Begin typing your search above and press return to search.

లైవ్ లో పుతిన్ కి షాకిచ్చిన మరో పుతిన్... వీడియో వైరల్!

అవును... తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ కు మరో పుతిన్ కనిపించి షాక్ ఇచ్చారు. అయితే ఇది బాడీ డబుల్ కాదు... కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) పనితనం కావడం గమనార్హం.

By:  Tupaki Desk   |   16 Dec 2023 3:50 PM GMT
లైవ్  లో పుతిన్  కి షాకిచ్చిన మరో పుతిన్... వీడియో వైరల్!
X

గతకొన్ని రోజులుగా రష్యా అధ్యక్షుడి బాడీ డబుల్స్ విషయంపై తీవ్ర చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 71 ఏళ్ల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు డూప్ ఉన్నారని.. ప్రస్తుతం ప్రపంచానికి కనిపిస్తున్నదీ ఆయన డూప్ అని.. కొంతకాలంగా ఆయన బాడీ డబుల్స్ వాడుతున్నారని చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో తాజాగా పుతిన్ కి లైవ్ లో మరో పుతిన్ కనిపించడం ఆసక్తిగా మారింది.

అవును... తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ కు మరో పుతిన్ కనిపించి షాక్ ఇచ్చారు. అయితే ఇది బాడీ డబుల్ కాదు... కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) పనితనం కావడం గమనార్హం. లైవ్ లో మరో పుతిన్ కనిపించడంతో షాక్ తిన్న ఒరిజినల్ పుతిన్... కాసేపు మౌనంగా ఉండిపోయారు. అనంతరం తేరుకుని తనదైన రీతిలో స్పందించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.

వివరాళ్లోకి వెళ్తే... మాస్కోలో ఇటీవల జరిగిన వార్షిక విలేకరుల సమావేశంలో పుతిన్ కు వింత అనుభవం ఎదురైంది. ఆ సమావేశంలో పాల్గొన్న ఆయనకూ .. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దాని వల్ల వచ్చే ప్రమాదాల గురించిన ప్రశ్న ఎదురైంది. అయితే ఆ ప్రశ్న అడిగింది అక్కడున్న జర్నలిస్ట్ కాదు! అచ్చం పుతిన్‌ మాదిరిగానే రూపొందించిన ఆర్టిఫిషియల్ పుతిన్.

ఈ సందర్భంగా ఆ విలేకరుల సమావేశంలో రష్యా అధ్యక్షుడితో ఆ "ఏఐ పుతిన్‌" మాట్లాడారు. ఇందులో భాగంగా... తానేను సెయింట్‌ పీటర్స్‌ బర్గ్‌ స్టేట్‌ యూనివర్శిటీ విద్యార్థిని అని తెలిపారు. ఈ క్రమ్మలో... "మిమ్మల్ని ఓ ప్రశ్న అడగాలనుకుంటున్నాను.. మిమ్మల్ని పోలిన వ్యక్తులు చాలా మంది ఉన్నారన్నది నిజమేనా? అని ప్రశ్నిస్తూ "బాడీ డబుల్" అంశాన్ని తెరపైకి తెచ్చారు.

ఇదే సమయంలో... ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ తో ప్రజల జీవితాలకు ఎలాంటి ముప్పు ఉందని అనుకుంటున్నారు అంటూ ఏఐ పుతిన్, ఒరిజినల్ పుతిన్ ని ప్రశ్నించారు. ఈ సమయంలో ఏఈ మాయని లైవ్ లో పర్సనల్ గా ఎక్స్ పీరియన్స్ చేసిన పుతిన్... ఒకింత ఆశ్చర్యానికి గురై కాసేపు మౌనంగా ఉండిపోయారు అనంతరం తేరుకుని... ఏఐ పుతిన్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

ఇందులో భాగంగా... తనను పోలిన తొలి వ్యక్తివి నువ్వే అని ఏఐ పుతిన్ తో చెప్పడం గమనార్హం. ఇదే సమయంలో... నువ్వు నాలాగే ఉండొచ్చు.. నాలాగే మాట్లాడొచ్చు.. కానీ, నాలాగే ఉండే వ్యక్తి.. నాలాగే మాట్లాడే వ్యక్తి ఒకే ఒక్కరు ఉన్నారు.. అది నేనే అని రష్యా అధ్యక్షుడు అన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.