Begin typing your search above and press return to search.

అమెరికా లింకులు.. హాంకాంగ్ జర్నలిస్టుతో ప్రేమ చైనా విదేశాంగ మంత్రి గాయబ్

చైనా విదేశాంగ మంత్రి

By:  Tupaki Desk   |   18 July 2023 9:32 AM GMT
అమెరికా లింకులు.. హాంకాంగ్ జర్నలిస్టుతో ప్రేమ చైనా విదేశాంగ మంత్రి గాయబ్
X

ప్రజాస్వామ్య దేశ వ్యవస్థలో ప్రధాని సూపర్ పవర్. లేదా అధ్యక్ష తరహా పాలన అయితే ఆయనే సర్వాధికారి. ఆ తర్వాతి స్థానంలో రక్షణ, హోం, విదేశాంగ శాఖ మంత్రులు వస్తారు. ఇతర దేశాలతో సంబంధ బాంధవ్యాలను నెరపే విదేశాంగ శాఖ చాలా కీలకం. సంక్షోభ సమయాల్లో ప్రపంచానికి వారి దేశ వాణిని ప్రపంచానికి వినిపించేది విదేశాంగ మంత్రే. అంతర్జాతీయ వేదికలపై దేశ ప్రతిష్ఠను నిలపాలన్నా వారే కీలకం.

ఉదాహరణకు భారత్ వాణిని జైశంకర్ వివిధ వేదికలపై ఎంత బలంగా చెబుతున్నారో చూడండి. అయితే, కమ్యూనిస్టు చైనాకూ ఇలాంటి మంత్రే ఉన్నారు. కానీ, ఆయన జూన్ 25 నుంచి కనిపించడం లేదు.

ఏమయ్యారు..? ఎటు పోయారు?

భుత్వాన్ని ధిక్కరించిన వ్యాపార, టెక్‌ వర్గాలపై డ్రాగన్‌ అణచివేత కారణంగా గతంలో పలువురు ప్రముఖులు నెలల తరబడి అదృశ్యం కావడం తీవ్ర ఆందోళనలు రేకెత్తించింది. అలాంటిది ఇప్పుడు సొంత ప్రభుత్వంలోని మంత్రే కన్పించకుండా పోవడం చర్చనీయాంశంగా మారింది.

చైనా విదేశాంగ మంత్రి పేరు కిన్ గాంగ్‌. డిసెంబరులో ఈ బాధ్యతల్లోకి వచ్చారు. దీనికిముంద అమెరికాలో చైనా రాయబారి. గాంగ్ పనితీరును మెచ్చో ఏమో చైనా అధ్యక్షుడు షీ జిన్‌ పింగ్‌ ఆయనను విదేశాంగ మంత్రిగా తీసుకున్నారు. ఇది కేవలం జిన్ పింగ్ నిర్ణయమే అని అంటారు. అయితే, అలాంటి గాంగ్ ప్రస్తుతం ఆచూకీ లేరు. మూడు వారాల నుంచి కనిపించడం లేదు. గాంగ్ అదృశ్యంపై చైనా సర్కారు కూడా సరైన కారణాలు వెల్లడించడం లేదు. దీంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి. కాగా, గాంగ్ అధికారిక కార్యక్రమాల్లోనూ కన్పించట్లేదు. చివరిసారిగా జూన్‌ 25న బీజింగ్‌ లో శ్రీలంక, వియత్నాం, రష్యా అధికారులతో ఆయన సమావేశమయ్యారు.

అమెరికా మంత్రితో భేటీకీ దూరం

గత వారం కీలకమైన అసియాన్‌ సమావేశానికీ గాంగ్‌ డుమ్మాకొట్టారు. అనారోగ్యమే దీనికి కారణమని ఆయన శాఖ ప్రకటించింది. చైనా కీలక దౌత్యవేత్త వాంగ్ యీ ఆసియాన్ లో పాల్గొన్నారు. విదేశాంగ శాఖ బాధ్యతలను కూడా ఆయనే చేతుల్లోకి తీసుకున్నట్లు సమాచారం. అన్నిటికంటే గమనార్హం ఏమంటే చాలా ఏళ్ల తర్వాత చైనా పర్యటనకు వచ్చిన అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ నునూ గాంగ్ కలవలేదు. దీంతో అనుమానాలు ఇంకా ఎక్కువ అవుతున్నాయి.

ఏమైపోయారు..?

గాంగ్‌ అదృశ్యంపై చైనా విదేశాంగ శాఖ ఏమీ చెప్పడం లేదు. తమ వద్ద ఎలాంటి సమాచారం లేదంటోంది. ఇక గాంగ్ గురించి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అమెరికా సిటిజన్, టీవీ జర్నలిస్టు ఫు షియోటియాన్‌, గాంగ్‌ ప్రేమించుకున్నట్లు చైనా మీడియా కథలు చెబుతిం. అయితే, చైనాతో తీవ్ర విభేదాలున్న హాంకాంగ్‌ మీడియాలో ఫు పనిచేస్తోంది. వీరు ళ్లి చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారనిచైనా మీడియా పేర్కొంటోంది. ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు.

చైనాలో గతంలోనూ ప్రభుత్వ అధికారులు ప్రజా జీవితం నుంచి గాయబ్ అయ్యారు. అవినీతి కేసులే ఇందుకు కారణమని.. ప్రభుత్వం వారిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు తర్వాత వెల్లడైంది. కాగా, గాంగ్‌ అవినీతిపరుడా? కాదా? తేలలేదు. కానీ విదేశాంగ శాఖ బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే అమెరికన్లపై ప్రశంసలు కురిపించారు. అసలే అమెరికాతో ఉప్పు నిప్పులా ఉండే చైనా సర్కారు దీనిని ఏవిధంగా తీసుకుందో తెలియరాలేదు.