అమ్మ-కొడుక్కి, భార్య-భర్తకు, కొడుకు-అమ్మకు అప్పులు: అఫిడవిట్ సిత్రాలు!
అసలు కడుపున పుట్టిన కొడుకు నుంచి ఏ అమ్మ అయినా.. అప్పు చేసిన విషయం తెలుసా?
By: Tupaki Desk | 23 April 2024 1:30 PM GMTఅమ్మ ఎక్కడైనా కొడుక్కి అప్పు ఇస్తుందా? దానికి వడ్డీ తీసుకుంటుందా? భార్య.. ఎక్కడైనా భర్తకు అప్పు ఇచ్చిన సంగతులు ఎవరికైనా తెలుసా? ఎప్పుడైనా విన్నామా?
+ కొడుకు అమ్మకు అప్పు ఇచ్చారంటే నమ్ముతారా? అసలు కడుపున పుట్టిన కొడుకు నుంచి ఏ అమ్మ అయినా.. అప్పు చేసిన విషయం తెలుసా?
+ అత్త.. అల్లుడికి అప్పు ఇచ్చినట్టు ఎప్పుడైనా విన్నారా? ఎన్నడైనా కన్నారా?
+ భర్తకు చేతినిండా పని.. భార్య మాత్రం ఇంట్లోనే ఉంటుంది. కానీ.. ఆదాయంలో మాత్రం భార్య భర్తను మించిపోయి ఉంటుంది.. ఇదేదో కల్పితం కాదు.. వాస్తవం.!
+ కష్టపడి కట్టుకున్న ఇంట్లో అద్దెకు ఉంటున్న యజమానులను ఎప్పుడైనా చూశారా?
+ భార్యకు 2 కార్లు.. భర్తకు మోటార్ బైక్ మాత్రమే ఉండడం.. ఆయన ఎక్కడికి వెళ్లాలన్నా అద్దె వాహనాన్ని వినియోగించడం ఎవరి నోటినుంచి అయినా.. విన్నారా?
+ వందల కోట్ల ఆస్తులు ఉన్నా.. కనీసం ఒక్క చిన్నకారు కూడా లేని కుటుంబాలు ఉన్నాయని తెలుసా?
ఇలాంటి చిత్ర, విచిత్రమైన సంగతులు కావాలంటే.. కళ్లు తెరుచుకునేలా చదువుకోవాలంటే.. ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ఉన్న అఫిడవిట్లను చదువుకుంటే.. ఏ రేంజ్‌లో కావాలంటే ఆ రేంజ్‌లో కళ్లు తెరుచుకుంటా యి. ఎందుకంటే.. పైన చెప్పుకొన్న వాటిలో సింహభాగం సంగతులు.. మన ఏపీలోనే చోటు చేసుకున్నాయి.
+ కోట్లకు పడగలెత్తిన సీఎం జగన్ కుటుంబానికి ఒక్క చిన్నకారు కూడా లేదట!. వైఎస్ భారతికి 200 కోట్ల ఆస్తి.. 2 కిలోల బంగారం ఉన్నా.. ఆమెకు సొంతగా ఫోన్‌లేదట!
+ కోటీశ్వరురాలైన షర్మిల.. తన అన్న, వదినల నుంచే అప్పులు తీసుకున్నారు. అంతేకాదు.. తన తల్లి విజయమ్మ నుంచి తన భర్త రూ. 12 కోట్లు అప్పు గా తీసుకున్నారు. ఇదే సమయంలో తన భర్త అనిల్ నుంచి తాను అప్పుగా తీసుకుంది. వీరిద్దరిదీ ఇలా ఉంటే.. విజయమ్మ దగ్గర షర్మిల అప్పు చేసి.. మళ్లీ తన భర్త అనిల్ అప్పు తీర్చింది.
+ నారాలోకేష్ ఆస్తులు.. 520 కోట్లుగా చూపించారు. అంతేకాదు.. ఈయన తన తల్లి నారా భువనేశ్వరికి రూ.1.5 కోట్లు అప్పు ఇచ్చారు. ఏపీలో సొంత ఇల్లు లేదు. అంతేకాదు.. కారు కూడా లేదు. ఎప్పుడో 17 ఏళ్ల కిందట కొన్న కారు డొక్కు కావడంతో మూలన పడేశారు. ఎక్కడికైనా ఫ్యామిలీతో వెళ్లాలంటే.. అద్దె కార్లలో తిరుతారట.
+ నారా చంద్రబాబు, భువనేశ్వరి పేరుతో 800 కోట్లపైగా ఆస్తులు ఉన్నాయి. వీటిలో చంద్రబాబుకు 1.20 కోట్లు మాత్రమే ఉన్నాయి. మిగిలినవి భువనేశ్వరి పేరుతో ఉన్నాయి. భువనేశ్వరి చంద్రబాబు కు అప్పుగా కోటిన్నర ఇచ్చారు. అంటే భర్తకు భార్య అప్పు. ఇలా.. చిత్రమైన సంగతులు చాలానే ఉన్నాయి.