వైభవంగా P.V. సింధు-దత్త సాయి పెళ్లి
ఇప్పుడు రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లోని లేక్ సిటీలో ఏకాంతంగా ధేధీప్యమాన కాంతులతో వెలిగిపోయే రాఫెల్స్ ఉదయపూర్ రిసార్ట్‌లో పెళ్లి ప్రమాణాలు చేసుకున్నారు.
By: Tupaki Desk | 23 Dec 2024 3:59 AM GMTరెండుసార్లు ఒలింపిక్ పతక విజేత, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి PV సింధు 22 డిసెంబర్ 2024 ఆదివారం నాడు హైదరాబాద్‌కు చెందిన టెక్ ఎగ్జిక్యూటివ్ వెంకట దత్త సాయిని వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లికి 21 ఎకరాల్లో ఉన్న రాఫెల్స్ ఉదయపూర్ రిసార్ట్ వేదిక అయింది. ఈ వేడుకకు సుమారు 140 మంది అతిథులు హాజరయ్యారని సమాచారం. నేడు హైదరాబాద్ లో భారీ రిసెప్షన్ ఏర్పాటు చేసారని తెలుస్తోంది. ఇంకా కొత్త జంట ఫోటోలు విడుదల కాలేదు.
ఈ జంట తమకు నిశ్చితార్థం అయినట్టు డిసెంబర్ 12న ప్రకటించారు. ఆనందకర ఈవెంట్‌లో ఉంగరాలు మార్చుకున్న ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ఇప్పుడు రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లోని లేక్ సిటీలో ఏకాంతంగా ధేధీప్యమాన కాంతులతో వెలిగిపోయే రాఫెల్స్ ఉదయపూర్ రిసార్ట్‌లో పెళ్లి ప్రమాణాలు చేసుకున్నారు.
రాఫెల్స్ ఉదయపూర్ రిసార్ట్ అనేది ఐదు నక్షత్రాల మోడరేటెడ్ కంట్రీ మాన్షన్ స్టైల్ ప్రాపర్టీ. పాశ్చాత్య శైలిలో రిచ్ గా ఉంటుంది. ఇది ఉదయపూర్‌లోని గెస్ట్ లేక్‌షోర్‌లో ఉంది. భారతదేశంలోని మొదటి రాఫెల్స్ ప్రాపర్టీగా గుర్తింపు పొందింది. 2021 నుంచి ఈ వేదిక వద్ద సెలబ్రిటీ పెళ్లిల్లు జరుగుతున్నాయి. అందమైన గార్డెన్‌లు, ఫౌంటైన్‌లు .. గంభీరమైన ఇండో సారాసెనిక్ ఆర్కిటెక్చర్ తో వెన్యూ మతులు చెడగొడుతుంది. దాదాపు 21 ఎకరాల ప్రైవేట్ ద్వీపంలో పెళ్లి లైఫ్ టైమ్ జ్ఞాపకంగా నిలుస్తుంది. చుట్టూ జలపాతాలు, కొండల వ్యూతో ఎంతో అందంగా ఉంటుంది. ఉదయ్ సాగర్ సరస్సు ..దట్టమైన ఆరావళి కొండలకు అభిముఖంగా విస్తరించి ఉంది. ఈ ప్రాపర్టీలో విశాలమైన రీగల్ వసతి కోసం రూ. 75,000 నుండి రూ. 1,00,000 వరకు ఒక గదికి చెల్లించాల్సి ఉంటుంది. పన్ను అదనంగా వసూలు చేస్తారు. ఇక పి.వి.సింధు సుదీర్ఘ క్రీడా ప్రయాణంలో సుమారు 60 కోట్ల నికర ఆస్తులను కూడబెల్టారని కథనాలొచ్చాయి.
వెంకట దత్త సాయి ఎవరు?
వెంకట దత్త సాయి హైదరాబాద్‌కు చెందిన బిజినెస్‌మేన్. పోసిడెక్స్ టెక్నాలజీస్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. అతడు టెక్నాలజీ, ఫైనాన్స్, క్రీడారంగాలలో అభిరుచి ఉన్న నిపుణుడు. గొప్ప విద్యావంతుడు. అద్భుతమైన వృత్తిపరమైన ట్రాక్ రికార్డ్‌ను కలిగి ఉన్నారు. సాంకేతిక రంగాల్లో వ్యాపారాలను విస్తరించారు.