Begin typing your search above and press return to search.

ఇండస్ట్రీ నుంచి మరో వాయిస్... కృష్ణ తమ్ముడి కీలక వ్యాఖ్యలు!

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టై ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   20 Sep 2023 10:00 AM GMT
ఇండస్ట్రీ నుంచి మరో వాయిస్... కృష్ణ తమ్ముడి కీలక వ్యాఖ్యలు!
X

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టై ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన అరెస్టు ఒకెత్తు అయితే... ఆయన అరెస్టుపై టాలీవుడ్ జనాల స్పందనపై జరుగుతున్న చర్చ మరో ఎత్తు అన్నా అతిశయోక్తి కాదన్నట్లుగా మారిపోయింది పరిస్థితి

అవును... స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న నేపథ్యంలో... టాలీవుడ్ జనాలు, స్టార్ హీరోలు స్పందించడం లేదనే చర్చ మొదలైంది. ఎందుకు స్పందించాలనే కామెంట్లు అవతలివైపు నుంచి అంతే ఫాస్ట్ గా వస్తున్నాయని తెలుస్తుంది. ఈ సమయంలో సూపర్ స్టార్ కృష్ణ తమ్ముడు ప్రముఖ నిర్మాత ఆదిశేషగిరిరావు స్పందించారు.

చంద్రబాబు అరెస్ట్ పై తాజాగా దివంగ‌త సూప‌ర్‌ స్టార్ కృష్ణ త‌మ్ముడు, నిర్మాత ఆదిశేష‌గిరిరావు రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా బాబుకు మద్దతుగా నిలిచారు. రాజ‌మండ్రిలో చంద్రబాబు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వరిని ఆయ‌న ప‌రామ‌ర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంపై విమ‌ర్శలు గుప్పించారు.

ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ పాల‌న‌లో కొత్త త‌ర‌హా రాజ‌కీయాలు చూస్తున్నట్టు చెప్పుకొచ్చారు. విద్వేష రాజ‌కీయాలు మంచిది కాద‌ని హితవు పలికారు. ఇదే సమయంలో... గ‌తంలో చంద్రబాబునాయుడు, వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డిల ప‌రిపాల‌న‌ను చూశాన‌ని చెప్పిన ఆయన... ముఖ్యమంత్రులుగా వాళ్లిద్దరి వ్యవ‌హార శైలుల్ని తాను గ‌మ‌నించాన‌ని అన్నారు.

ముఖ్యమంత్రులుగా వాళ్లిద్దరూ ఎప్పుడూ క‌క్షపూరిత రాజ‌కీయాల‌కు పాల్పడ‌లేద‌ని.. అయితే, జ‌గ‌న్ పాల‌న‌లో అలాంటివి చూస్తున్నాన‌ని అన్నారు. ఇదే సమయంలో... పోలీసులు ఏక‌ప‌క్షంగా వ్యవ‌హ‌రించ‌డం ప్రజాస్వామ్యానికి మంచిది కాద‌ని నిర్మాత్ర ఆదిశేషగిరి రావు.. చంద్రబాబు అరెస్ట్ పై రియాక్ట్ అయ్యారు.

కాగా... చంద్రబాబు అరెస్ట్ పై ఇప్పటివరకూ దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాతలు నట్టికుమార్, అశ్వనీదత్, కేఎస్ రామారావు, బండ్ల గణేష్ లు ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో రాజకీయాలు వేరు, సినిమా ఇండస్ట్రీ వేరు అంటూ నిర్మాత సురేష్ బాబు రియాక్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఆదిశేషగిరి రావు.. చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడారు.