చిన్నమ్మ ప్రత్యేక పూజలు.. పదవులు ఫలించేనా?
బీజేపీ ఏపీ అధ్యక్షురాలు.. రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఉరఫ్ చిన్నమ్మ ఆలయాల చుట్టూ తిరుగుతున్నారు.
By: Tupaki Desk | 23 Aug 2024 7:02 AM GMTబీజేపీ ఏపీ అధ్యక్షురాలు.. రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఉరఫ్ చిన్నమ్మ ఆలయాల చుట్టూ తిరుగుతున్నారు. ప్రత్యేక పూజలు కూడా చేయించుకుంటున్నారు. కొన్నికొన్ని చోట్లకు రహస్యంగా వెళ్తున్నారు. మరికొన్ని చోట్లకు రహస్యంగా వెళ్లాలని అనుకున్నా.. మీడియాకు ఉప్పందుతోం ది. దీంతో ప్రతినిధులు చుట్టుముడుతున్నారు. ఇటీవల రాజమండ్రి పరిధిలోని మందపల్లి శనైశ్చరాల యంలో ప్రత్యేక పూజలుచేయించుకున్నారు. అయితే.. ఈవిషయాన్ని రహస్యంగా ఉంచారు.
కానీ, రెండు రోజుల తర్వాత విషయం బయటపడింది. ఇక, తాజాగా శ్రావణ శుక్రవారం సందర్భంగా విజ యవాడ దుర్గమ్మ ఆలయానికి విచ్చేశారు. అది కూడా తెల్లవారు జామున 3 గంటలకే ఆలయానికి వచ్చారు. ఆలయంలో తెల్లవారు జామున ప్రత్యేకంగా జరిగే ఖడ్గమాలా పూజ(ఉదయం4-5 మధ్యలో జరుగుతుం ది)లో పురందేశ్వరి పాల్గొని ప్రత్యేకంగా పూజలు చేయించుకున్నారు. ఇది కూడా ముందుగా ఎవరికీ చెప్పలేదు. ఆమె ఆలయానికి వచ్చిన తర్వాత.. పీఆర్‌వో సంబంధిత మీడియా ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు.
దీంతో కొందరు మీడియా ప్రతినిదులు వెళ్లి పురందేశ్వరి ప్రత్యక పూజలను కవర్ చేశారు. అయితే.. ఇలా ఇంత తెల్లవారు జామునే వచ్చి.. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించడం.. మందపల్లిలో రెండు మూడు సార్లు శనైశ్చరుడు ప్రతిష్టించిన శివ లింగానికి అభిషేకం నిర్వహించడం వంటివి ఆసక్తిగా మారాయి. సహజంగా రాజకీయ నేతలు పూజలు చేయించడం కామనే అయినా.. ఇంత పొద్దు పొద్దున్నే జరిగే పూజల్లో పాల్గొని ప్రత్యేకంగా పూజలు చేయించడం వెనుక పురందేశ్వరి ప్లాన్ వేరేగా ఉందనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ.
ప్రస్తుతం ఆమె రాజమండ్రి ఎంపీగా పదేళ్ల తర్వాత.. ఎన్నికయ్యారు. ఈ క్రమంలో కేంద్రంలో మంత్రి పదవిని ఆశించారు. కానీ, రాలేదు. పోనీ.. తత్సమానమైన నామినేటెడ్ పదవి అయినా..దక్కుతుందని ఆశలు పెట్టుకున్నారు. అది కూడా వచ్చే అవకాశం కనిపించడం లేదు. దీంతో ఆమె హర్ట్ అవుతున్నారు. ఇక, ఏపీ బీజేపీ అధ్యక్ష పగ్గాలు చేపట్టి.. మరో రెండు మాసాలకు రెండేళ్లు పూర్తవుతున్నాయి.
ఈ క్రమంలో ఆమెను మారుస్తారనే చర్చ కూడా జరుగుతోంది. దీంతో ఇది కూడా పోతే.. ఆమె కేవలం ఒక ఎంపీగా మిగిలిపోతారు. దీంతో ఆమె ప్రభావం తగ్గుతుంది. ఈ నేపథ్యంలోనే ఆమె పదవుల కోసం.. పూజలు చేస్తున్నారా? అనేది రాజకీయ విశ్లేషకుల చర్చ. మరి ఏమేరకు ఇవి ఫలిస్తాయో చూడాలి.