Begin typing your search above and press return to search.

వరల్డ్ వైడ్ విండోస్ సేవల్లో సమస్య... తెరపైకి పలు సమస్యలు!

ఇందులో భాగంగా... వరల్డ్ వైడ్ పలువురు యూజర్లకు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ కనిపించింది.

By:  Tupaki Desk   |   19 July 2024 8:51 AM GMT
వరల్డ్  వైడ్  విండోస్  సేవల్లో సమస్య... తెరపైకి పలు సమస్యలు!
X

ప్రపంచ వ్యాప్తంగా విండోస్ సేవలకు అంతరాయం కలిగింది. మైక్రోసాఫ్ట్ సర్వర్లు నిలిచిపోయాయి. దీని కారణంగా బ్యాంకుల, ప్రభుత్వ సేవల నుంచి విమానయాన సంస్థల సర్వీస్ వరకూ అంతరాయం ఏర్పడిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇండిగో, అకాసా, స్పైస్ జెట్ సహా పలు విమానయాన సంస్థలు ఇబ్బంది పడుతున్నాయని చెబుతున్నారు. ఫలితంగా పెద్ద సంఖ్యలో ప్రజలు ఇబ్బందుల్లో పడ్డారు!

అవును... మైక్రోసాఫ్ట్ విండోస్ లో టెక్నికల్ ప్రాబ్లం తలెత్తింది. ఇందులో భాగంగా... వరల్డ్ వైడ్ పలువురు యూజర్లకు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ కనిపించింది. పీసీ / ల్యాప్ ట్యాప్ స్క్రీన్ లపై ఈ ఎర్రర్ కనిపించిన అనంతరం సిస్టం రీస్టార్ట్ అవుతోందంట. దీంతో... ఈ సమస్యను ఎదుర్కొన్న యూజర్లు ఎక్స్ వేదికగా ఈ సమస్యను తెరపైకి తెస్తూ పోస్టులు పెడుతున్నారు.

భారత్ సహా అమెరికా, ఆస్ట్రేలియాలోనూ ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. దీంతో... ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు బ్యాంకులు, విమానయాన సంస్థలు, స్టాక్ ఎక్స్చేంజ్ కు సమస్యలు వచ్చాయని అంటున్నారు. ఇందులో ప్రధానంగా ప్రపంచ వ్యాప్తంగా విమాన సర్వీసులకు ఇబ్బంది ఏర్పడిందని ఆంటున్నారు. ఫలితంగా... క్యాన్సిలేషన్స్ ఎక్కువగా వస్తున్నాయని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ప్రధానంగా పలు విమానయాన సంస్థలు ఎక్స్ వేదికగా పలు పోస్టులు పెడుతున్నాయి. ఇందులో భాగంగా... మైక్రోసాఫ్ట్ లో తలెత్తిన అంతరాయం వల్ల బుక్కింగ్, చెక్-ఇన్ సేవల్లో అంతరాయం ఏర్పడొచ్చని వెల్లడించాయి! ఈ సందర్భంగా పలువురు ఇండివిడ్యువల్ వినియోగదారులు కూడా ఈ సమస్య ఫలితంగా ఫేస్ చేసిన ఇబ్బందులను ఎక్స్ లో పంచుకుంటున్నారు.