యజమాని ప్రైవేట్ వీడియోలు తీసిన ఉద్యోగి... మేటర్ సీరియస్!
ఇందులో భాగంగా తనకు ఉద్యోగం ఇచ్చిన యజమాని దంపతుల ప్రైవేటు వీడియోలు నెట్టింట అప్ లోడ్ చేయాలని భావించింది. అంతకంటే ముందు బ్లాక్ మెయిల్ కి కూడా దిగింది.
By: Tupaki Desk | 24 Sep 2023 1:30 AM GMTతనను ఉద్యోగంలో నుంచి తీసేశారని ఒక యువతి దారుణానికి ఒడిగటింది. ఎవరూ ఊహించని విధంగా ప్రతీకారం తీర్చుకోవాలని భావించింది. ఇందులో భాగంగా తనకు ఉద్యోగం ఇచ్చిన యజమాని దంపతుల ప్రైవేటు వీడియోలు నెట్టింట అప్ లోడ్ చేయాలని భావించింది. అంతకంటే ముందు బ్లాక్ మెయిల్ కి కూడా దిగింది.
అవును... అప్పటికే తీసిపెట్టుకుందో.. లేక, తర్వాత సేకరించిందో తెలియదు కానీ... తనను ఉద్యోగంలోంచి తీసేసిన యజమానిపై కక్ష పెంచుకుంది ఒక యువతి. అతడిపై ఎలాగైనా రివేంజ్ తీర్చుకోవాలని భావించింది. ఈ సమయంలో యజమాని పరువు బజారుపాలు చేయాలనుకుంది. ఆ దంపతుల ప్రైవేటు వీడియోలతో బ్లాక్ మెయిల్ కి దిగింది.
వివరాళ్లోకి వెళ్తే... పంజాబ్ లోని జలంధర్ లో ఓ జంట పిజ్జా షాప్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని నెలల క్రితమే ఈ జంట ఆ షాపును ప్రారంభించారు. ఈ సమయలో ఆ షాపులో ఒక యువతి పనికి చేరింది. అయితే కొంతకాలం తర్వాత ఆమె పనితీరు నచ్చకపోవడంతో ఉద్యోగం నుంచి తొలగించేశాడు. దీంతో ఆమె కక్ష కట్టేసింది ఆ యువతి.
ఇందులో భాగంగా ఆ షాపు యజమాని జంటకు సంబంధించిన ప్రైవేట్ వీడియోను తీసింది. దానితో ఒకసారి ఫోన్ చేసి బ్లాక్ మెయిల్ చేసి రూ.20,000 డిమాండ్ చేసింది. అనంతరం వాటిని నెట్ లో పోస్ట్ చేసింది. దీంతో ఆ దంపతులు పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు షాకయ్యే విషయం తెలిసింది.
అదేమిటంటే... ఆ పిజ్జా షాపులో గతంలో పనిచేసిన అమ్మాయే ఇన్ స్టాగ్రామ్ లో ఫేక్ ఐడీ క్రియేట్ చేసిందని.. ఆమె తన పాత యజమాని దంపతులకు చెందిన ప్రైవేట్ వీడియో వైరల్ చేసిందని తేలింది. దీంతో ఆమెతో పాటు ఒక అజ్ఞాత వ్యక్తిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం తమదైన శైలిలో విచారించేసారికి నాలుగు వీడియోలు వైరల్ చేసినట్లు పేర్కొంది.. చేసిన పనిని అంగీకరించింది!