అసెంబ్లీ కమిటీల ఎన్నిక కౌంటింగ్ పూర్తి... కొత్త సభ్యులు వీరే!
పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ), ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ, అంచనాల కమిటీల ఎన్నిక కౌంటింగ్ పూర్తయ్యింది.
By: Tupaki Desk | 22 Nov 2024 1:52 PM GMTపబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ), ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ, అంచనాల కమిటీల ఎన్నిక కౌంటింగ్ పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఎన్నికల కమిటీల కొత్త సభ్యులను అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) నూతన ఛైర్మన్ గా జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఎన్నికయ్యారు.
అవును... ఏపీ అసెంబ్లీలో కమీటీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తవ్వడంతో స్పీకర్ కొత్త సభ్యులను ప్రకటించారు. ఇక.. ఈ ఎన్నికల్లో కూటమి నేతలు పోటీల్లో పాల్గొని, ఓట్లు వేయగా.. తగిన సంఖ్యా బలం లేదని చెబుతూ సంప్రదాయానికి విరుద్ధంగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆరోపిస్తూ వైసీపీ ఈ ఎన్నికలను బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే.
పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) సభ్యులు:
నక్కా ఆనందబాబు
అరిమిల్లి రాధాకృష్ణ
అశోక్ రెడ్డి
బూర్ల రామాంజనేయులు
జయనాగేశ్వర్ రెడ్డి
లలిత కుమారి
శ్రీరాం రాజగోపాల్
పులపర్తి రామాంజనేయులు
విష్ణుకుమార్ రాజు
అంచనాల కమిటీ సభ్యులు:
భూమా అఖిలప్రియ
బండారు సత్యానందరావు
వేగుళ్ల జోగేశ్వర రావు
కందుల నారాయణరెడ్డి
మద్దిపాటి వెంకటరాజు
పార్ధసారథి
సునీల్ కుమార్
ఏలూరి సాంబశివరావు
నిమ్మక జయకృష్ణ
ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ:
ఆనందరావు
ఈశ్వర్ రావు
గిడ్డి సత్యనారాయణ
గౌతు శిరీష
కూన రవికుమార్
కుమార్ రాజా
బేబీ నాయన
తెనాలి శ్రావణ్
వసంత కృష్ణప్రసాద్