఫేన్ పే వంటి డిజిటల్ పేమెం ట్లను వినియోగించకపోవడం, భారీ ఎత్తున ధరలు నిర్ణయించడం వంటివి జగన్‌కు సెగ పెట్టాయి. వాస్తవా నికి ఎదురుగా మందు ఉన్నా.. దాని జోలికి పోకుండా నియంత్రించాలన్న ఉద్దేశంతోనే తాము ధరలు పెంచామని ఆయన సమర్థించుకున్నా ఫలితం లేకుండా పోయింది. అయితే..ఇ క్కడ చెప్పుకోవాల్సిన రెండు కీలక విషయాలు ఉన్నాయి.
1) ప్రభుత్వానికి ఆదాయం. 2) ఉపాధి. ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేయడం వల్ల.. పూర్తి ఆదాయం ప్రభుత్వానికే చేకూరింది. నెలకు 7 వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. దీనివల్ల సర్కారుకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేందుకు అవకాశం ఏర్పడింది. 2) ఉపాధి కల్పనకు కూడా మద్యం షాపులు దోహదపడ్డాయి. 10 నుంచి డిగ్రీ చేసిన వారిని షాపునకు ఆరుగురు చొప్పున పని కల్పించారు. దీంతో అంతో ఇంతో వారికి ఉపాధి లభించింది. ఇక, ఇప్పుడు జగన్ చెప్పుకొన్న ఆహిస్టారికల్ పేజీల్లో.. మద్యం పేజీ కూడా మాయమైంది.