'సీజ్ ది షిప్' మూవీ టైటిల్ ఫిక్స్... నిర్మాత ఆసక్తికర నిర్ణయం!
ఆ సంగతి అలా ఉంటే... 'సీజ్ ది షిప్' విషయంలో ఓ ఆసక్తికర పరిణామం తెరపైకి వచ్చింది.
By: Tupaki Desk | 4 Dec 2024 11:05 AM GMTకాకినాడలోని యాంకరేజ్ పోర్టులో రేషన్ బియ్యం నిల్వచేసినట్లు చెబుతున్న స్టెల్లా ఎల్ పనామా నౌక విషయంలో పవన్ కల్యాణ్ తీసుకున్న నిర్ణయం "సీజ్ ది షిప్" తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఒక్క పదం ట్విట్టర్ లో ట్రెండింగ్ లో నిలుస్తూ, నెట్టింట సందడి చేసింది. ఒక పక్క వైరల్ షేరింగ్లు, మరికొన్ని ట్రోలింగ్స్ తో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
మరోపక్క... స్వయంగా ఉప ముఖ్యమంత్రి ఆదేశించినప్పటికీ అధికారులు ఆ షిప్ ను ఇంకా ఎందుకు సీజ్ చేయలేదు? అనే చర్చ తెరపైకి వచ్చింది. అసలు మరో దేశానికి చెందిన షిప్ ను సీజ్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఉంటుందా.. ఇలా పోర్టుల్లోని నౌకలు సీజ్ చేసే అధికారం మంత్రులకు, ప్రజాప్రతినిధులకు ఉంటుందా అనే ప్రశ్నలు వైరల్ గా మారాయి.
మరోవైపు రేషన్ బియ్యం నిల్వ చేసినట్లు చెబుతున్న స్టెల్లా ఎన్ పనామా షిప్ లో మరోసారి తనిఖీలు చేపట్టారు అధికారులు. దీని కోసం కస్టమ్స్, పోర్టు, పౌరసరఫరాలు, పోలీసు, రెవెన్యూ అధికారులతో ఓ ప్రత్యేక బృందం సముద్రంలోకి వెళ్లింది. ఆ సంగతి అలా ఉంటే... 'సీజ్ ది షిప్' విషయంలో ఓ ఆసక్తికర పరిణామం తెరపైకి వచ్చింది.
అవును... ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నోటి వెంట వచ్చిన మాట "సీజ్ ది షిప్" తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఒక్క పదం నెట్టింట ట్రెండింగ్ గా మారింది. ఈ సమయంలో ఓ ఆసక్తికర పరిణామం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... తాజాగా "సీజ్ ది షిప్" అంటూ పవన్ నోటి వెంట వచ్చిన మాట సినిమా టైటిల్ గా మారింది.
ఇందులో భాగంగా... తాజాగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో ఓ సినీ నిర్మాత రూ.1,100 చెల్లించి "సీజ్ ది షిప్" అనే టైటిల్ ను రిజిస్టర్ చేసుకున్నారు. దీంతో... ఈ విషయం ఆసక్తికరంగా మారింది. మరి భవిష్యత్తులో ఈ టైటిల్ పై ఇలాంటి నేపథ్యంలోనే సినిమా వస్తుందా.. లేక, కథతో సంబంధం లేకుండానే ఈ ట్రెండింగ్ టైటిల్ ని వాడేస్తారా అనేది వేచి చూడాలి.