Begin typing your search above and press return to search.

బస్సుల్లో సీట్లు లేకపోవడంతో పురుషుల ధర్నా.. ఎక్కడంటే?

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఓ వ్యక్తి ఆందోళనకు దిగాడు. బస్సులో పురుషులకు ఒక్క సీటు కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

By:  Tupaki Desk   |   16 Dec 2023 11:30 PM GMT
బస్సుల్లో సీట్లు లేకపోవడంతో పురుషుల ధర్నా.. ఎక్కడంటే?
X

కాంగ్రెస్ ప్రభుత్వం మొట్ట మొదటి పథకంపై మెల్ల మెల్లగా నిరసనలు మొదలవుతున్నాయి. 'మహాలక్ష్మి'లో భాగంగా సోనియా గాంధీ పుట్టిన రోజున మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని బాగా వినియోగించుకుంటున్నారు. దీంతో ప్రైవేట్ వాహనాలైన ఆటోలు, టాక్సీలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఇలాంటి నిరసనలను ఎవరూ పట్టించుకోకున్నా.. ఇప్పుడు నిరసనలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది.

ప్రయాణం ఫ్రీ కాబట్టి ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఎక్కువ సంఖ్యలో జర్నీ చేస్తున్నారు. ఏ కొంచెం దూరం వెళ్లాలన్నా ఆర్టీసీలోనే వెళ్తున్నారు. గతంలో కార్లు, టాక్సీలు, ఆటోలను ఆశ్రయించిన మహిళలు ఇప్పుడు ఫ్రీ జర్నీకి అలవాటు పడి ఆర్టీసీలో ప్రయాణం చేస్తున్నారు. దీంతో బస్సుల్లో లెక్కకు మించి మహిళలు ఎక్కుతున్నారు. దీంతో పురుషులకు సీట్లు ఉండడం లేదు.

బస్సుల్లో మహిళల కోసం రిజర్వేషన్ సీట్లు ఉంటాయి. అందులో పురుషులు కూర్చుంటే లేపడం వారు హక్కుగా భావించే వారు. కానీ మగవారు ఇతర దివ్యాంగులు, వృద్ధుల సీట్లలో ఆడవారు కూర్చుంటే వారిని వారించేవారు కాదు. దీంతో బస్సుల్లోని మహిళల సీట్లు, పురుషుల సీట్లను ఆడవారే ఆక్రమిస్తున్నారు. కూర్చునేందుకు సీట్లు లేకపోవడంతో మగవారు నిరసనలకు దిగుతున్నారు.

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఓ వ్యక్తి ఆందోళనకు దిగాడు. బస్సులో పురుషులకు ఒక్క సీటు కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలా సీట్లన్నీ మహిళలు ఆక్రమిస్తే తాము ఎలా జర్నీ చేయాలని ప్రశ్నించాడు. బస్సుకు అడ్డంగా నిలబడి నిరసన తెలిపాడు. ఉచిత ప్రయాణంను ఎవరూ వ్యతిరేకించరని.. కానీ పురుషులకు సీట్లు ఇవ్వకపోవడంపై మండిపడ్డాడు.

ఉచిత ప్రయాణం ప్రారంభోత్సవ సమయంలో సోషల్ మీడియాలో ఈ విషయంపైనే తీవ్రంగా చర్చ జరిగింది. బస్సుల్లో సీట్లు లేకుండాపోతాయని, దీంతో పురుషులు సీట్ల కోసం ఆగ్రహాలు తెలిపే రోజు వస్తుందని మీమ్స్ వచ్చాయి. ఆ సమయంలో ఇవి బాగా వైరల్ అయ్యాయి. ఏది ఏమైనా సీట్ల కోసం గతంలో మహిళలు కొట్టుకుంటే ఈ సారి అది పురుషుల వంతు అయ్యింది.