పురందేశ్వరిగారు `లెక్కలు` సరిచూసుకోవాలేమో!
ఎం దుకంటే.. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ.. ఉచితార్థంగా ఏ రాష్ట్రానికీ నిధులు ఇవ్వదు. పన్నుల్లో వాటాల కింద అందిన మొత్తాలనే తిరిగి చెల్లిస్తుంది.
By: Tupaki Desk | 27 Dec 2023 3:30 PM GMTబీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి తాజాగా ఏపీ సర్కారుపై విరుచుకుపడ్డారు. కేంద్రం పెట్టిన పథకాలను, కేం ద్రం ఇచ్చిన సొమ్మును వైసీపీ వాడేస్తోందని.. జగన్ తన పేరు పెట్టుకుంటున్నారని విమర్శలు గుప్పించా రు. అయితే.. పురందేశ్వరి ఈ విషయంలో లెక్కలు సరిచూసుకోవాలని అంటున్నారు పరిశీలకులు. ఎం దుకంటే.. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ.. ఉచితార్థంగా ఏ రాష్ట్రానికీ నిధులు ఇవ్వదు. పన్నుల్లో వాటాల కింద అందిన మొత్తాలనే తిరిగి చెల్లిస్తుంది.
వాటిలోనూ వివిధ రకాల పేర్లతో కోతలు పెడుతున్న విషయం తెలిసింది. తాజాగా ఏపీకి కేంద్ర పన్నుల వా టా కింద వచ్చిన రూ.2230 కోట్ల రూపాయలను చూపిస్తూ.. పురందేశ్వరి కన్నీళ్లు పెట్టుకున్నంత పనిచే శారు. ఇంకేముంది..కేంద్రం ఇచ్చేసింది.. దీనిని జగన్ బటన్ నొక్కి పంచేశారు! అని వ్యాఖ్యానించారు. అయితే.. ఇది ఏపీకి పన్నుల వాటా కింద రావాల్సిన నిధులే అన్న విషయాన్ని పురందేశ్వరి.. సొంత రాజకీయాల మాటున వదిలి పెట్టేశారు.
ఇక, కేంద్రం పెట్టిన పథకాలను వైసీపీ వాడేస్తోందని చెప్పారు. వాస్తవానికి కేంద్రం పెట్టిన పథకాల్లో రాష్ట్రాలకు వాటా ఉంటుంది. గ్రామీణ సడక్ యోజన అయినా.. ఉపాధి హామీ పథకమే అయినా.. ఇలా ఏదైనా కూడా.. ప్రభుత్వం కూడా వాటా ఇవ్వాలి. అందుకే.. ఎక్కడికక్కడ అన్ని రాష్ట్రాలూ స్థానిక ప్రభుత్వాల ప్రభావం ఉంటుంది. దీనిని పెద్దదిగా చేసి చూడాల్సిన అవసరం లేదు. గతంలో మోడీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలోనూ ఇదే సమస్య వచ్చింది.
కేంద్రంలోని కాంగ్రెస్ నేతలు.. తమప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలను మోడీ సొంతవిగా వాడుకుంటు న్నారనే ప్రచారం చేశారు. అప్పుడు ఇదే బీజేపీ ఎదురు దాడి చేసింది. మీరు పెట్టే పథకాల్లో మాసొమ్ము కూడా ఉందని అప్పట్లో ప్రశ్నించారు. కానీ, రాష్ట్రాల విషయానికి వచ్చే సరికి ఇప్పుడు మాత్రం.. తమ పథకాలు.. అంటూ ప్రచారం చేసుకోవడం.. ప్రభుత్వాలపై విమర్శలు చేయడం కామన్‌గా మారింది.
ఇంతకీ పురందేశ్వరి ఏమన్నారంటే..
కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం స్టిక్కర్లు అంటించుకుంటుందని పురందేశ్వరి పేర్కొన్నారు. రాజమండ్రిలో మెడికల్ కాలేజీ, ఈఎస్ఐ హాస్పిటల్, మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మిస్తున్నది కేంద్ర ప్రభుత్వమేనన్నారు. కేంద్రం జలజీవన్ మిషన్ కింద 6000 కుళాయి కనెక్షన్లు ఇచ్చిందన్నారు. టూరిజం అబివృద్ధి కోసం రాజమండ్రి నుంచి లంబసింగి హైవే వేస్తున్నామన్నారు. కేంద్రం ఇచ్చిన డబ్బులను సీఎం జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి పంచుతున్నారని పురందేశ్వరి పేర్కొన్నారు. దీనిపైనే వైసీపీ కౌంటర్లు ఇస్తోంది.