వైరల్ ఇష్యూ... రెండు ముక్కలైన విశాఖ-ముంబయి విమానం!
విశాఖపట్నం నుంచి బయలుదేరిన ఈ విమానం ముంబై లో ల్యాండ్ అవుతున్న సమయంలో రన్ వే పై రెండు ముక్కలైపోయింది.
By: Tupaki Desk | 15 Sep 2023 6:34 AM GMTతాజాగా ఒక విమానం రెండు ముక్కలైన సంఘటన వైరల్ గా మారింది. విశాఖపట్నం నుంచి బయలుదేరిన ఈ విమానం ముంబై లో ల్యాండ్ అవుతున్న సమయంలో రన్ వే పై రెండు ముక్కలైపోయింది. ఈ సమయంలో ఎలాంటి ప్రాణాపాయం జరగనప్పటికీ విమానంలో ఉన్న వారందరికీ గాయలయ్యాయి.
వివరాళ్లోకి వెళ్తే... విశాఖపట్నం నుంచి బయల్దేరిన వీ.ఎస్.ఆర్. వెంచర్స్ కు చెందిన ప్రైవేటు విమానం ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా రన్ వే నుంచి జారీ పక్కకు దూసుకెళ్లింది. దీంతో ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో విమానంలోని ఇద్దరు పైలట్లు, ఆరుగురు ప్రయాణికులు ఉన్నట్టు అధికారులు తెలిపారు.
ఈ ప్రమాదం వల్ల విమానంలో ఉన్న ఈ ఎనిమిది మందికీ గాయాలు అయ్యాయని, దీంతో వారందరిని ఆస్పత్రికి తరలించారని తెలిసింది. ఈ సమయంలో ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రన్ వే పై నుంచి పక్కకు తప్పడంతో ఇంజిన్ నుంచి వెలువడిన పొగలు ఆ ప్రాంతాన్ని కమ్మేయడం వీడియోలో కనిపిస్తోంది.
ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్ పోర్ట్ రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపుచేస్తుంది. ఈ వీ.ఎస్.ఆర్ వెంచర్స్ కు చెందిన ఈ విమానంలో డెన్మార్క్ కు చెందిన వ్యక్తితో పాటు ఆరుగురు ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు ఉన్నారు. గాయపడిన వీరిని అంధేరిలో ఆసియా ఆస్పత్రికి తరలించారు.
అయితే ఈ ప్రమాదంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ స్పందించింది. ముంబయిలో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తుండటంతో 700 మీటర్లకు మించి విజిబులిటీ లేదని, అందువల్లే విమానం రన్ వే పై నుంచి పక్కకు ఒరిగిందని వెల్లడించింది. దీంతో... ఈ ప్రమాదం చోటుచేసుకున్న రన్ వే నెంబర్ 27 ను కొద్ది సేపు మూసివేశారు.
అనంతరం ముక్కలైన విమాన శకలాలను అక్కడ నుంచి తొలగించి సహాయక చర్యలు పూర్తయిన తర్వాత రన్ వే కార్యకలాపాలను పునరుద్ధరించారు. అంతక ముందు ఇదే రన్ వే పై ల్యాండ్ అవ్వాల్సిన ఐదు విమానాలను ఇతర ప్రాంతాలకు మల్లించారని విస్తారా ఎయిర్ లైన్స్ తెలిపింది. ప్రస్తుర్తం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.