Begin typing your search above and press return to search.

బీజేపీని షర్మిల ఏకేస్తున్నా పురంధేశ్వరి ఫుల్ సైలెంట్...!

ఏపీలో రాజకీయాలు ఎవరికీ ఒక పట్టాన అర్ధం కావు అన్నది నిజం. ఒకరు ఒక పార్టీలో ఉంటారు. వేరొక పార్టీకి ఉపయోగపడేలా స్టేట్మెంట్స్ ఇస్తూంటారు.

By:  Tupaki Desk   |   30 Jan 2024 10:32 AM GMT
బీజేపీని షర్మిల ఏకేస్తున్నా పురంధేశ్వరి ఫుల్ సైలెంట్...!
X

ఏపీలో రాజకీయాలు ఎవరికీ ఒక పట్టాన అర్ధం కావు అన్నది నిజం. ఒకరు ఒక పార్టీలో ఉంటారు. వేరొక పార్టీకి ఉపయోగపడేలా స్టేట్మెంట్స్ ఇస్తూంటారు. విమర్శించడంలోనూ కొలతలూ కొలమానాలు చూసుకోవడం ఒక్క ఏపీలోనే కనిపిస్తోంది అంటే అతిశయోక్తి కాదు.

ఇక ఏపీలో అన్ని పార్టీలకూ ఒక కామన్ మినిమం ప్రోగ్రాం ఉందని సెటైర్లు ఉన్నారు. కుడి ఎడమల పార్టీలు అయినా జగన్ విషయానికి వచ్చేసరికి మాత్రం ఒక్కటి అవుతూంటారని అంటారు. ఇక బీజేపీకి ఏపీ ప్రెసిడెంట్ గా ఆరు నెలల క్రితం నియమితులైన దగ్గుబాటి పురంధేశ్వరి ఇటీవల కాలంలో మౌనముద్ర లో ఉన్నారా అన్న చర్చ సాగుతోంది.

ఆమె పదవిని స్వీకరించిన వెంటనే జగన్ మీద వైసీపీ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ఆ తరువాత ఆమె కొంత తగ్గారు దానికి కారణం జాతీయ నాయకత్వం ఏపీ పొలిటికల్ రూట్ ఎటో తేల్చకపోవడం మరో వైపు సొంత పార్టీలోనే ఆమె విమర్శల పట్ల పెద్దగా రియాక్షన్ రాకపోవడం.

అసలు బీజేపీ ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకుంటుందా లేదా అన్నది ఒక చర్చగా ఉంది. దాంతో ఏమీ తేలకుండా ఎందుకు అనవసర దూకుడు అనుకున్నారో ఏమో కానీ పురంధేశ్వరి సైలెంట్ అయ్యారని అంటున్నారు. సరే కానీ ఇపుడు ఏపీ కాంగ్రెస్ కి షర్మిల రూపంలో కొత్త నాయకత్వం వచ్చింది. ఆమె వచ్చీ రావడంతోనే జగన్ మీద ధాటీగా విమర్శలు చేస్తున్నారు. అంతే కాదు ఏపీలో టీడీపీ వైసీపీ జనసేనలను కలసికట్టుగా బీజేపీ టీం అని సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు. బీజేపీని కూడా మతతత్వ పార్టీ అంటున్నారు. మణిపూర్ ఇష్యూని మళ్లీ ఏపీలో కొత్తగా ముందుకు తెచ్చారు.

బీజేపీ మతాలను తెచ్చి విడదీస్తోందని నిప్పులు చెరిగారు. ఏపీకి బీజేపీ ఏమీ చేయలేదని కూడా ఆమె తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు ఏపీ ప్రజలు బీజేపీకి ఒక్క ఓటు కూడా వేయలేదని చులకన చేస్తున్నారు ఇలా ఇన్ని రకాలుగా బీజేపీ మీద షర్మిల కామెంట్స్ చేస్తూంటే ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా ఉన్న పురంధేశ్వరి నుంచి కనీస స్పందన లేకపోవడం చిత్రంగా ఉందని అంటున్నారు.

నరేంద్ర మోడీను కూడా షర్మిల విమర్శిస్తున్నా బీజేపీ ఏపీ పెద్దగా ఎందుకు ఖండించడం లేదు అన్న ప్రశ్నలు వస్తున్నాయి. షర్మిల బీజేపీ మీద ఒక విధంగా చెప్పాలంటే నిప్పులే చెరుగుతున్నారు. ఆ పార్టీని ఏకి పారేస్తున్నారు.

మరి ఇంతలా మరే రాజకీయ పార్టీ నుంచి విమర్శలు వచ్చినా పురంధేశ్వరి ఈపాటికి ఊరుకునే వారు కారేమో. కానీ షర్మిల విషయంలో ఎందుకు మౌనమే నా భాష అంటున్నారు అన్నది ఎవరికీ అర్ధం కావడం లేదు అంటున్నారు.

మరి ఎందుకొచ్చిన రచ్చ అని ఊరుకున్నారా లేక కొద్ది రోజుల పాటు కొత్త వేడి అలా ఉంటుందని సహనం పాటిస్తున్నారా లేక ఆమె విమర్శలకు జవాబు ఇవ్వనక్కరలేదు అని లైట్ తీసుకుంటున్నారా అన్నది పురంధేశ్వరికే తెలియాలి అని అంటున్నారు. ఆమె మాత్రం షర్మిల విమర్శలకు కౌంటర్ ఇవ్వకపోవడమే చిత్రంగా ఉందని అంటున్నారు.

ఏపీకి ఎంతో చేశామని బీజేపీ నేతలు తెల్లారి లేస్తే మీడియా ముందుకు వచ్చి చెబుతారు. ఏపీలో జగన్ ప్రభుత్వం తమ పధకాలను స్టిక్కర్లు వేసుకుంటోందని గగ్గోలు పెడతారు. మరి ఏపీకి ఏ ఒక్కటీ బీజేపీ చేసిన పాపాన పోలేదని షర్మిల అంటే దానికి జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఉందా లేదా అన్నదే చర్చ ఇపుడు.

మరి పురంధేశ్వరి నిజంగా పెదవి విప్పి బదులిస్తారా లేక షర్మిల రాజకీయం అంతా వైసీపీ వర్సెస్ కాంగ్రెస్ గా చూస్తూ ఊరుకుంటారా అన్నది ఆలోచించించాల్సిందే. ముందే చెప్పుకున్నట్లుగా ఏపీలో పాలిటిక్స్ వింతగా విచిత్రంగా సాగుతూ ఉంటుంది. మరి అందులో ఇది కూడా భాగమా అంటే ఏమో మరి.