ప్రొద్దుటూరు కాంట్రాక్టర్ బెజవాడలో క్రిష్ణలో దూకి సూసైడ్
గతానికి భిన్నంగా ఈసారి ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత ఆత్మహత్యలు చేసుకోవటం ఎక్కువైంది
By: Tupaki Desk | 12 Jun 2024 4:23 AM GMTగతానికి భిన్నంగా ఈసారి ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత ఆత్మహత్యలు చేసుకోవటం ఎక్కువైంది. ఇందులో ఆర్థిక అంశాలు ఉండటం ఆందోళన కలిగించే అంశం. వైసీపీ తరఫున భారీగా పందేలు కాసి తీవ్రంగా నష్టపోయిన ఒక ప్రొద్దుటూరు వ్యాపారి తాజాగా బెజవాడలో క్రిష్ణా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న వైనం షాకింగ్ గా మారింది. ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని పెద్ద ఎత్తున పందేలు కాయటం.. పార్టీ ఓడిపోయిన నేపథ్యంలో తీవ్రమైన ఒత్తిళ్ల మధ్య మరో మార్గం లేక ఆత్మహత్యకు పాల్పడినట్లుగా భావిస్తున్నారు. ఆయన మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన సుబ్బారావు (52) కాంట్రాక్టర్ గా వ్యవహరిస్తూ పనులు చేయిస్తూ ఉంటారు. బలమైన ఆర్థిక నేపథ్యంలో.. రాజకీయ సంబంధాలు ఆయనకు ఎక్కువే. మైదుకూరు రోడ్డులోని రోడ్డు విస్తరణ పనులు ఆయన చేసినవే అని చెబుతున్నారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన మూడు రోజుల తర్వాత నుంచి ఆయన ఆచూకీ లేకుండా పోయింది. కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తే ఎత్తట్లేదు. ఈ నెల 7 మధ్యాహ్నం వేళలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన ఆ తర్వాత నుంచి అందుబాటులోకిరావట్లేదు.ఎక్కడ ఉన్నారన్న విషయాన్ని కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వలేదు.
దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఇదిలా ఉంటే మంగళవారం బెజవాడలోని క్రిష్ణా బ్యారేజీలో డెడ్ బాడీని గుర్తించారు. దాన్ని పరిశీలించగా.. తన పేరుసుబ్బారావు అని.. తమది ప్రొద్దుటూరుగా పేరర్కొంటూ తన మరణ సమాచారాన్ని తెలియజేయాల్సిందిగా కొన్ని నెంబర్లు ఇచ్చారు. అతను రాసుకున్న చీటిలో ఉన్న ఫోన్ నెంబర్లలో ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి బావమరిది బంగారు మునిరెడ్డితోపాటు కుటుంబసభ్యుల ఫోన్ నెంబర్లు ఉన్నాయి.
దీంతో సుబ్బారావు సూసైడ్ చేసుకున్న సమచారాన్ని వారి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఆత్మహత్య ఉదంతంపై విచారణ చేపట్టారు. ఇటీవల ఎన్నికల నేపథ్యంలో ప్రొద్దుటూరులో వైసీపీ గెలుస్తుందని కోట్లాది రూపాయిల మేర పందేలు కాయటంతో పాటు.. తనకు పరిచయం ఉన్న వ్యక్తుల వద్ద నుంచి భారీగా డబ్బుల్ని అప్పుగా తీసుకొచ్చి నేతలకు అందించినట్లుగా చెబుతున్నారు.
ఆయన పందేలు కాసిన వైసీపీ ఓటమిపాలు కావటంతో.. పందేలు కాసిన వారి నుంచి ఆయనకు తీవ్రమైనఒత్తిడి పెరిగింది. అదేసమయంలో ఆయనకు రావాల్సిన డబ్బులు మాత్రం రాని పరిస్థితి. కోట్లది రూపాయిలు ఆయనకు ఆగినట్లుగా చెబుతున్నారు. దీంతో.. పందేలు గెలిచిన వారి నుంచి పెరిగి ఒత్తిడితో ఏం చేయాలో పాలుపోక.. ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. సూసైడ్ చేసుకున్న సుబ్బారావుకు భార్య.. ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఆయన సూసైడ్ సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ప్రొద్దుటూరు పట్టణంలో ఈ ఉదంతం పెను సంచలనంగా మారింది.