Begin typing your search above and press return to search.

మత్తులో తేలి ఆడుతున్న యువత.. డ్రగ్ వలయంలో పంజాబ్..

దేశంలో యువత ప్రగతికి మార్గదర్శకులు కావాలి కానీ మనదేశంలో కొందరు యువతీ యువకులు తెలియని మత్తుకు బానిసలు అవుతున్నారు

By:  Tupaki Desk   |   25 Jun 2024 4:30 PM GMT
మత్తులో తేలి ఆడుతున్న యువత.. డ్రగ్ వలయంలో పంజాబ్..
X

దేశంలో యువత ప్రగతికి మార్గదర్శకులు కావాలి కానీ మనదేశంలో కొందరు యువతీ యువకులు తెలియని మత్తుకు బానిసలు అవుతున్నారు. జీవితంలో ఎంతో సాధించి తమ కెరీర్ లో ముందుకు వెళ్లాల్సిన యువత మత్తుకు బానిసై రోడ్లపై జాంబిల్ల తిరుగుతున్నారు. రోడ్డుపై విచిత్ర ప్రవర్తనతో ఉన్నటువంటి ఒక యువతికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ వీడియో చూసిన ఎవరికైనా దేశం ఎటువైపు వెళుతుంది అన్న బాధ కలగక మానదు. తల్లిదండ్రులు కష్టాలపాలు చేస్తూ.. సమాజానికి సవాలుగా మారుతున్న ఈ మత్తు బానిసలను ఎలా మార్చాలో కూడా ఎవరికి అర్థం కావడం లేదు. మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల ఎంత హాని జరుగుతుంది అన్న విషయాన్ని అటు ప్రభుత్వం, ఇటు స్వచ్ఛంద సంస్థలు అవగాహన కార్యక్రమాల ద్వారా వివరిస్తూనే ఉన్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మత్తుపదార్థాలు ఎలాగో యువత వరకు వెళ్తున్నాయి.

మరి ముఖ్యంగా పంజాబ్ లో ఇటువంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. జాంబిలా విచిత్రంగా ప్రవర్తిస్తున్న ఈ యువతి వీడియో అమృత్సర్, మోహక్పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని జీటీ రోడ్డులో షూట్ చేయడం జరిగింది. ఈ వీడియో వైరల్ కావడంతో మత్తు పదార్థాలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమయ్యింది అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగుతున్నాయి.

పంజాబ్లో పలు ప్రదేశాలలో ఈ డ్రగ్స్ లభ్యమైనట్టు ఇప్పటికే ఎన్నోసార్లు వార్తలు వచ్చాయి. డ్రగ్స్ విషయం ఎత్తిన ప్రతిసారి వెంటనే పంజాబ్ పేరు గుర్తుకు రావడం సాధారణమైపోతోంది. కొన్ని సినిమాలు కూడా పంజాబ్లో జరుగుతున్న ఈ డ్రగ్ రాకెట్స్.. దానికి బలైపోతున్న యువతకు సంబంధించి చిత్రీకరించడం జరిగింది. ఒకపక్క ప్రభుత్వం ఎంతో పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నప్పటికీ యువత మత్తుకు బానిసలు అవుతూనే ఉన్నారు.

వైరల్ అవుతున్న ఈ వీడియో డ్రగ్స్ అరికట్టడంలో విఫలం అవుతున్న పంజా ప్రభుత్వం వైఖరిని తెలియపరుస్తోంది. డ్రగ్స్ కి బానిసైనా ఓ మహిళ రోడ్డుపై నిలబడలేక, చుట్టూ వస్తున్న ప్రయాణికులను పట్టించుకోకుండా వింతగా ప్రవర్తిస్తుంది. రాత్రి సమయంలో, ఏం చేస్తున్నానో కూడా తెలియని స్థితిలో నడిరోడ్డుపై ఇబ్బంది పడుతున్న ఆ అమ్మాయి పరిస్థితి అందరి మనసులను కలిసి వేస్తోంది.

అయితే ఇటువంటి వార్తలు పంజాబ్ గురించి రావడం ఇది తొలిసారి కాకపోవడంతో సోషల్ మీడియాలో ఈ విషయంపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా ఈ వీడియోను బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మంజీందర్ సింగ్ సిర్సా తన 'ఎక్స్' హ్యాండిల్లో షేర్ చేశారు. పంజాబ్ లో డ్రగ్స్ సమస్య ఎంత విపరీతంగా ఉంది అన్న విషయాన్ని ఆయన ఈ వీడియో ద్వారా తెలియపరిచారు.

ఆప్ ప్రభుత్వం ప్రభుత్వం డ్రగ్స్ ను అరికట్టడంలో విఫలం అయింది అంటూ ఆయన పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలలలోనే పంజాబ్ రాష్ట్రాన్ని మత్తుమందు నుంచి విముక్తి చేస్తాము అని ప్రకటించారు. అయితే గెలిచిన తర్వాత ఆ మాటనే విస్మరించారు అని మంజీందర్ సింగ్ సిర్సా వ్యాఖ్యానించారు.