Begin typing your search above and press return to search.

ప్రస్తుతానికి జనసేనతోనే ....పురంధేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు

ఇదే విషయం మీద ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురంధేశ్వరి మీడియాతో మాట్లాడుతూ తాజాగా కొన్ని సంచలన కామెంట్స్ చేశారు. ఏపీలో పొత్తుల విషయం అన్నది బీజేపీ హై కమాండ్ నిర్ణయిస్తుంది అని చెప్పారు.

By:  Tupaki Desk   |   20 Sep 2023 1:40 PM GMT
ప్రస్తుతానికి  జనసేనతోనే ....పురంధేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు
X

ఏపీలో పొత్తు రాజకీయమేంటో కానీ ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ తలపిస్తోంది అని అంటున్నారు. జనసేన బీజేపీకి పొత్తు ఉంది. ఇది అఫీషియల్. ఇదిలా ఉంటే కొత్తగా జనసేన టీడీపీకి పొత్తు ఏర్పడింది. ఇది కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు కాబట్టి ఇది కూడా అఫీషియల్ గానే చూడాలి.

ఇలా రెండు ప్రధాన పార్టీలతో ఒకే సమయంలో పొత్తుల ఉన్న కామన్ పార్టీ ఏదీ అంటే అది జనసేన అనే అంటున్నారు. అయితే జనసేన అధినేత తాము ఇప్పటికీ ఎన్డీయేలో ఉన్నామని అంటున్నారు టీడీపీతో పొత్తులోకి తమ కూటమిలోకి బీజేపీ కూడా రావచ్చు అంటున్నారు.

ఒకవేళ బీజేపీ రాకపోతే ఏమి జరుగుతుంది అన్నది పవన్ కళ్యాణ్ చెప్పడంలేదు, అది వేచి చూడాల్సి ఉంది. ఇక బీజేపీ విషయం తీసుకుంటే వారు కూడా ఒక విషయంలో క్లియర్ గా ఉన్నారు తమకు జనసేనతోనే పొత్తు ఉంది అని అంటున్నారు. ప్రస్తుతానికి అని ఒక మాట జాగ్రత్తగా వాడుతున్నారు.

ఇదే విషయం మీద ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురంధేశ్వరి మీడియాతో మాట్లాడుతూ తాజాగా కొన్ని సంచలన కామెంట్స్ చేశారు. ఏపీలో పొత్తుల విషయం అన్నది బీజేపీ హై కమాండ్ నిర్ణయిస్తుంది అని చెప్పారు. హై కమాండ్ ఏమి చెబితే అదే తమకు ఫైనల్ అన్నారు. తాము జనసేనతో పొత్తులో ఉన్నా ఎన్నికల ముందు మూడు నాలుగు నెలల టైం లో బీజేపీ ఏపీ మీద ఫోకస్ పెట్టి పొత్తుల విషయంలో తన డెసిషన్ ని వెల్లడిస్తుంది అని అంటున్నారు.

అంటే అప్పటికి బీజేపీ కనుక ఆలోచిస్తే టీడీపీతో పొత్తు ఉండవచ్చు అన్న మాట. పవన్ కళ్యాణ్ అయితే తన ఆప్షన్స్ అన్నీ బయటపెట్టేసి టీడీపీకి మద్దతు ఇచ్చారు. కానీ బీజేపీ మాత్రం అన్ని ఆప్షన్స్ ని అలా ఉంచుకుని పొత్తులను ఎన్నికల ముందే ప్రకటిస్తామని చెబుతోంది అని అర్థం చేసుకోవాలి.

ఇలా పురంధేశ్వరి మాట్లాడడం ద్వారా టీడీపీతో పొత్తుల విషయంలో ఆశలను అలా సజీవంగా ఉంచారని అంటున్నారు. అదే విధంగా చూస్తే జనసేన మిత్రపక్షమే అని చెప్పడం కూడా ఆలోచించాల్సిన విషయమే. తమ మిత్రపక్షం మరో పార్టీకి కూడా మిత్రుడు అయింది. ఆ పార్టీతో తమకు ఈ రోజుకీ సంబంధం లేదు అంటూనే జనసేనతో మాత్రమే దోస్తీ అని చెప్పడం అంటే బీజేపీ రాజకీయ తెలివిడినే చూడాలని అంటున్నారు.

ఏది ఏమైనా ఏపీలో పొత్తుల కధ ఒక లెక్కకు రాలేదు అని పురంధేశ్వరి మాటలను బట్టి అర్ధం అవుతోంది. బీజేపీ ఏదో ఒకటి తేల్చేవరకూ ఏపీలో మిగిలిన పార్టీలతో పొత్తులు కూడా సరిగ్గా ఉండే చాన్స్ లేదు అంటున్నారు. ఒక వేళ బీజేపీ టీడీపీతో పొత్తునకు నో అని చెబితే మాత్రం కామ్రేడ్స్ కాంగ్రెస్ ఇలా చాలా పార్టీలు టీడీపీ జనసేన కూటమిలో చేరడానికి రెడీగా ఉన్నాయని అంటున్నారు.

ఇపుడు ఆయా పార్టీలకు కూడా బీజేపీ డెసిషన్ కీలకం కాబోతోంది అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఈ పొత్తుల కధ ఇంకా ఒక కొలిక్కి రాకపోవడం వల్ల ఏపీ రాజకీయాల్లో అయోమయం అలా కొనసాగుతోంది అంటున్నారు.