Begin typing your search above and press return to search.

ఆఫీసుల్లో బిజీ బిజీ బ్యాచ్... తెరపైకి ఆసక్తికర విషయం!

ఈ సందర్భంగా "బిజీ బ్రేగింగ్/ స్ట్రెస్ బ్రేగింగ్" అనే కొత్త విషయం తెరపైకి వచ్చింది.

By:  Tupaki Desk   |   28 May 2024 11:30 PM GMT
ఆఫీసుల్లో బిజీ బిజీ బ్యాచ్... తెరపైకి  ఆసక్తికర విషయం!
X

ఈ తరం ఉద్యోగుల్లో.. ప్రధానంగా కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల్లో ఒత్తిడి అనేది అత్యంత సహజం అని చెబుతుంటారు. ప్రధానంగా ఒత్తిడిని జయించేందుకు కొన్ని ప్రత్యేక వ్యాపకాలు పెట్టుకోవాలని అంటుంటారు. ఈ ఒత్తిడిని జయించని పక్షంలో మానసిక, శరీరక సమస్యలు చుట్టుముడతాయని హెచ్చరిస్తున్నారు. ఈ సందర్భంగా "బిజీ బ్రేగింగ్/ స్ట్రెస్ బ్రేగింగ్" అనే కొత్త విషయం తెరపైకి వచ్చింది.

అవును... ఈ రోజుల్లో పనిచేసే ప్రదేశాల్లో ఒత్తిడి అనేది అత్యంత సహజం అనే సంగతి తెలిసిందే. అయితే కొందరు మాత్రం కావాలనే తమ మీద వర్క్ ఓవర్ లోడ్ వేసుకుని.. తాము అసలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నామని.. ఫుల్ బిజీగా ఉన్నామని చెబుతుంటారు! దీన్ని స్ట్రెస్ బ్రేగింగ్ /బిజీ బ్రేగింగ్ అంటారు. తాజాగా ఈ సమస్య.. దీని వల్ల సదరు బిజీ పర్సన్స్ కి ఎదురయ్యే సమస్యలపై సైకాలజిస్టులు ఆసక్తికర విషయాలు వెల్లడిస్తున్నారు!

నేటి బిజీ బిజీ కార్పొరేట్ ప్రపంచంలో చాలా మంది ఉద్యోగులు పనిలో నిమగ్నమై ఉన్నాట్లు గొప్పగా చెప్పుకుంటారు.. ఫలితంగా పనిలో వారి అంకితభావం, వృత్తి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుందని భావిస్తారు! అయితే.. ఈ "గొప్పగా చెప్పుకోనే ఒత్తిడి" వల్ల ఎదురుదెబ్బలు తగులుతాయని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో భాగంగా... సహోద్యోగులకు ఇలాంటివారిపై తక్కువ ఇష్టం కలగడంతోపాటు.. వీరు తక్కువ సమర్థులుగా కనిపిస్తారని అంటున్నారు.

పర్సనల్ సైకాలజీ జర్నల్‌ లో ఇటీవలి ప్రచురితమైన అధ్యయనంలో... తాము ఎంతో చిత్తడిగా, మరెంతో బిజీగా ఉన్నామంటూ, తరచు దానిగురించి మాట్లాడే ఉద్యోగులను "బిజీ బ్రేగింగ్" అని పిలుస్తారని.. వారి సహచరులు వారిని ప్రతికూలంగా చూస్తారని చెబుతున్నారు. "పెర్ఫార్మేటివ్ యాంగ్జయిటీ"గా పిలువబడే ఈ వ్యవహారం పని ప్రదేశాలలో సర్వసాధారణంగా మారింది కానీ ఇది ఆశించిన ఫలితాన్ని కలిగి ఉండదని వెల్లడిస్తున్నారు.