Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ లో వన్ అండ్ ఓన్లీ ప్రియాంక...సోనియా...రాహుల్ డౌట్

దేశంలో ఓల్డెస్ట్ పార్టీగా కాంగ్రెస్ ఉంది. అలాంటి కాంగ్రెస్ నుంచి ఇపుడు గాంధీల వారసులుగా ఎవరు ముందు వరసలో ఉన్నారు అంటే ప్రియాంకా గాంధీ అనే అంటున్నారు 2024 ఎన్నికలు ఎంతో దూరంలో లేవు.

By:  Tupaki Desk   |   22 July 2023 1:47 PM GMT
కాంగ్రెస్ లో వన్ అండ్ ఓన్లీ ప్రియాంక...సోనియా...రాహుల్ డౌట్
X

దేశంలో ఓల్డెస్ట్ పార్టీగా కాంగ్రెస్ ఉంది. అలాంటి కాంగ్రెస్ నుంచి ఇపుడు గాంధీల వారసులుగా ఎవరు ముందు వరసలో ఉన్నారు అంటే ప్రియాంకా గాంధీ అనే అంటున్నారు 2024 ఎన్నికలు ఎంతో దూరంలో లేవు. అయితే ఆ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఏకైక ఆప్షన్ ఉన్న గాంధీ వారసురాలుగా గా ప్రియాంక మాత్రమే కనిపిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీలో చూసుకుంటే ఎన్నడూ చూడని పరిణామం ఇది అని అంటున్నారు. ఈ దేశానికి తొలి ప్రధాని అయిన పండిట్ నెహ్రూ హయాంలో ఇందిరా గాంధీ కూడా ఎంపీగా ఉండేవారు. ఆమె హయాంలో రాజీవ్ గాంధీ ఎంపీ అయ్యారు. ఇక సోనియా నాయకత్వం వచ్చాక ఆమెతో పాటు కుమారుడు రాహుల్ గాంధీ కూడా ఎంపీగా ఉంటున్నారు. ప్రస్తుత సభలోనూ రాహుల్ నిన్నటి దాకా ఎంపీనే.

అయితే ఆయన మోడీలంతా అంటూ చేసిన అనుచిత కామెంట్స్ మీద కోర్టు తీర్పుల నేపధ్యంలో ఆరేళ్ళ పాటు ఎంపీగా పోటీ చేయడానికి అవకాశం ఉండదు అని అంటున్నారు. సుప్రీం కోర్టులో ఏమైనా ఊరట కలిగిస్తే మాత్రం రాహుల్ గాంధీ 2024 ఎన్నికల్లో పోటీ చేస్తారు. లేకపోతే లేదు.

ఇక ఆయన 2019లో తన తండ్రి నాటి నుంచి అట్టిపెట్టుకుని వస్తున్న అమేధీ సీటులో ఫస్ట్ టైం ఓడిపోయారు. ఆయన కేరళ నుంచి గెలిచారు. ఇపుడు రాహుల్ పోటీ చేస్తారు అనుకున్నా మళ్లీ కేరళ సీటుకు వెళ్తారా లేక అమేధీ తమ గాంధీల సీటు అని మరోమారు పోటీ చేస్తారా అన్నది ఒక చర్చగా ఉంది.

ఇంకో వైపు చూసుకుంటే సోనియా గాంధీ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయరని తెలుస్తోంది. ఆమె వయసు ఏడున్నర పదులు, దాంతో పాటు అనేక అనారోగ్య సమస్యల వల్ల ఆమె ప్రత్యక్ష ఎన్నికలలో పోటీకి దూరంగా ఉండాలని చూస్తున్నారు. ఇక ఆమె రాజకీయాల్లో మాత్రం కొనసాగుతారు అని అంటున్నారు.

ఆమెను రాజ్యసభకు పంపాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. ఈ మేరకు కర్నాటక సీఎం సిద్ధరామయ్య ప్రతిపాదించారు. కర్నాటకలో కాంగ్రెస్ 137 సీట్లలో గెలిచి అజేయంగా ఉంది. మొత్తం అయిదు రాజ్యసభ సీట్లను వచ్చే ఏడాది ఏప్రిల్ లో గెలుచుకునే అవకాశం ఉంది. దాంతో సోనియా గాంధీని రాజ్యసభకు వెళ్లమని తామే పంపుతామని సిద్ధరామయ్య కోరారని అంటున్నారు. ఆమె ఓకే అంటే పెద్దల సభలో అడుగుపెడతారు.

ఇంకో వైపు చూస్తే సోనియా గాంధీ ఉత్తర ప్రదేశ్ లోని రాయబరేలీ సీటు నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి అక్కడ నుంచి ప్రియాంకా గాంధీ పోటీ చేస్తారని అంటున్నారు. ఆమె తన తల్లి సీటులో ఆమె వారసురాలిగా బరిలోకి దిగితారు అని అంటున్నారు. నిజానికి 2019 ఎన్నికలలోనే తల్లి సోనియా గాంధీకి ప్రియాంకా గాంధీ ప్రచారం చేశారు. తరచూ ఆమె రాయబరేలీలో పర్యటనలు చేస్తూ ఉంటారు.

దీంతో ప్రియాంకా అక్కడ నుంచి పోటీ చేస్తే సులువుగా గెలుస్తారు అని అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే సోనియా రాజ్యసభకు వెళ్తానంటే ఓకే. లేకపోతే ఆమె ఎంపీగా ఇక కనిపించరు. సుప్రీం కోర్టులో ఊరట వస్తే రాహుల్ పోటీకి అవకశం ఉంటుంది. అలా కనుక కాకపోతే గాంధీల వారసురాలిగా ఏకైన ఆప్షన్ గా ప్రియాంకా గాంధీయే ఈసారి హోల్ మొతం ఫ్యామిలీ తరఫున పోటీ చేస్తారు అని అంటున్నారు. ఇది నిజంగా గాంధీల వంశలో హాటెస్ట్ టాపిక్ మాత్రమే కాదు రాజకీయంగా అతి పెద్ద చర్చగానూ ముందు ముందు ఉండబోతోంది.