Begin typing your search above and press return to search.

పుతిన్ నోట "డిస్కో డ్యాన్సర్" మాట... ఇండియన్ సినిమాపై ఇంట్రస్టింగ్ కామెంట్స్!

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఇండియన్ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   19 Oct 2024 9:30 AM GMT
పుతిన్  నోట డిస్కో డ్యాన్సర్ మాట... ఇండియన్  సినిమాపై ఇంట్రస్టింగ్  కామెంట్స్!
X

భారత్ సభ్యదేశంగా ఉన్న ఐదు దేశాల కూటమి "బ్రిక్స్" (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా) సమావేశం ఈ నెల 22, 23 తేదీల్లో రష్యాలో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు భారత ప్రధాని మోడీ పర్యటన ఇప్పటికే ఖరారైంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఇండియన్ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అవును... ఈ నెల 22, 23 తేదీల్లో రష్యా వేదికగా భారత్ తో పాటు ఐదు దేశాలు సభ్యులుగా ఉన్న బ్రిక్స్ సమావేశం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పుతిన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా... "బ్రిక్స్ సభ్యదేశాలు రష్యాలో చిత్రీకరించే సినిమాలకు ప్రోత్సకాలు ప్రకటిస్తారా" అన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు.

ఇందులో భాగంగా... ఇండియన్ సినిమాలకు రష్యాలో మంచి ఆదరణ ఉంది అని మొదలుపెట్టిన పుతిన్... వీటికోసం తమ దేశంలో 24 గంటల ప్రత్యేక టీవీ ఛానల్ కూడా ఉందని తెలిపారు. ఇదే సమయంలో తమకు భారతీయ సినిమాలంటే అమితమైన ఆసక్తి అని.. తాము "బ్రిక్స్ ఫిల్మ్ ఫెస్టివల్" నూ నిర్వహిస్తున్నామని అన్నారు.

ఇదే క్రమంలో... రష్యాలో భారతీయ సినిమాలు ప్రదర్శించడానికి తాము సానుకూలంగా ఉన్నామని.. వారి సినిమాలు రష్యాలో ప్రమోట్ చేసుకోవడానికి ప్రత్యేక వేదికనూ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అదేవిధంగా ఫార్మా రంగానికి సైతం అనుకూల వాతావరణం ఉందని.. ఈ విషయాలపై మోడీతో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పుతిన్ పేర్కొన్నారు.

ఇదే సమయంలో.. భారత్ తో పాటు బ్రిక్స్ కూటమిలోని ఇతర దేశాల సినిమాలు, నటులను చూడటం చాలా ఆనందంగా ఉంటుందని చెప్పిన పుతిన్.. థియేట్రికల్ ఆర్ట్ ఫెస్టివల్ ను ఏర్పాటు చేయాలనే విషయంపై ఇప్పటికే బ్రిక్స్ కూటమి సభ్యులంతా చర్చించుకున్నామని.. ఇప్పటికే సినిమా అకాడమీని ఏర్పాటు చేశామని తెలిపారు.

ఈ నేపథ్యంలో... భారతీయ సినిమాలను రష్యాలో ఎంతో ఆదరణ ఉంటుందని చెప్పిన పుతిన్... 1982లో వచ్చిన "డిస్కో డ్యాన్సర్" మూవీ సోవియట్ యూనియర్ లో ఓ ప్రభంజనం సృష్టించిందని గుర్తుచేసుకున్నారు!