రికార్డ్ స్థాయిలో రేటు... 2 కిలోల పులస ధర ఇదే!
ఈ విషయంలో తాజాగా యానాంలోని చేపను ఒక పులస ప్రియుడు సుమారు 16,000 రూపాయలకు చేపను కొన్నాడు.
By: Tupaki Desk | 24 Aug 2023 2:30 PM GMTచేపలందు పుసల చేప వేరయా... నాన్ వెజ్ ప్రియా నీ జిహ్వానందం వేరయా... అన్నట్లుగా ఉంటుంది పుసల చేప యవ్వారం. మరి ముఖ్యంగా తెలుగు జనాలు.. అందునా గోదావరి జిల్లల్లో పుసల అంటే పడి చచ్చిపోతారని చెప్పినా అతిశయోక్తి కాదేమో. ఈ సమయంలో రికార్డ్ స్థాయిలో పెరిగిన పుసల రేటు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అవును... పులస పులుసు లెక్కే వేరని అంటారు ఆ రుచి చూసినోళ్లు.. నచ్చినోళ్లు. పైగా గోదారి జిల్లాల్లో పులస చేప ప్రిస్టేజ్ ఇష్యూ! ఇంటికొచ్చిన కొత్త అల్లుడికి ఈ చేప కూర వండి పెడితే ఆ లెక్కే వేరు! సంక్రాంతి వేల పందెం కోడి కూర... వర్షాకాలం ముగింపు వేళ పులస పులుసు లెక్కే వేరని అంటారు.
ఈ క్రమంలో తాజాగా రెండు కిలోల అసలు సిసలు పుసల చేప రికార్డ్ ధర పలికింది. అసలు సిసలు పుసల అని అనడానికి కారణం... ఇలస చేపను పులస చేపగా అమ్మేవారు కూడా ఉంటారు. ఇలసకు పులసకు తేడా తెలుసుకునే విషయం కొనేవారిలో ఉండాలి!
తాజాగా కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో రెండు కిలోల ఒరిజినల్ పులస చేప చిక్కింది! దీంతో ఒక మత్సకార మహిళ ఆ చేపను మార్కెట్ లో అమ్మకానికి పెట్టారు. దాంతో జనం ఎగబడ్డారు. ఈలోపు రేటు ఆకాశానికి వెళ్లింది.
గోదావరి జిల్లాలో చేపల విషయానికి వచ్చే సరికి ఆల్ మోస్ట్ అందరూ తగ్గేదేలే అంటారు. ఈ విషయంలో తాజాగా యానాంలోని చేపను ఒక పులస ప్రియుడు సుమారు 16,000 రూపాయలకు చేపను కొన్నాడు. ప్రస్తుతం గోదావరి జిల్లాల్లో ఇది హాట్ టాపిక్ గా మారింది.
సాధారణంగా ప్రతీ యేటా జూన్ సెప్టెంబర్ మధ్యలో గోదావరిలో పులసల గల గల ఉంటుంది. అన్ని చేపలూ నీటి వాటానికి తగ్గట్లుగా పోతే... పులస మాత్రం ప్రవాహానికి ఎదురీదుతుంటుంది. అదే పులస ప్రత్యేకత!
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, టాంజానియా ల నుంచి సముద్ర మార్గంలో నుంచి మన గోదావరిలోకి వస్తోంది. గోదావరిలో కలిసే చోట ఇలా ప్రవాహానికి ఎదురొస్తుంది. ఇందులో భాగంగా ధ్వళేశ్వరం వరకూ వస్తుంది. ఇదే దీని స్పెషాలిటీ. ఈ విషయం తెలిసిన గోదారి జనం పులస అంటే విలవిల్లాడిపోతారు!