Begin typing your search above and press return to search.

పుంగ‌నూరు ఎఫెక్ట్‌: కార్య‌క‌ర్త‌లే న‌ష్ట‌పోయేది.. ఏ పార్టీకైనా..!

అయితే.. ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఇటు వైసీపీ అధిష్టానానికి కానీ.. అటు టీడీపీ అధిష్టానానికి కానీ.. కీల‌క నాయ‌కుల‌ కు కానీ.. ఎలాంటి న‌ష్టం ఉండ‌ద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

By:  Tupaki Desk   |   5 Aug 2023 6:22 AM GMT
పుంగ‌నూరు ఎఫెక్ట్‌: కార్య‌క‌ర్త‌లే న‌ష్ట‌పోయేది.. ఏ పార్టీకైనా..!
X

తాజాగా ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా లోని పుంగ‌నూరు నియోజ‌క‌వ‌ర్గంలో త‌లెత్తిన వివాదం.. ఘ‌ర్ష‌ణ‌.. గాలి లోకి కాల్పుల ఉదంతం.. రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించాయి. ఇక‌, పోలీసుల‌ పై రాళ్ల‌తో దాడి.. వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య చోటు చేసుకున్న వివాదం.. తెలిసిందే. అయితే.. ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఇటు వైసీపీ అధిష్టానానికి కానీ.. అటు టీడీపీ అధిష్టానానికి కానీ.. కీల‌క నాయ‌కుల‌ కు కానీ.. ఎలాంటి న‌ష్టం ఉండ‌ద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ప్ర‌స్తుతం జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో ఇరు పార్టీల‌కు జ‌రిగిన న‌ష్టం కంటే కూడా.. నిబంధ‌న‌ల ప్ర‌కారం చూసుకున్న ప్పుడు.. పోలీసుల‌ కు జ‌రిగిన న‌ష్ట‌మే ఎక్కువ‌గా ఉంది. ఫ‌లితంగా డిపార్ట్‌మెంట్ ఈ విష‌యాన్ని చాలా సీరియ‌స్‌ గానే తీసుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలో అధికార పార్టీ స‌హా విప‌క్ష కార్య‌క‌ర్త‌ల‌ ను గ‌త అర్థ రాత్రి నుంచి కూడా.. పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ఇప్ప‌టికే సుమారు 100 మంది వ‌రకు అరెస్టు అయిన‌ట్టు తెలుస్తోంది.

అయితే.. ఈ అరెస్టుల ను కూడా అధికారికంగా చూపించ‌డం లేదు. దీంతో ఆయా పార్టీల కార్య‌క‌ర్త‌ల వ్య‌వ‌హారం.. ఆందోళ‌న‌కు దారితీస్తోంది. పోలీసుల‌ పై దాడి చేసిన వారి పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్న ఎస్పీ ఆదిశ‌గా ఇచ్చిన ఆదేశాల‌తో కార్య‌క‌ర్త‌ల‌ను చిత‌క్కొట్టేయ‌డం ఖాయం. ఇక‌, వారి పై వివిధ సెక్ష‌న్ల కింద కేసులు కూడా న‌మోదు చేస్తారు. వీటిలో తీవ్ర‌మైన సెక్ష‌న్లు కూడా ఉండే అవ‌కాశం ఉంటుంది. మొత్తంగా చూస్తే.. ఇక్కడ కార్య‌క‌ర్త‌ల‌కు భారీ డ్యామేజీ త‌ప్ప‌దు.

అంతేకాదు.. కార్య‌క‌ర్త‌ల భ‌విత‌వ్యం పై కూడా ఇది పెను ప్ర‌భావం చూపిస్తుంది. ఒక్క‌సారి పోలీసు కేసుల్లో ఇరుక్కుంటేనే వారికి ఉద్యోగాలు వ‌చ్చే ప‌రిస్థితిలేదు. ఒక్క ప్ర‌భుత్వ‌మే కాదు.. ప్రైవేటులోనూ పోలీసుల కేసుల‌ కు ప్రాధాన్యం పెరుగుతోంది.

దీనికితోడు విద్యాసంస్థ‌ల్లోనూ చోటు ల‌భించే ఛాన్స్ మిస్ అవుతున్నా రు. సో.. అభిమానం ఉండొచ్చు. కానీ, విచ‌క్ష‌ణ‌లేని అభిమానం.. అంతిమంగా కార్య‌క‌ర్త‌ల జీవితాల‌ను నాశ‌నం చేసే ప‌రిస్థితి తీసుకువ‌స్తుండ‌డ‌మే ప్ర‌జాస్వామ్య వాదుల‌కు ఆవేద‌న క‌లిగిస్తోంది.