సైనికుల వీర్యం కోసం క్యూ కట్టారు.. ఎక్కడంటే!
ఇక, తాజాగా ఇజ్రాయెల్ -హమాస్ మధ్య గత నెల రోజులుగా సాగుతున్న భీకర యుద్ధంలో ఇజ్రాయెల్ సైనికులు పదుల సంఖ్యలో మరణిస్తున్నారు.
By: Tupaki Desk | 10 Nov 2023 2:30 PM GMTసైనికులు. దేశం కోసం ప్రాణత్యాగాలకు వెరువని యోధులు. ఏదేశానికి చెందిన సైనికులు ఆదేశానికి వీరు లే. మన దగ్గర అయితే.. సైనికుల మృతిని దేశవ్యాప్తంగా అమర వీరుల దినోత్సవంగా కూడా చేసుకుని వారి త్యాగాలను మననం చేసుకుంటాం. నివాళులు అర్పిస్తాం. అదేవిధంగా ఇతర దేశాల్లోనూ ఇంతే గౌరవం లభిస్తుంది. ఇక, తాజాగా ఇజ్రాయెల్ -హమాస్ మధ్య గత నెల రోజులుగా సాగుతున్న భీకర యుద్ధంలో ఇజ్రాయెల్ సైనికులు పదుల సంఖ్యలో మరణిస్తున్నారు.
దేశం తరఫున హమాస్‌పై పోరాడుతున్న వీరు ప్రాణత్యాగాలు చేస్తున్నారు. అయితే.. మృతి చెందిన సైనికులకు ఓవైపు నివాళులర్పిస్తూనే.. వారి వీర్యాన్ని సేకరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మృత శరీరాల నుంచి 36 గంటల్లో వీర్యాన్ని సేకరిస్తున్నారు. ఇక, వీరి వీర్యాన్ని తీసుకునేందుకు సదరు సైనిక కుటుంబాలతో పాటు.. పిల్లలు లేని మహిళలు కూడా రెడీ అయ్యారు. దీంతో వీర్యానికి డిమాండ్ ఏర్పడింది.
ఇప్పటి వరకు ఇజ్రాయెల్‌కు చెందిన 33 మంది మృత సైనికుల శరీరాల నుంచి వీర్యాన్ని సేకరించి భద్రపరిచారు. ఈ వీర్యం కోసం.. వందల సంఖ్యలో దరఖాస్తులు ప్రభుత్వానికి చేరాయి. వీటిలో ఆయా సైనికుల సతీమణులు కూడా ఉన్నారు. తమ భర్తలు ఎలానూ దక్కకపోయినా.. వారి వీర్యంతో అయినా.. పిల్లలను కనాలనేదివీరి ఆకాంక్ష. ఇక, పిల్లలు లేని మహిళలు కూడా ఈ వీర్యం తీసుకునేందుకు క్యూ కడుతున్నారు.
ఎందుకింత డిమాండ్?
సైనికుల వీర్యానికి ఇంత డిమాండ్ ఎందుకు? అనే ప్రశ్న సహజం. దీనికి కారణం.. వారి సౌర్య పరాక్రమాలేనని అంటున్నారు నిపుణులు. వీర్యంలోని జన్యువులు .. వ్యక్తి సౌర్యానికి, ధైర్యానికి.. ప్రతీకగా ఉంటాయని అందుకే..ఈ వీర్యంతో జన్మించిన పిల్లలు అంతే సౌర్య పరాక్రమాలతో జన్మిస్తారని.. అందుకే.. ఇంత డిమాండ్ ఉంటుందని చెబుతున్నారు.