ప్రియాంకా గాంధీకి గట్టిగానే రిటార్ట్ ఇచ్చిన జ్యోతీరాదిత్యా
అయితే ఎలాగోలా కాంగ్రెస్ నుంచి జ్యోతీరాదీత్యను తమ వైపు తిప్పుకుని మెజారిటీ సంపాదించి మూడున్నరేళ్ల పాటు రాజ్యం చేసింది.
By: Tupaki Desk | 3 Dec 2023 3:03 PM GMTమధ్యప్రదేశ్ లో బీజేపీకి అద్భుతమైన మెజారిటీ వచ్చింది. నిజానికి గత ఎన్నికల్లో బీజేపీ మంచి నంబర్ నే తెచ్చుకుంది కానీ మెజారిటీకి ఆరేడు సీట్లు వెనకబడింది. అయితే ఎలాగోలా కాంగ్రెస్ నుంచి జ్యోతీరాదీత్యను తమ వైపు తిప్పుకుని మెజారిటీ సంపాదించి మూడున్నరేళ్ల పాటు రాజ్యం చేసింది.
దానికి బదులుగా జ్యోతీరాదీత్యకు కేంద్రంలో కీలకమైన మంత్రిత్వ శాఖలు కట్టబెట్టింది. మరి ఆయన బీజేపీకి ఎలా ఉపయోగపడ్డారు అంటే చాలా గొప్పగానే అని చెప్పాలి. బీజేపీ మెజారిటీని ఎక్కడికో తీసుకెళ్ళారు. దాంతో బీజేపీ వరసగా మరోమారు అధికారాన్ని చేపట్టేందుకు అవకాశం లభించింది.
బీజేపీకి మధ్య ప్రదేశ్ లో ఏకంగా 167 దాకా సీట్లు దక్కాయి. దాంతో ఆ పార్టీ సంబరాలు చేసుకుంటోంది. ఇదిలా ఉంటే మధ్య ప్రదేశ్ లో ప్రియాంకా గాంధీ ప్రచారం చేస్తూ జ్యోతీరాదీత్య మీద కామెంట్స్ చేశారు. అనేక విమర్శలు చేశారు. అవి శృతి మించి ఆయన ఎత్తు గురించి కూడా ఆమె మాట్లాడారట. ఇప్పటిదాకా దాని మీద సైలెంట్ గా ఉన్న జ్యోతీరాదీత్య ఇపుడు బీజేపీ గెలుపు చూపించి నా ఎత్తు ఎంతో ఇపుడైనా తెలిసిందా అంటూ ప్రియాంకా గాంధీకి గట్టిగానే రిటార్ట్ ఇచ్చేశారు.
తాను ఎంత ఎత్తులో ఉన్నానో గ్వాలియర్ మాల్వా ప్రజలు చూపించారు అని జ్యోతీరాదిత్య సింధియా వేసిన కౌంటర్ ఇపుడు వైరల్ అవుతోంది. ఈ రాజ కుటుంబానికి ఈ రెండు ప్రాంతాలలో మంచి పట్టు ఉంది. దాంతో బీజేపీకి పాతిక ముప్పయి సీట్లు ఇలా దక్కాయని అంటున్నారు. మొత్తానికి యువ నాయకుడిగా కాంగ్రెస్ లో ఉన్న జ్యోతీరాదిత్యాను పోగొట్టుకున్న కాంగ్రెస్ మరోమారు మధ్య ప్రదేశ్ ని జారవిడుచుకుంది అని అంటున్నారు.
వృద్ధ నేతలు అయిన దిగ్విజయ్ సింగ్, కమలనాధ్ వంటి వంటి వారితోనే బీజేపీ బండి అక్కడ నడుస్తోంది. అందుకే ఫలితాలు కూడా అలాగే వస్తున్నాయని అంటున్నారు. మొత్తానికి కాంగ్రెస్ కి తాను పోగొట్టుకున్నది ఏంటో ఈ ఎన్నికలలో అయినా తెలిసిందా అన్నదే ప్రశ్న.