పాతిక కిలోల పసిడి ఆభరణాలతో కొండపైకి... ఫ్యామిలీ వీడియో వైరల్!
అవును... మహారాష్ట్రకు చెందిన ఓ కుటుంబం కిలోల కొద్దీ బంగారు ఆభరణాలు ధరించి తిరుమల శ్రీవెంకటేశ్వరుడి దర్శనానికి వచ్చింది.
By: Tupaki Desk | 23 Aug 2024 10:32 AM GMTతిరుమల వెంకన్న దర్శనానికి ప్రతీరోజూ కొన్ని వేల మంది భక్తులు వస్తుంటారు.. వారి మొక్కులు చెల్లించుకుంటుంటారు.. తమ జీవితాలు బాగుచేయమని కోరుకుంటూ ఉంటారు. ఈ సమయంలో తాజాగా ఓ ఫ్యామిలీ మాత్రం భారీ ఎత్తున బంగారు ఆభరణాలు ధరించి, బంగారు పూత పూసిన కారులో తిరుమలకు వచ్చారు.
అవును... మహారాష్ట్రకు చెందిన ఓ కుటుంబం కిలోల కొద్దీ బంగారు ఆభరణాలు ధరించి తిరుమల శ్రీవెంకటేశ్వరుడి దర్శనానికి వచ్చింది. ఇదే సమయంలొ బంగారు పూత పూసిన కారులో రావడం గమనార్హం. ఈ సందర్భంగా శ్రీవాణి ట్రస్టుకు విరాళం ఇచ్చిన ఆ ఫ్యామిలీ మెంబర్స్.. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో వెంకన్నకు మొక్కులు తీర్చుకున్నారు.
వివరాళ్లోకి వెళ్తే... మహారాష్ట్రలోని పూణేకు చెందిన గోల్డ్ మ్యాన్ లు సన్నీ నన వాగ్చోరీ, సంజయ్ దత్తాత్రయ గుజర్, ప్రీతీ సోనీలు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. అయితే వీరు ముగ్గురూ సాధారణ భక్తులులాగా కాకుండా రొటీన్ కి భిన్నంగా కనిపించారు. తమ ఒంటినిండా బంగారం ధరించి శ్వీవెంకటేశ్వరుడిని దర్శించుకున్నారు.
సుమారు 25 కిలోలకు పైగా బంగారు నగలు ధరించి శ్రీవారి ఆలయం ముందు అబ్బుర పరిచారు. ఈ సమయంలో వీరిని చూసిన వెంకన్న దర్శనం కోసం భక్తులు నివెరపోయేలా కనిపించారు. వీరు ఆలయం లోపలా, వెలుపలా అందరి దృష్టినీ ఆకర్షించారు. ఇక వారు వచ్చేందుకు వినియోగించిన కారు సైతం బంగారు వర్ణంతో ఉండటం విశేషం. దానికీ బంగారు పూత పూసినట్లు చెబుతున్నారు.
దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. దర్శనం అనంతరం ఆ ఫ్యామిలీ మెంబర్స్ తిరిగి మహారాష్ట్రకు బయలుదేరారు!!