పులివెందులకు ఉప ఎన్నికలు...కుంభమేళాలో మొక్కులు
పులివెందుల నియోజకవర్గం అంటేనే వైఎస్సార్ ఫ్యామిలీకి కంచుకోట. ప్రస్తుతం అక్కడ నుంచి మాజీ సీఎం వైఎస్ జగన్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు
By: Tupaki Desk | 18 Feb 2025 12:33 PM ISTపులివెందుల నియోజకవర్గం అంటేనే వైఎస్సార్ ఫ్యామిలీకి కంచుకోట. ప్రస్తుతం అక్కడ నుంచి మాజీ సీఎం వైఎస్ జగన్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన అసెంబ్లీకి గైర్ హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ సెషన్ కి కనుక వైసీపీ అధినేత సహా ఎమ్మెల్యేలు రాకపోతే వారి సభ్యత్వం ఆటోమేటిక్ గా రద్దు అవుతుందని రూల్స్ చెబుతూ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ప్రకటిస్తూ వస్తున్నారు.
ఈ క్రమంలో పులివెందులకు ఉప ఎన్నికలు అన్నది సోషల్ మీడియాలో బిగ్ డిబేట్ గా మారిపోతోంది. పులివెందులకు ఉప ఎన్నికలు గతంలో రెండు సందర్భాలలో మాత్రమే వచ్చాయి. అవి కూడా ఒకసారి వైఎస్సార్ లోక్ సభకు వెళ్ళడం వల్ల మరోసారి ఆయన మరణం వల్ల వచ్చాయి. ఈసారి అలా కాదు జగన్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండగానే ఆయన సభ్యత్వం రద్దు చేస్తే వస్తాయని అంటున్నారు.
మరి దీనిని ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు. ఏ విధంగా జనాలు మళ్ళీ జగన్ నే ఎమ్మెల్యేగా గెలిపించుకుంటారు అన్నది ఒక చర్చ అయితే కచ్చితంగా పులివెందులకు ఉప ఎన్నికలు వస్తాయని డిప్యూటీ స్పీకర్ రఘురామ క్రిష్ణం రాజు అంటున్నారు.
ఇక ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభ మేళాకు వెళ్ళారు పులివెందుల టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవి. ఆయన అక్కడ పవిత్ర స్నానాలు ఆచరించారు. దీని మీద ఉప సభాపతి రఘురామ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ పులివెందులలో ఉప ఎన్నికలు రావాలని మొక్కుకో అని ఆయనకు సూచించడం విశేషం.
పులివెందులకు ఉప ఎన్నికలు వస్తే కనుక పార్టీ తరఫున ఎన్నికల ఇంచార్జిగా మీరే రావాలని బీటెక్ రవి రఘురామ ను కోరడం దానికి తాను తప్పకుండా పులివెందుల కు వస్తానని రఘురామ హామీ ఇవ్వడం ఇవన్నీ సోషల్ మీడియాను షేక్ చేసే హాట్ డిస్కషన్ గా మారుతున్నాయి.
మరి ఇంతకీ పులివెందులకు ఉప ఎన్నికలు వస్తాయాన్ పవిత్రమైన గంగా యమునా సరస్వతీ త్రివేణీ సంగమంలో బీటెక్ రవి ఉప ఎన్నికలు రావాలి నేను ఎమ్మెల్యేగా గెలవాలి అని మొక్కుకున్న మొక్కులు తీరుతాయా అన్నది చర్చగా ఉంది.
ఈ నెల 24 నుంచి ఏపీ బడ్జెట్ సెషన్ స్టార్ట్ అవుతోంది. అయితే ఈ సెషన్ కి వైసీపీ అధినేత జగన్ ఆయన పార్టీ ఎమ్మెల్యేలు హాజరవుతారా అన్నది కూడా చూడాల్సి ఉంది అని అంటున్నారు. అయితే జగన్ ఈ సమావేశాలకు హాజరు కావడం లేదని ఒక వైపు అంటున్నారు. ఆయన ప్రతిపక్ష హోదాతో ముడిపెట్టి అసెంబ్లీ సమావేశాలకు రాకుండా దూరం పాటించడం పట్ల సొంత పార్టీలోనూ చర్చ సాగుతొంది.
అదే కూటమికి కూడా బలంగా మారుతోంది. ఏపీలో ఒకేసారి పదకొండు మంది వైసీపీ ఎమ్మెల్యేలను అనర్హులను చేసి ఉప ఎన్నికలు తెచ్చేందుకు కూటమి సర్కార్ చురుకుగా పావులు కదుపుతోందా అన్నది కూడా చర్చకు తావిస్తోంది. మరి వైసీపీ అధినేత ముక్కు సూటిగా ముందుకు పోతే జరితే పర్యవసానాలు ఏమిటి అన్నది కూడా చూడాల్సి ఉంది.
ఉప ఎన్నికలు తెప్పించి వైసీపీని పూర్తిగా ఏపీ పాలిటిక్స్ లో లేకుండా చేయాలన్న ఎత్తుగడల వెనక ఎవరు ఉన్నారు అసలు ఈ ఎత్తుగడలను పసిగట్టి దానికి విరుగుడు మంత్రం వేసే ప్రయత్నం వైసీపీ అధినాయకత్వం చేస్తుందా లేదా అన్నవి ఈ రోజుకీ ప్రశ్నలుగా సందేహాలుగానే ఉన్నాయి. ఏది ఏమైనా కూడా పులివెందుల ఉప ఎన్నిక మాత్రం ఇపుడు హాట్ టాపిక్ గానే ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.