Begin typing your search above and press return to search.

కశ్మీర్ లో అధికారం కోసం ఈ మాటలు అవసరమా ప్రియాంక?

రాజకీయం చేయాల్సిందే. అందునా పవర్ కోసం కొన్నితిప్పలు తప్పువు.

By:  Tupaki Desk   |   29 Sep 2024 1:30 PM GMT
కశ్మీర్ లో అధికారం కోసం ఈ మాటలు అవసరమా ప్రియాంక?
X

రాజకీయం చేయాల్సిందే. అందునా పవర్ కోసం కొన్నితిప్పలు తప్పువు. అన్ని సందర్భాల్లో కాకున్నా కొన్ని సందర్భాల్లో కచ్ఛితంగా జాతీయ ప్రయోజనాలు .. దేశ సంరక్షణ లాంటి అంశాల్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాల్ని చూస్తే.. ఆ పార్టీ ఎప్పటికి మారుతుందన్న సందేహం కలుగక మానదు. దేశంలోని మిగిలిన అంశాలు వేరు. జమ్ముకశ్మీర్ అంశాన్ని వేరుగా చూడాల్సిన అవసరం ఉంది.

తాజాగా జరుగుతున్న రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ.. జమ్ముకశ్మీర్ లో గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్న ఆ పార్టీ.. కశ్మీర్ విషయంలో బాధ్యత లేకుండా ప్రవర్తిస్తుందన్న వాదనకు బలం చేకూరేలా ఆ పార్టీ ముఖ్యనేతల్లో ఒకరైన ప్రియాంక వాద్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వస్తే జమ్ముకశ్మీర్ కు తిరిగి రాష్ట్ర హోదాను ఇస్తామని పేర్కొన్నారు. ఆరని రావణకాష్ఠంలా మారిన కశ్మీర్ విషయంలోనూ.. ఆ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక హోదాను ఇచ్చే ఆర్టికల్ 370 విషయంలో మరే ప్రభుత్వం చేయని రీతిలో మోడీ సర్కారు సంచలన నిర్ణయాన్ని తీసుకోవటం.. దేశంలోని మిగిలిన ప్రాంతాల మాదిరి కశ్మీర్ ను చేయటం తెలిసిందే.

అదే సమయంలో కేంద్రపాలిత ప్రాంతంగా మార్చి.. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ తీరుపై జమ్ముకశ్మీర్ లోని రాజకీయ పార్టీలు గుర్రుగా ఉన్నాయి. కొన్ని పార్టీలు అయితే.. రద్దు చేసిన ఆర్టికల్ 370 హోదాను పునరుద్ధరిస్తామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇలాంటివేళ..కాంగ్రెస్ ముఖ్యనేత ప్రియాంక సైతం జమ్ముకశ్మీర్ మీద అవగాహానలేమితో వ్యాఖ్యలు చేశారన్న వాదన వినిపిస్తోంది.

జమ్ముకశ్మీర్ విషయంలో కాంగ్రెస్ కు స్పష్టమైన విధానం ఉందన్న ప్రియాంక చేసిన వ్యాఖ్యల్లో కీలక అంశాల్ని చూస్తే..

- మా పార్టీ అధికారంలోకి రాగానే జమ్ముకశ్మీర్ కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తాం.

- సీజన్ వారీగా జమ్ము.. శ్రీనగర్ మధ్య ప్రభుత్వ కార్యాలయాల మార్పిడిని పునరుద్ధరిస్తాం.

- జమ్ముకశ్మీర్ పౌరుల హక్కులను కాపాడుతాం.

- మా నాన్నమ్మ ఇందిరకు జమ్ముకశ్మీర్ తో ఉన్న అనుబంధం వేరు.

- ఆమె హత్యకు నాలుగైదు రోజుల ముందు కశ్మీర్ అందాల్ని చూడాలని మాతో చెప్పారు.

- రాష్ట్ర హోదా కావాలంటే బీజేపీకి ఓటు వేయాలని అమిత్ షా అడుతున్నారు. రాష్ట్ర హోదా తీసుకున్నదే వారు. తీసుకెళ్లినోళ్లే ఎలా ఇస్తారు?

- టీవీ ఎత్తికెళ్లినోళ్లే టీవీ కావాలంటే తమను అడగాలని చెప్పినట్లు వారి మాటలు ఉన్నాయి. జమ్ముకశ్మీర్ పై ప్రధాని మోడీకి ఎలాంటి ప్రేమా లేదు.

- వారి రాజకీయ చదరంగంలో జమ్ముకశ్మీర్ అన్నది ఒక పావు మాత్రమే. దేశవ్యాప్తంగా భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకు జమ్ముకశ్మీర్ అంశానని వాడుకుంటున్నారు.