Begin typing your search above and press return to search.

29 ఏళ్ల త‌ర్వాత‌.. అన్న‌గారి కుటుంబంలో అరుదైన ఘ‌ట్టం!

ఇలా.. అప్ప‌ట్లో చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి అయ్యేందుకు ద‌గ్గుబాటి స‌హ‌క‌రించారు.

By:  Tupaki Desk   |   11 Jun 2024 5:30 PM GMT
29 ఏళ్ల త‌ర్వాత‌.. అన్న‌గారి కుటుంబంలో అరుదైన ఘ‌ట్టం!
X

దాదాపు 29 సంవ‌త్స‌రాల త‌ర్వాత‌.. టీడీపీ వ్య‌వ‌స్థాపకులు, అన్న‌గారు ఎన్టీఆర్ కుటుంబంలో అరుదైన ఘ‌ట్టం చోటు చేసుకుంది. అప్ప‌ట్లో చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తుగా నిలిచిన కుటుంబం అన్న‌గారి పెద్ద‌ల్లుడు, ర‌చ‌యిత ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు ఫ్యామిలీ. అప్పట్లో రాజ‌కీయ స‌మీక‌ర‌ణల నేప‌థ్యంలో చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి అయ్యేందుకు ద‌గ్గుబాటి స‌హ‌క‌రించారు. రాజ‌కీయ సంక్షో భ స‌మ‌యంలోనే చంద్ర‌బాబును ముఖ్య‌మంత్రిగా ద‌గ్గుబాటి ప్ర‌తిపాదించారు. దీంతో చంద్ర‌బాబు అప్ప‌ట్లో ముఖ్య‌మంత్రి అయ్యా రు. ఇలా.. అప్ప‌ట్లో చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి అయ్యేందుకు ద‌గ్గుబాటి స‌హ‌క‌రించారు.

తాజాగా ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డుతోంది. దీనికి బీజేపీ, జ‌న‌సేన పార్టీలు మ‌ద్ద‌తుగా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఏపీ శాసనసభపక్ష నేతగా చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే 29 ఏళ్ల తర్వాత ఓ అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. తొలిసారి చంద్రబాబు సీఎం అయ్యే మందు ఆయన పేరును తోడళ్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రతిపాదించ‌గా.. తాజాగా ఆయన భార్య, బీజేపీ ఏపీ చీఫ్‌, రాజ‌మండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి చంద్రబాబుకు మద్దతు పలికారు. ఎన్డీయే కూట‌మి పార్టీల త‌ర‌ఫున ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా తాము చంద్ర‌బాబుపేరును ప్ర‌తిపాదిస్తున్న‌ట్టు ఆమె పేర్కొన్నారు.

దీంతో 1995 నాటి పరిణామాలను టీడీపీ నేతలు గుర్తు చేసుకుంటున్నారు. అప్ప‌ట్లో ద‌గ్గుబాటి చంద్ర‌బాబు పేరును ప్ర‌స్తావించిన త‌ర్వాత‌.. ప్ర‌భుత్వంలోనూ ఆయ‌న చేరారు. దీంతో ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి కూడా ద‌క్కింది. అయితే.. కొన్నాళ్ల‌కే ఆయ‌న చంద్ర‌బాబుతో విభేదించి మంత్రిప ద‌వికి రాజీనామా చేశారు. అయితే.. పార్టీలో కొన‌సాగారు. 2004కు ముందు అప్ప‌టి కాంగ్రెస్ నేత వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించి ద‌గ్గుబాటి దంప‌తుల‌ను టీడీపీ నుంచి బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చారు. త‌ర్వాత పురందేశ్వ‌రి కేంద్రంలో మంత్రి కావ‌డం తెలిసిందే. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఆమె బీజేపీలో చేరారు. ప్ర‌స్తుతం ఆమె ఎంపీగా ఉన్నారు.