Begin typing your search above and press return to search.

టీడీపీతో పొత్తు మీద పురంధేశ్వరి సంచలన కామెంట్స్

ఏపీలో పొత్తుల కధ కంచికి చేరడంలేదు. దానికి ఎన్నో వ్యూహాలు వాటి వెనక చిక్కు ముళ్ళూ కూడా ఉన్నాయి. ఏపీలో టీడీపీ కలసి పోటీ చేద్దామని అంటోంది. ఇక బీజేపీతో జనసేన ఉంది. ఎన్డీయే మీటింగ్ ఇటీవల జరిగింతే దానికి జనసేనను ఆహ్వానించారు.

By:  Tupaki Desk   |   23 July 2023 1:23 PM GMT
టీడీపీతో పొత్తు మీద పురంధేశ్వరి సంచలన కామెంట్స్
X

ఏపీలో పొత్తుల కధ కంచికి చేరడంలేదు. దానికి ఎన్నో వ్యూహాలు వాటి వెనక చిక్కు ముళ్ళూ కూడా ఉన్నాయి. ఏపీలో టీడీపీ కలసి పోటీ చేద్దామని అంటోంది. ఇక బీజేపీతో జనసేన ఉంది. ఎన్డీయే మీటింగ్ ఇటీవల జరిగింతే దానికి జనసేనను ఆహ్వానించారు.

ఎన్డీయే వ్యవస్థాపక పార్టీ అయిన టీడీపీని పిలవలేదు. ఇక ఏపీలో వచ్చేది ఎన్డీయే సర్కార్ అని పవన్ అంటున్నారు. బీజేపీ ఏపీ నేతలు మాత్రం తమకు జనసేనతోనే పొత్తు ఉంది అంటున్నారు. అంతే కాదు ఇతర పార్టీలతో పొత్తు విషయం అన్నది హై కమాండ్ చూసుకుంటుంది అని అంటున్నారు.

రాయలసీమ జిల్లాల టూర్ కి ఆదివారం వచ్చిన ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురంధేశ్వరి మీడియాతో మాట్లాడుతూ ఏపీలో తాము ఎవరితో పొత్తులు పెట్టుకోవాలి అన్నది తమ పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుంది అని అన్నారు. జాతీయ నాయకత్వం నిర్ణయం తమకు శిరోధార్యం అని ఆమె చెప్పారు.

అంతే కాదు సరైన సమయంలోనే పొత్తుల మీద ప్రకటన ఉంటుందని అన్నారు. అంటే టీడీపీ విషయంలోనే అని అంటున్నారు. జనసేనతో పొత్తు ఉంది. ఎన్డీయే మీటింగ్ కి కూడా పిలిచారు కాబట్టి ఆ పార్టీతో పొత్తు అని వేరేగా ప్రకటన చేయాల్సిన అవసరం అయితే లేదు. మరి టీడీపీ విషయంలో మాత్రమే ఉంది.

అందువల్ల పురంధేశ్వరి కామెంట్స్ బీజేపీ విషయంలోనే అని అంటున్నారు. 2014 నాటి పొత్తులు 2024లోనూ కుదురుతాయని అంతా అంటున్నారు. దాంతో బీజేపీ ఏపీ నేతలు కూడా ఇదే అంశం మీద ఆచీ తూచీ మాట్లాడుతున్నారు.

ఇంకో వైపు బీజేపీ హై కమాండ్ కూడా పొత్తుల విషయంలో రాష్ట్ర నాయకులు మాట్లాడకుండా ఉండేలా ఆదేశాలు జారీ చేసింది అని అంటున్నారు. దాంతో హై కమాండ్ పొత్తుల విషయం చూసుకుంటుంది అని పురంధేశ్వరి చెబుతున్నారు. టీడీపీ విషయంలో కరెక్ట్ టైం లోనే జాతీయ నాయకత్వం ముందుకు వస్తుంది అన్న మాట.

వైసీపీతో రాజకీయ అవసరాలు పార్లమెంట్ లో మద్దతు వంటివి చూసుకున్న మీదట తాము కోరుకున్న బిల్లులు అన్నీ నెగ్గిన మీదట వైసీపీకి తలాక్ చెప్పేసి టీడీపీని దగ్గరకు తీస్తుందని అంటున్నారు. అంతవరకూ అలా వ్యూహాత్మకంగా సైలెంట్ మెయిన్ టెయిన్ చేస్తుంది అని అంటున్నారు.

దాంతో దగ్గుబాటి పురంధేశ్వరి అన్యాపదేశంగా అన్న మాటలు పూర్తిగా టీడీపీని ఉద్దేశించే ఉన్నాయని అంటున్నారు. బీజేపీ సరైన టైం లోనే పొత్తుల ప్రకటన చేస్తుందని ఆమె అంటున్నారు. మరో వైపు పురంధేశ్వరి ప్రెసిడెంట్ అయ్యాక టీడీపీ మీద ఒక్క విమర్శ కూడా చేయకపోవడాన్ని కూడా అంతా గుర్తు చేస్తున్నారు. మొత్తానికి బీజేపీ టీడీపీల మధ్య గ్యాప్ అంతకంతకు తగ్గుతోంది అని అంటున్నారు.